Diabetes : మీకు షుగర్ ఉందా? ఈ పండ్లు తిన్నారంటే ఈ జన్మలో మీకు షుగర్ తగ్గదు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Diabetes : మీకు షుగర్ ఉందా? ఈ పండ్లు తిన్నారంటే ఈ జన్మలో మీకు షుగర్ తగ్గదు

Diabetes : ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్న అది పెద్ద సమస్య షుగర్ వ్యాధి. ఆదేశం.. ఈ దేశం అనే తేడా లేకుండా ప్రతి దేశంలోనూ చాప కింద నీరులా విస్తరిస్తోంది డయాబెటిస్. మన ఇండియా గురించి మాట్లాడితే… మన దేశంలో ఉన్న ప్రతి 10 మంది ఐదారుగురికి షుగర్ వ్యాధి ఉంది. షుగర్ వ్యాధి ఒక్కసారి వస్తే ఇక జీవితాంతం ట్యాబ్లెట్లతోనే బతికేయాలి… అనే అపోహలో జనం ఉన్నారు. అందుకే షుగర్ అంటేనే చాలామంది భయపడిపోతున్నారు. నిజానికి […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :16 April 2021,11:59 am

Diabetes : ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్న అది పెద్ద సమస్య షుగర్ వ్యాధి. ఆదేశం.. ఈ దేశం అనే తేడా లేకుండా ప్రతి దేశంలోనూ చాప కింద నీరులా విస్తరిస్తోంది డయాబెటిస్. మన ఇండియా గురించి మాట్లాడితే… మన దేశంలో ఉన్న ప్రతి 10 మంది ఐదారుగురికి షుగర్ వ్యాధి ఉంది. షుగర్ వ్యాధి ఒక్కసారి వస్తే ఇక జీవితాంతం ట్యాబ్లెట్లతోనే బతికేయాలి… అనే అపోహలో జనం ఉన్నారు. అందుకే షుగర్ అంటేనే చాలామంది భయపడిపోతున్నారు. నిజానికి షుగర్ వ్యాధిని మనమే కోరి తెచ్చుకుంటున్నాం. మన జీవిన విధానం, మన ఫుడ్ అలవాట్లు కానీ ఇవే మనకు షుగర్ వ్యాధిని తీసుకొస్తున్నాయి. అసలు కొంచెం జాగ్రత్త పడితే… ఆహార అలవాట్లను కొంచెం మార్చుకోగలిగితే అసలు షుగర్ అనేదే రాదు. జీవితంలో షుగర్ ట్యాబ్లెట్లు వేసుకునే అవసరమే ఉండదు. కానీ… ఈ జనరేషన్ లైఫ్ స్టయిల్ వేరు కాబట్టి ఖచ్చితంగా అందరికీ షుగర్ వ్యాధి వచ్చేస్తోంది.

diabetics patients can eat these fruits

diabetics patients can eat these fruits

షుగర్ వ్యాధి వచ్చాక జాగ్రత్త పడటం కన్నా.. రాకముందే షుగర్ ను కంట్రోల్ లో పెట్టుకుంటే బెటర్. కానీ… ఎవ్వరైనా షుగర్ రాకముందు తమ ఆహార అలవాట్లను మార్చుకోరు. షుగర్ వచ్చాక మాత్రమే ఆహార అలవాట్లను మార్చుకుంటారు. ఒక సింపుల్ ఫార్ములా… షుగర్ రాకుండా ఉండాలంటే… జీవితంలో షుగర్ ట్యాబ్లెట్టే వేసుకోకుండా ఉండాలంటే ఒక్కటే చేయాల్సింది… ప్రతి రోజు తినే ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకుంటే చాలు.. తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారం, ఎక్కువ ఫైబర్ ఉన్న ఆహారం.. ఇదే మీరు చేయాల్సిన పని. ఇలాంటి ఫుడ్ ను క్రమం తప్పకుండా తీసుకుంటే కనుక జీవితంలో షుగర్ మీ ముఖం కూడా చూడదు.

Diabetes : షుగర్ వచ్చాక కంట్రోల్ ఎలా చేసుకోవాలి?

ఇక కర్మకాలి షుగర్ వచ్చిందనుకో. మీరు చేసేదేం లేదు. మీ ఆహార అలవాట్లను ఖచ్చితంగా మార్చుకోవాల్సిందే. షుగర్ వచ్చాక షుగర్ ను కంట్రోల్ ఎలా చేయాలో తెలుసుకోవాలి. అంటే ఏం తినాలి? ఏం తినకూడదు? అనేది చాలా ఇంపార్టెంట్. షుగర్ వచ్చాక చాలామంది చేసే తప్పు ఒక్కటే. పండ్లను తినకపోవడం. నిజమే షుగర్ వస్తే కొన్ని రకాల పండ్లను తినకూడదు కానీ.. అన్ని పండ్లను తినకూడదు అనేది ఎక్కడా లేదు. షుగర్ వచ్చిన వాళ్లు పండ్లను తినొచ్చు కానీ.. కొన్ని రకాల పండ్లను మాత్రం అస్సలు తినకూడదు. అవేంటో తెలుసుకొని వాటికి దూరంగా ఉంటే చాలు… మిగితా పండ్లను హ్యాపీగా తినేయొచ్చు.

సీజనల్ ఫ్రూట్స్ ను పక్కన పెడితే చాలు… షుగర్ వచ్చినవాళ్లు సీజనల్ గా దొరికే మామిడి పండ్లు, సపోట పండ్లు, సీతాఫలం పండ్లను మాత్రం అస్సలు తినకూడదు. వాటిలో గ్లూకోజ్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల షుగర్ ఒక్కసారిగా పెరిగిపోతుంది. అలాగే ఖర్జూరాలను కూడా తినకూడదు. ఇక… అసలైనది అరటి పండు. షుగర్ ఉన్నవాళ్లు ఈ పండును అస్సలు ముట్టుకోకూడదు. ఒకవేళ మీకు షుగర్ కంట్రోల్ అయ్యాక… ఇక ట్యాబ్లెట్లు వేసుకోకుండా ఆపితే.. అప్పుడు ఈ పండ్లను తినొచ్చు. కానీ…. షుగర్ కంట్రోల్ కోసం ట్యాబ్లెట్లు వాడుతుంటే మాత్రం ఈ పండ్లను అస్సలు తినకండి.

ఈ పండ్లు కాకుండా… మిగితా పండ్లు ఏవైనా షుగర్ ఉన్నవాళ్లు తినొచ్చు. ముఖ్యంగా పుచ్చకాయ, పొప్పడి కాయ, తర్భూజ, బత్తాయి, నారింజ, ఆపిల్, స్ట్రాబెర్రీ, కివీ ఫ్రూట్… ఇలా మార్కెట్ లో దొరికే ఏ పండ్లనైనా తినొచ్చు. అందుకే… షుగర్ వస్తే… ఏ పండ్లు తినకూడదు అనేది కేవలం అపోహ మాత్రమే. అందుకే మీకు షుగర్ ఉన్నా… ఏం చక్కా ఈ పండ్లను తినేయొచ్చు. కాకపోతే పైన చెప్పిన ఆ ఐదు రకాల పండ్లకు మాత్రం దూరంగా ఉండండి.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది