Post Office : ఈ పథకంలో చేరారంటే… ప్రతి నెల రూ.2,500 పొందవచ్చు…
Post Office : ప్రతి ఒక్కరు సంపాదించిన డబ్బును దాచుకోవడం ముఖ్యం. ఇలా డబ్బులను దాచుకోవడం వలన భవిష్యత్తులో ఆర్థిక పరిస్థితులను ఎదుర్కోవచ్చు. ఆర్థికంగా ఏదైనా సమస్యలు ఆకస్మాత్తుగా వచ్చినప్పుడు ఇబ్బంది పడడం కంటే ముందు నుంచి జాగ్రత్తగా డబ్బును పొదుపు చేస్తే ఆ సమయానికి ఆర్థికంగా అండగా ఉంటుంది. డబ్బును పొదుపు చేయడం వలన భవిష్యత్తులో పిల్లల చదువులకు, పెళ్లిళ్లకు పనికి వస్తాయి. అయితే డబ్బును దాచుకోవడానికి మన ప్రభుత్వం అనేక పథకాలను అమలు పరిచింది. […]
Post Office : ప్రతి ఒక్కరు సంపాదించిన డబ్బును దాచుకోవడం ముఖ్యం. ఇలా డబ్బులను దాచుకోవడం వలన భవిష్యత్తులో ఆర్థిక పరిస్థితులను ఎదుర్కోవచ్చు. ఆర్థికంగా ఏదైనా సమస్యలు ఆకస్మాత్తుగా వచ్చినప్పుడు ఇబ్బంది పడడం కంటే ముందు నుంచి జాగ్రత్తగా డబ్బును పొదుపు చేస్తే ఆ సమయానికి ఆర్థికంగా అండగా ఉంటుంది. డబ్బును పొదుపు చేయడం వలన భవిష్యత్తులో పిల్లల చదువులకు, పెళ్లిళ్లకు పనికి వస్తాయి. అయితే డబ్బును దాచుకోవడానికి మన ప్రభుత్వం అనేక పథకాలను అమలు పరిచింది.
ఈ పథకాలను సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తులో ఎటువంటి ఆర్థిక పరిస్థితులు ఎదురవ్వవు. ప్రజలలో పోస్ట్ ఆఫీస్ పథకాలపై మంచి నమ్మకం ఉంది. పోస్ట్ ఆఫీస్ లో అనేక రకాల పథకాలు ఉన్నాయి. వీటి వలన చక్కని ప్రయోజనాలను పొందవచ్చు. పోస్ట్ ఆఫీస్ అందించే పథకాల్లో మంత్లీ ఇన్కమ్ స్కీం ఒకటి. ఇందులో ఒకసారి డబ్బును పొదుపు చేస్తే మంచి వడ్డీ వస్తుంది. పదేళ్ల వయసు కంటే ఎక్కువ వయసు ఉండేవాళ్లు పిల్లల పేరు ఇందులో ఖాతా తెరవచ్చు.
ఈ పథకంలో పిల్లల పేరుతో ప్రత్యేక ఖాతాను ఓపెన్ చేస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఈ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో కనిష్టంగా 1000 గరిష్టంగా 4.5లక్షలు డిపాజిట్ చేయవచ్చు. దీని వడ్డీ రేటు 6.6% ఉంటుంది. మెచ్యూరిటీ సమయం ఐదు సంవత్సరాలు ఉంటుంది. ఆ తర్వాత దానిని మూసి వేయవచ్చు. రెండు లక్షలు పొదుపు చేస్తే ఈ పథకంపై 1100 వరకు పొందవచ్చు. 4.5 లక్షలు డిపాజిట్ చేస్తే ప్రతి నెల సుమారుగా 2500 వరకు పొందవచ్చు. అలాగే ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో ఎటువంటి రిస్క్ ఉండదు. మంచిగా డబ్బులను పొందవచ్చు.