KVS Admission : కేంద్రీయ విద్యాలయంలో సీటు దక్కించుకోవాలంటే అర్హతలు ఇవే..!
ప్రధానాంశాలు:
KVS Admission : కేంద్రీయ విద్యాలయంలో సీటు దక్కించుకోవాలంటే అర్హతలు ఇవే..!
KVS Admission : కేంద్రీయ విద్యాలయంలో సీట్ల భర్తీ కోసం తాజాగా నోటిఫికేషన్ జారీ అయింది. 11వ తరగతి వరకు ప్రవేశాలు కల్పించనుండగా ఒకటో తరగతిలో ప్రవేశాలకు మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తు అవకాశం కల్పించబోతున్నారు. అయితే కేంద్రీయ విద్యాలయాల్లో 2025-26 అడ్మిషన్లకు నోటిఫికేషన్ లో ఒకటో తరగతిలో చేరేందుకు మార్చి 31వ తేదీ నాటికి ఆరు నుంచి 8 ఏళ్ల మధ్యలో వయసు ఉన్న విద్యార్ధులు అర్హులుగా పేర్కొన్నారు.

KVS Admission : కేంద్రీయ విద్యాలయంలో సీటు దక్కించుకోవాలంటే అర్హతలు ఇవే..!
KVS Admission ఇలా చేయండి..
తొలి జాబితా ఈనెల 25న, రెండో జాబితా ఏప్రిల్2న, మూడో జాబితా ఏప్రిల్7న ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంస్థల ఉద్యోగుల చిన్నారులకు నాలుగో ప్రాధాన్యం ఉంటుంది. విద్యాహక్కు చట్టం కింద 10 సీట్లు పాఠశాలకు ఐదు కిలోమీటర్ల పరిధిలోని వారు అర్హులుగా పేర్కొన్నారు. కేంద్రీయ విద్యాలయాల్లో 1 నుంచి 11వ తరగతి వరకు ప్రవేశాలకు రిజర్వేషన్ ఎస్సీ 15 శాతం, ఎస్టీ 7.5 శాతం, ఓబీసీ 27 శాతం, దివ్యాంగులకు 3 శాతం ఉంటుందని తెలియజేశారు.
జనన, కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తులను పరిశీలించి, లాటరీలో ఎంపికైన విద్యార్థుల వివరాలను విద్యాలయం సంఘటన్నేరుగా ఆయా కేవీఎస్లకు అందజేస్తుంది. మిగిలిన తరగతుల్లో ప్రవేశాలకు విద్యాలయాలకు వెళ్లి నేరుగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు లాటరీ పద్ధతిలో సీట్ల కేటాయించనున్నట్టు తెలియజేశారు.. తొలి జాబితా ఈనెల 25న, రెండో జాబితా ఏప్రిల్2న, మూడో జాబితా ఏప్రిల్7న ఉంటుంది.