Allu Arjun : మ‌రో వివాదంలో అల్లు అర్జున్.. ఈ మ‌ధ్య ఇలా విమ‌ర్శ‌ల పాల‌వుతున్నాడేంటి? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Allu Arjun : మ‌రో వివాదంలో అల్లు అర్జున్.. ఈ మ‌ధ్య ఇలా విమ‌ర్శ‌ల పాల‌వుతున్నాడేంటి?

 Authored By sandeep | The Telugu News | Updated on :5 February 2022,10:34 am

Allu Arjun : సాధారణంగా అల్లు అర్జున్ వివాదాల‌కి చాలా దూరంగానే ఉంటాడు. ఇటీవ‌ల మ‌నోడు వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల‌పై ప్ర‌త్యేక దృష్టి పెట్టాడు. దీంతో విమ‌ర్శ‌ల పాల‌వుతున్నాడు. . ఫ్రూటీ, రాపిడోతో పాటు రెడ్ బస్ కి కూడా బన్నీ బ్రాండ్ అంబాసిడర్ అన్న సంగతి తెల్సిందే. తాజాగా ఇప్పుడు బన్నీ ఖాతాలో జొమాటో కూడా వచ్చి చేరింది. అయితే రాపిడో యాడ్ చేసిన‌ప్ప‌డు అందులో ఆర్టీసీ బ‌స్సుని కించ‌ప‌రిచిన‌ట్టు యాడ్ చిత్రీక‌రించారు. దీంతో అత‌నితో పాటు యాడ్ నిర్వాహ‌కుల‌పై కూడా ఆర్టీసీ యాజ‌మాన్యం ఫైర్ అయింది. ఇక తాజాగా చేసిన జొమాటో యాడ్ కూడా వివాదాస్ప‌దం కావ‌డంతో ఈ వార్త చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

అల్లు అర్జున్ నటించిన జోమాటో యాడ్‌పై నెటిజన్లు, సౌత్‌ సినీ ప్రియులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో బన్నీ చెప్పిన ఓ డైలాగ్‌పై సౌత్‌ ఇండియా సినీ ప్రేక్షకుల మండిపడుతున్నారు. ఇంతకి అసలు విసయం ఎంటంటే.. అల్లు అర్జున్‌ తాజాగా నటించిన ఈ కమర్షియల్‌ యాడ్‌లో నటుడు సుబ్బరాజు కూడా నటించిన సంగతి తెలిసిందే. ఇందులో సుబ్బరాజును బన్నీ కొడతాడు. బన్నీ దెబ్బకు సుబ్బరాజు గాల్లో తేలిపోతాడు. బన్నీ నన్ను త్వరగా కిందకు దించవా?.. అని సుబ్బరాజు అడుగుతాడు. సౌత్ సినిమా కదా? ఎక్కువ సేపు ఎగరాలి అని బన్నీ అంటాడు.

allu arjun trolls on his zomato advertisement

allu arjun trolls on his zomato advertisement

Allu Arjun : మ‌రో వివాదంలో ఐకాన్ స్టార్..

అంతే సౌత్ సినిమాలు, అందులో యాక్షన్ సీక్వెన్స్‌లపై బన్నీ కౌంటర్ వేసినట్టుగా ఉంది. మొత్తానికి ఇప్పుడు ఈ యాడ్ మాత్రం నెట్టింట్లో వైరల్ అవుతోంది. అయితే సౌత్ సినిమాల‌పై కౌంట‌ర్ వేసిన‌ట్టుగా యాడ్ చేయ‌డంతో ప‌లువురు మండిప‌డుతున్నారు. రాపిడో సంస్థకు చెందిన ఈ ప్రకటనలో.. ఆర్టీసీని అవమానించారు, ఇప్పుడు సౌత్ సినిమాల‌ను అవ‌మానిస్తున్నారా అంటూ .. తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీనిపై బన్నీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.ఇటీవ‌ల పుష్ప చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన బ‌న్నీ ఇప్పుడు పుష్ప పార్ట్ 2 షూటింగ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నట్టు కనిపిస్తోంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది