Central Govt : ఆగస్టు 1 నుండి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం… దేశవ్యాప్తంగా 4 కీలక మార్పులు..!
ప్రధానాంశాలు:
Central Govt : ఆగస్టు 1 నుండి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం... దేశవ్యాప్తంగా 4 కీలక మార్పులు..!
Central Govt : ఆగస్టు 1వ తేదీ తర్వాత నుండి దేశవ్యాప్తంగా పలు కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. భారతదేశంలోని ఆర్థిక వ్యవస్థను అలాగే వివిధ అంశాలను ప్రభావితం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం కొత్త మార్పులను అమలులోకి తీసుకురానుంది. మరి కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకురానున్న ఆ కొత్త మార్పులు ఏంటి..?వాటికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Central Govt 1. LPG సిలిండర్ మార్కులు
భారతదేశవ్యాప్తంగా LPG సిలిండర్ల యొక్క ధర ప్రతినెల 1వ తేదీన సవరించడం జరుగుతుంది. అయితే గత నెల జూలైలో కేంద్ర ప్రభుత్వం సిలిండర్ యొక్క ధర తగ్గించగా ఈసారి ఆగస్టు నెలలో దాని ధర పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
Central Govt 2. IDBI బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్..
IDBI బ్యాంకు వారు ఆగస్టు 1 నుండి 300 , 375 మరియు 444 రోజులకు ప్రత్యేక డిపాజిట్ పథకాలను తీసుకురానున్నారు. ఇక దీనిలో 7.75% వార్షిక వడ్డీ రేటును అందించనున్నారు.
3. ఇండియన్ బ్యాంక్ FD..
ప్రస్తుతం ఇండియన్ బ్యాంక్ ప్రత్యేక FD స్కీమ్ కింద 300 మరియు 400 రోజులు పాటు కాల్ చేయదగిన ప్రత్యేక FD స్కీములను అందించడం జరుగుతుంది. అంతేకాదు దీనిలో కస్టమర్లు వారి యొక్క డబ్బును ఎప్పుడైనా సరే వితడ్రా చేసుకోవచ్చు.ఇక ఈ పథకం ద్వారా దాదాపు 5000 నుండి 2కోట్ల వరకు పెట్టుబడులను అందించనున్నారు. ఇక దీనిలో వడ్డీరేట్ల విషయానికొస్తే…
సాధారణ పౌరులకు – 7.05%
సీనియర్ సిటిజనులకు – 7.55%
సూపర్ సీనియర్ సిటిజన్లకు – 7.80% వార్షిక వడ్డీ రేట్లు ఉన్నాయి.
4. క్రెడిట్ కార్డ్ బిల్ పై RBI కొత్త నిబంధన
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆగస్టు 1 2024 నుండి క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులపై కొత్త నిబంధనలను అమలులోకి తీసుకురానుంది. ఇక ఈ ప్రత్యేక నిబంధనల కారణంగా ఫోన్ పే, క్రెడిట్ బిల్ డెస్క్ మరియు infibeam వంటి ఫిన్ టెక్ ప్లాట్ ఫారమ్ లపై ప్రభావం చూపనుంది. అయితే వినియోగదారులు భారత బిల్ చెల్లింపు వ్యవస్థ ( BBPS ) కు బదులుగా ఈ యాప్లను ఉపయోగించుకుని క్రెడిట్ కార్డ్ బిల్లులను చెల్లించాల్సి ఉంటుంది.
అయితే కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 1 నుండి తీసుకురానున్న ఈ కొత్త మార్పులు ఆర్థిక కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి మరియు మెరుగుపరచడానికి అదేవిధంగా మెరుగైన ఆర్థిక ఉత్పత్తులను అందించడానికి దోహాదపడతాయి. అలాగే ఈ కొత్త మార్పులు వినియోగదారులకు బ్యాంకింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి.