Kadapa..ప్రతీ ఒక్కరు నిబంధనలు పాటించాలి: ఎస్పీ అన్బురాజన్
కొవిడ్ మహమ్మారి ఫస్ట్, సెకండ్ వేవ్స్ ఇప్పటికే పూర్తి కాగా, ప్రజెంట్ థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్నదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీలో ప్రభుత్వం అధికారులు ప్రజల కోసం పలు చర్యలు తీసుకుంటున్నారు. కడప జిల్లాలో కర్ఫ్యూ కొనసాగుతున్నది. కాగా, నిబంధనలు ఉల్లంఘించిన మద్యం, ఇతర షాపు యజమానులు పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. జిల్లాలో నిబంధనల ఉల్లం‘ఘనుల’పై ఇప్పటి వరకు అనగా గురువారం రాత్రి వరకు 508 కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ అన్బురాజన్ శుక్రవారం తెలిపారు.
మొత్తంగా రూ.63 వేల ఫైన్ విధించినట్లు పేర్కొన్నారు. ఇకపోతే ప్రతీ ఒక్కరు కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. టీకా తీసుకున్నప్పటికీ మాస్కు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని తెలిపారు. మద్యం, ఇతర షాపుల వద్ద షాప్స్ నిర్ణీత సమయాల్లో ఓపెన్ చేసినప్పుడు భౌతిక దూరం పాటించేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతీ ఒక్కరు మస్కు ధరించడం మస్ట్ అని చెప్పారు.