PMFBY Scheme : రైతులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట… ఎకరాకి రూ.13,000 సబ్సిడీ…!
ప్రధానాంశాలు:
PMFBY Scheme : రైతులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట... ఎకరాకి రూ.13,000 సబ్సిడీ...!
PMFBY Scheme : భారతదేశంలోని రైతులకు భద్రత కల్పించే దిశగా ఆలోచిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఇక ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతులకు భీమ రక్షణను అందించడం జరుగుతుంది. అయితే ఈ పథకంలో భాగంగా ప్రభుత్వం గతంలోనే రెండు పథకాలను మార్చడం జరిగింది.
PMFBY Scheme : ధన మంత్రి ఫసల్ బీమా యోజన…
కేంద్ర ప్రభుత్వం మార్పు చేసిన రెండు పథకాలలో మొదటి పథకం జాతీయ వ్యవసాయ గేటు పథకం. రెండవది సవరించిన వ్యవసాయ గేటు పథకం. అయితే ఈ రెండు పథకాలు చాలా లోపాలను కలిగి ఉండడం వలన ,అలాగే సుదీర్ఘమైన ధావాల ప్రక్రియ కారణంగా రైతుల ఆర్థిక పరిస్థితి దీనంగా మారింది. ఈ క్రమంలోనే రైతులు భూమి పట్టాలు అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో ఈ రెండిటి స్థానంలోకి కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన పథకాన్ని తీసుకువచ్చారు.అయితే రైతుల ప్రయోజనాల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 13 మే 2016న మధ్యప్రదేశ్ లోని సెహోర్ లో ఈ ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని ప్రారంభించారు. ఇక ఈ పథకం ద్వారా పంట నష్టం జరిగిన రైతులకు కేంద్ర ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పించనుంది.
ఈ పథకంలో రైతులు యొక్క ఆర్థిక స్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రీమియం డబ్బును చాలా తక్కువకే ఉంచుతున్నారు. దీంతో ఈ పథకం ప్రారంభం నుండి ఇప్పటి వరకు దాదాపు 36 కోట్ల మంది రైతులు ఈ పథకం ద్వారా బీమా పొందారు. అంతేకాక ఈ ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద రైతులకు దాదాపు 1.8 లక్షల కోట్ల రూపాయల బీమా జమ చేయడం జరిగింది.
PMFBY Scheme ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం…
ఈ పథకం ద్వారా ఎక్కువ మంది రైతులకు బీమా సౌకర్యాన్ని అందించి లబ్ది చేకూర్చడమే కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం. దీంతో ప్రకృతి వైపరీత్యాల వలన నష్టపోయిన రైతులు ఈ బీమా సౌకర్యాన్ని పొందడం ద్వారా తర్వాత పంటకి అనుగుణంగా దీనిని వాడుకోవచ్చు. అలాగే ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించేలా రైతులను ఈ పథకం ప్రోత్సహిస్తుంది.
PMFBY Scheme : ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే…
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఈ పథకం నుండి లబ్ధి పొందాలంటే మీరు ముందుగా బీమా ప్లాన్ యొక్క అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఇక దీనిలో మీ పూర్తి వివరాలను నమోదుచేసి దరఖాస్తు చేసుకోవచ్చు.
PMFBY Scheme కావలసిన పత్రాలు..
ఆధార్ కార్డు
పాన్ కార్డు
రైతుల భూమి రికార్డు
చిరునామా
ఆదాయ ధ్రువీకరణ పత్రం
కుల దృవీకరణ పత్రం
వాడుకలో ఉన్న ఫోన్ నెంబర్
పాస్ పోర్ట్ సైజ్ ఫోటో…