Hero Raviteja – YS Jagan : హీరో రవితేజకి బంపర్ ఆఫర్ ఇచ్చిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ !
Hero Raviteja – YS Jagan : ఏపీ ప్రభుత్వం టాలీవుడ్ హీరో రవితేజకి బంపర్ ఆఫర్ ఇచ్చింది. అదేంటి.. రవితేజకు బంపర్ ఆఫర్ ఇవ్వడం ఏంటి.. ఆయన ఏమైనా రాజకీయాల్లో చేరుతున్నారా? లేక ఏమైనా పదవి ఇస్తున్నారా అని అనుకోకండి. మాస్ మహారాజా రవితేజ నటించిన రావణాసుర సినిమా ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలుసు కదా. ఈ సినిమాకి సుధీర్ వర్మ డైరెక్టర్.
ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఏప్రిల్ 7న విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమాకు ఏపీలో అడిషనల్ షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతించింది. కాకపోతే అన్ని థియేటర్లలో కాదు. ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో ఈ సినిమా ప్రత్యేక షోను ప్రదర్శించనున్నారు. తెల్లవారుజామున అంటే ఎర్లీ మార్నింగ్ షోలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Hero Raviteja – YS Jagan : ఎర్లీ మార్నింగ్ షోలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
దీంతో రవితేజ అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. సాధారణంగా ఉండే నాలుగు షోలతో పాటు ఎర్లీ మార్నింగ్ షోతో 5 షోలు అవుతాయి. రవితేజ అభిమానులకు ఇది నిజంగా ఎగిరి గంతేసే న్యూస్ అనే చెప్పుకోవాలి. రవితేజ లాస్ట్ మూవీ ధమాకా భారీగా విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అందుకే.. రావణాసుర సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.