Nara Lokesh : జగన్ మీద పేలిన నారా లోకేశ్.. అంత మాట అనేశాడు ఏంటి..!
Nara Lokesh : ఏపీలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు పున:ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఈసందర్భంగా శాసన సభలో వైసీపీ ప్రభుత్వం కొన్ని బిల్లులను ప్రవేశపెట్టింది. అందులో విద్య, వైద్యం, నాడు నేడు, పోలవరం ప్రాజెక్ట్, రైతు భరోసా కేంద్రాలు, పారిశ్రామికరంగ అభివృద్ధి లాంటి అంశాలు ఉన్నాయి. ఓవైపు శాసన సభలో పలు సంక్షేమ పథకాలు, అంశాలపై చర్చ జరుగుతుండగా ప్రతిపక్ష పార్టీ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఉదయమే టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వినూత్నంగా అసెంబ్లీ వద్ద నిరసన తెలిపారు. కాడె మోస్తూ అసెంబ్లీకి వచ్చారు. సీఎం జగన్.. రైతాంగ వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నారని.. దానికి నిరసనగా ప్రదర్శన చేపట్టామని టీడీపీ సభ్యులు తెలిపారు.
అమరావతి ప్రాంత రైతులను వైఎస్ జగన్ ఎందుకు అణచి వేస్తున్నారని ప్రశ్నించారు. ఎందుకు వేలాది ఎకరాలను నాశనం చేశారంటూ ప్రశ్నించారు. ఈసందర్భంగా నారా లోకేశ్ కూడా నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రైతు ద్రోహి జగన్ అంటూ అసెంబ్లీ ముందు నిరసన తెలిపారు. నిరసన కోసం తీసుకొచ్చిన ఎడ్ల బండ్లను తరలించి, రైతులను అరెస్ట్ చేయడం వైసీపీ ప్రభుత్వ నిరంకుళ పాలనకు నిదర్శనం అంటూ నారా లోకేశ్ ట్వీట్ చేశారు. మోటర్లకు మీటర్లు పెట్టి రైతుల మెడలో ఉరి తాళ్లను బిగిస్తున్నారు. ఆక్వా రంగాన్ని దివాళా తీయించారు. గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. ధాన్యం బకాయిలు చెల్లించడం లేదు కనీసం విత్తనాలు, ఎరువులు ఇవ్వలేని చెత్త ప్రభుత్వం ఇది. ఇచ్చిన హామీ ప్రకారం రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీకి నారా లోకేశ్ తో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ర్యాలీగా వెళ్లారు.
Nara Lokesh : అమరావతి రైతులను రోడ్డున పడేశారు
కేవలం అమరావతిని ధ్వంసం చేయడానికే జగన్ మూడు రాజధానుల అంశాన్ని తెర మీదికి తీసుకొచ్చారని, ఈ ప్రాంత రైతులను జగన్ రోడ్డు మీద పడేశారని టీడీపీ నేతలు ఈసందర్భంగా సీఎం జగన్ ను విమర్శించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లను బిగించేందుకే జగన్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. రైతుల పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చి.. ఇప్పుడు అదే రైతులను మోసం చేస్తోందని టీడీపీ నేతలు మండిపడ్డారు.