Jabardasth Immanuel : నీ మెడలో మూడు ముళ్లు వేస్తేనే నా ప్రేమకు అర్థం.. వర్షకు ప్రపోజ్ చేసిన ఇమ్మాన్యుయేల్?
Jabardasth Immanuel : తాజ్ మహల్ కడితేనే ఆ ప్రేమకు అర్థం.. నీ మెడలో తాళి కడితేనే నా ప్రేమకు అర్థం.. అని అన్నది ఎవరో కాదు.. జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్. అవును.. ఇమ్మాన్యుయేల్ అంటే వర్ష.. వర్ష అంటే ఇమ్మాన్యుయేల్.. ఈ జంట గురించి ఇప్పుడు ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ జబర్దస్త్ లోకి వచ్చి ఎంత ఫేమస్ అయ్యాడో.. వర్షతో జతకట్టి.. ఆన్ స్క్రీన్ మీద కూడా ఈ జంట అంత ఫేమస్ అయింది. జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ.. ఇతర షోలలో ఈ జంటకు ఉన్న క్రేజే వేరు. ఈ జంట లేకుండా షో ఉండదు. ఈ జంట ఏ షోకు వెళ్లినా.. ఆ షో సూపర్ సక్సెస్ అవ్వాల్సిందే.

jabardasth immanuel and varsha marriage in sridevi drama company
చాలా సార్లు.. చాలా స్టేజ్ ల మీద ఇమ్మాన్యుయేల్ మీద తనకు ఉన్న ప్రేమను వ్యక్త పరిచింది వర్ష. తాజగా రిలీజ్ అయిన ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమోలో కూడా ఇమ్మాన్యుయేల్ లేకుంటే తాను బతకలేనంటూ గుక్కపెట్టి మరీ ఏడ్చింది. ఇమ్మాన్యుయేల్ వేరే పెళ్లి చేసుకుంటే నేను తట్టుకోలేను.. అంటూ చిన్నపిల్లలా ఏడ్చేసింది వర్ష. తను అంతలా ఏడ్చింది అంటే.. ఖచ్చితంగా ఇమ్మాన్యుయేల్ మీద వర్షకు చాలా ప్రేమ ఉన్నట్టే కదా.

jabardasth immanuel and varsha marriage in sridevi drama company
Jabardasth Immanuel : వర్ష మీద తనకున్న ప్రేమను కూడా బయటపెట్టిన ఇమ్మాన్యుయేల్
ఇద్దరికీ ఒకరంటే మరొకరికి ఇష్టం. అందుకే ఇమ్మాన్యుయేల్, వర్ష.. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే.. లాక్ డౌన్ కాబట్టి.. ఓ 20 మంది అతిథులను మాత్రమే పిలిచి.. శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ మీద పెళ్లి చేసుకోవాలనుకున్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ మీదనే ఇమ్మాన్యుయేల్.. వర్ష మెడలో తాళి కట్టేశాడు. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. అయితే.. వాళ్లు చేసుకున్నది ఉత్తుత్తి పెళ్లి అయినా అది నిజమైన పెళ్లి లాగానే ఉంది. నిజంగా పెళ్లి చేసుకున్నా కూడా ఇంత బాగా చేసుకోరు కాబోలు.. ఎలాగూ ఇద్దరు పెళ్లి చేసుకుంటారు కాబట్టి.. పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కానీ.. మొత్తానికి ఇద్దరూ కలిసి చేసిన హంగామా మాత్రం మామూలుగా లేదు. శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమోను చూసి మీరే ఎంజాయ్ చేయండి.

ఇది కూడా చదవండి ==> బిగ్ బాస్ 5 లేటెస్ట్ అప్‌డేట్ ఇచ్చిన నిర్వాహకులు..!
ఇది కూడా చదవండి ==> ఇమ్మూకు వేరే పెళ్లి అయితే తట్టుకోలేను.. గుక్క పెట్టి ఏడ్చేసిన వర్ష.. స్టేజ్ మొత్తం ఒక్కసారి సైలెంట్?
ఇది కూడా చదవండి ==> హైదరాబాద్‌లో ఇల్లుకొన్న మోనాల్ గజ్జర్..ఎన్ని కోట్లుంటుందో తెలుసా..?
ఇది కూడా చదవండి ==> ముక్కు అవినాష్.. అరియానాను వదిలేశాడా? ఈ అమ్మాయి వెనుక పడ్డాడేంటి?