Rohit Sharma Virat Kohli : రోహిత్ – కోహ్లీ మళ్లీ జట్టులోకి ఎప్పుడు వస్తారు.. తమ తదుపరి మ్యాచ్ ఆడేది ఎప్పుడంటే!
Rohit Sharma Virat Kohli : టీమిండియా 17 ఏళ్ల కల ఎట్టకేలకి నెరవేరింది. 2007లో టీ20 వరల్డ్ కప్ గెలుచుకున్న టీమిండియా ఇప్పుడు 17 ఏళ్ల తర్వాత కప్ గెలుచుకుంది. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. ఈ విజయం సాధించిన ఆనందంతో పాటు టీ20 ఇంటర్నేషనల్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అభిమానులకు 440 వోల్ట్‌ల షాక్ ఇచ్చారు విరాట్ కోహ్లీ , రోహిత్ శర్మ. ఇప్పుడు ఈ ఇద్దరు దిగ్గజాలు భారత్ తరపున ఏ టీ20 మ్యాచ్ ఆడరు. ఇటువంటి పరిస్థితిలో, విరాట్, రోహిత్ తదుపరి మ్యాచ్ ఎప్పుడు ఆడతారు అనే ప్రశ్న చాలా మంది అభిమానుల మనస్సులో ఉంటుంది.విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టీ 20లకి రిటైర్మెంట్ ప్రకటించడంతో వన్డే, టెస్ట్ ఫార్మాట్లలో ఆడుతున్నప్పుడు అభిమానులను అలరిస్తారని తెలిసిందే. ఈ నెలలో భారత జట్టు శ్రీలంకలో పర్యటించాల్సి ఉంది.
Rohit Sharma Virat Kohli వారి కోసం ఎదురు చూపులు..
రెండు దేశాల మధ్య 3 వన్డే మ్యాచ్‌ల అనధికారిక సిరీస్ జరగనుంది. విరాట్, రోహిత్ లాంటి అనుభవజ్ఞులైన వెటరన్లు ఈ సిరీస్‌లో జట్టులోకి తీసుకోరని, యువ ఆటగాళ్లకే బీసీసీఐ అవకాశం ఇస్తుందని అంటున్నారు. ఇక సెప్టెంబర్‌లో భారత జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటించనుంది. ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో 2 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ సెప్టెంబర్ 19 నుంచి జరగనుంది. ఈ సిరీస్ ద్వారా, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి మరోసారి జట్టులోకి చేరుకోనున్నారు. టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరుకోవాలనే తన వాదనను బలోపేతం చేయడానికి, ఈ రెండు మ్యాచ్‌లను గెలవాలనే ఉద్దేశంతో టీమిండియా తరపున రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లని బరిలోకి దింపబోతున్నట్టు తెలుస్తుంది.జులై నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు టీమిండియా 17 మ్యాచ్‌లు (8 టీ20, 9 టెస్టులు) ఆడనుండడం గమనార్హం. టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత టీమిండియా కష్టాల్లో పడింది.

Rohit Sharma Virat Kohli : రోహిత్ – కోహ్లీ మళ్లీ జట్టులోకి ఎప్పుడు వస్తారు.. తమ తదుపరి మ్యాచ్ ఆడేది ఎప్పుడంటే!
బార్బడోస్‌లో తుఫాన్ బీభత్సం చేస్తోంది. దీని కారణంగా టీమిండియాలోని ప్రతి సభ్యుడు ఇప్పటికీ అక్కడే చిక్కుకుపోయారు. బార్బడోస్‌లో తుఫాన్ కారణంగా, విద్యుత్, నీటి సరఫరా నిలిచిపోయింది. విమానాశ్రయాలు కూడా మూసివేశారు. ఎయిర్‌పోర్టు ఎప్పుడు తెరుచుకుంటుంది అనేది ఇంకా ఎవరికీ తెలియదు. అయితే ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు బీసీసీఐ తన జట్టును ఈ తుఫాన్ నుంచి బయటపడేసేందుకు ప్లాన్ వేసింది. ఛార్టర్డ్ ఫ్లైట్ ద్వారా టీమ్ ఇండియాను భారత్‌కు రప్పించేందుకు జై షా ప్లాన్ చేసినట్లు సమాచారం.