YS Viveka Murder Case : వైఎస్ వివేకా కేసులో అవినాష్ రెడ్డికి నోటీసులు ఇవ్వడం వెనక సీబీఐ ప్లాన్ ఇదేనా?
YS Viveka Murder Case : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య అప్పట్లో రాష్ట్రంలోనే సంచలనం సృష్టించింది. ఆయన హత్య కేసు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసు విషయమై సీబీఐ అధికారులు పులివెందులకు చేరుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న వాళ్లు, ఆరోపణలను ఎదుర్కుంటున్న వాళ్ల గురించి పులివెందులలో అధికారులు ఆరా తీశారు.
అది పక్కన పెడితే సీబీఐ అధికారులు.. వైఎస్ వివేకా హత్య కేసు విషయంలో ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. అయితే.. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణకు హాజరు కావాలని అవినాష్ కు నోటీసులు ఎందుకు జారీ చేశారు అనేదే పెద్ద ప్రశ్నగా మిగిలింది. ఇవాళ ఉదయమే హైదరాబాద్ లో ఉన్న సీబీఐ ఆఫీసులో విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి ఇంటికి వెళ్లిన సీబీఐ అధికారులు..
YS Viveka Murder Case : 24 గంటలు కూడా గడువు ఇవ్వకుండా విచారణకు హాజరు అంటే ఎలా
ఆయన ఇంటికి వెళ్లిన కొన్ని గంట్లోనే అవినాష్ కు నోటీసులు జారీ చేశారు. ఇంత సడెన్ గా నోటీసులు జారీ చేయడం ఏంటంటూ… వైఎస్ అవినాష్ నోటీసులపై స్పందించారు. కనీసం 24 గంటల గడువు కూడా ఇవ్వకుండా విచారణకు హాజరు కావాలని ఆదేశించడం ఏంటంటూ ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను దర్యాప్తునకు పూర్తి స్థాయిలో సహకారాన్ని అందిస్తాను కానీ.. ఇలా గడువు ఇవ్వకుండా విచారణకు పిలవడం ఏంటంటూ తెలిపారు. అయిదు రోజుల తర్వాత ఎప్పుడు పిలిచినా తాను వస్తానని.. సీబీఐ అధికారులకు అవినాష్ చెప్పినట్టు తెలుస్తోంది.