Blind Woman : కంటి చూపు కోల్పోయినా బ్రెయిలీ నేర్చుకొని జూనియర్ లెక్చరర్‌గా ఉద్యోగం సాధించిన యువతి.. వీడియో..!
Blind Woman : ఆ మహిళకు కంటి చూపు లేదు. ఏం చూడలేదు. చుట్టూ చీకటి. కానీ.. తన జీవితంలో ఆ చీకటి ఉండకూడదని ధైర్యం తెచ్చుకొని ఆ మహిళ జీవితంలో ఒక స్థానంలో నిలబడింది. అందుకే ఇప్పుడు మనం ఆ మహిళ గురించి మాట్లాడుకుంటున్నాం. చిన్న సమస్య వస్తేనే ఇక తమ జీవితం అయిపోయిందని అనుకుంటారు. తమ జీవితం ముగిసిపోయిందని అనుకుంటారు. అన్నీ సరిగ్గా ఉన్నా కూడా జీవితంలో ఏం చేయలేక జీవితంలో సక్సెస్ కాలేకపోతారు. కానీ.. ఈ మహిళ మాత్రం కంటి చూపు లేకపోయినా కూడా బ్రెయిలీ నేర్చుకొని జూనియర్ లెక్చరర్ గా ఉద్యోగం సాధించింది. అందరికీ ఆదర్శంగా నిలిచింది ఆ మహిళ.
అనంతపురానికి చెందిన అనిత ఐదో తరగతి వరకు కంటి చూపుతోనే ఉండేది. తను 5 వ తరగతిలో ఉన్నప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో తను కంటి చూపు కోల్పోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటి చూపు రాలేదు. అయినా కూడా తన ధైర్యాన్ని కోల్పోలేదు. జీవితంలో సక్సెస్ సాధించడానికి ఏదీ అడ్డు కాదు అని చాటి చెప్పారు అనిత.తనకు నరాలు వీక్ అవడంతో పూర్తిగా కంటి చూపు కోల్పోయింది అనిత. తనకు సర్జరీ చేసినా కూడా కంటి చూపు రాలేదు. ఆ తర్వాత తనకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ తర్వాత బ్రెయిలీ లిపి గురించి తెలుసుకొని హిందూపురంలో ప్రత్యేకంగా బ్రెయిలీ లిపీ నేర్పించే పాఠశాలలో చేరి బ్రెయిలీ లిపీ నేర్చుకుంది అనిత.
Blind Woman : నరాలు వీక్ అవడంతో పూర్తిగా కంటి చూపు కోల్పోయిన అనిత
అలా డిగ్రీ ఫస్టియర్ చదువుతున్నప్పుడే తనకు చాలా ఉద్యోగాలు వచ్చాయి. చివరకు తను జూనియర్ లెక్చరర్ గా ప్రస్తుతం ప్రభుత్వ కాలేజీలో చదువు చెబుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది అనిత. అన్నీ ఉన్నా ఏం చేయలేక కుంటి సాకులు చెప్పే వాళ్లు అనితను చూసి కాస్తో కూస్తో స్ఫూర్తి పొందాలి. కష్టపడితే ఏదైనా సాధ్యం అని అనిత నిరూపించింది.