7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మార్చిలో వచ్చే జీతంతో పాటు రూ.38692 బకాయిలు రానున్నాయి
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. అవును.. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సెవెన్త్ పే కమిషన్ బకాయిలపై కేంద్రం లైన్ క్లియర్ చేసింది. వచ్చే నెల రాబోయే హోలీ పండుగ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురును తీసుకొచ్చింది. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకే కాదు.. పెన్షన్ దారులకు కూడా గుడ్ న్యూసే.
చాలా ఎదురు చూపుల తర్వాత 3 శాతం డీఏను ప్రభుత్వం ఫిక్స్ చేసింది. ప్రస్తుతం అందరు ఉద్యోగులు 31 శాతం డీఏ పొందుతున్నారు. కానీ.. జనవరి 2022 నుంచి 3 శాతం ఎక్కువ డీఏను ఉద్యోగులు పొందనున్నారు. ఇది సెవెన్త్ పే కమిషన్ సిఫారసు ప్రకారం కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
7th Pay Commission : లబ్ధి పొందనున్న 50 లక్షల ఉద్యోగులు, 65 లక్షల పెన్షన్ దారులు
కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల.. 50 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. 34 శాతం డీఏకు పెరగడంతో.. బేసిక్ జీతం రూ.18,000 ఉంటే.. వాళ్లకు సంవత్సరానికి రూ.73,440 డీఏ ఒక ఉద్యోగికి అందనుంది. అంటే నెలకు రూ.6480 జీతం పెరగనుంది. మొత్తం మీద వచ్చే నెల అంటే మార్చిలో వచ్చే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తమ జీతంతో పాటు అదనంగా రూ.38692 బకాయిలను కేంద్రం చెల్లించనుంది.