Relationship : వివాహం అయిన తర్వాత మీ భాగస్వామికి ఈ విధంగా అబద్ధాలు చెప్పకండి… ఆ విధంగా చేస్తే ఇక అంతే మీరు…
Relationship : ప్రస్తుతం ఉన్న జనరేషన్లో ఆయన వాటికి కాని వాటికి గొడవలు పడి మరి మంచిగా ఉండే బంధాలని విడిపోయేదాకా వస్తున్నాయి. చాలామంది ప్రేమ నమ్మకం సరైన అవగాహన లేక విడిపోతున్నారు. ఒకళ్ళపై ఒకళ్ళకి నమ్మకం లేకపోవడం నిర్లక్ష్యపు దొరణలో అబద్ధాలు లాంటి చాలా జరుగుతున్నాయి. గట్టి బంధానికి కావాల్సింది ఇరువురి మధ్య నమ్మకం చాలా ప్రధానం. ఎందుకనగా బంధాలు అనేవి ఇద్దరి మధ్య నమ్మకంతోనే సాఫీగా సాగుతాయి. ప్రేమ అనేది హృదయంలో విరిగిపోతే ఆ తదుపరి ఎంత ప్రయత్నం చేసిన మళ్లీ ఆ నమ్మకాన్ని తిరిగి పొందలేరు. ఇంకొక వైపు మీ బంధంలో నమ్మకం లేకుంటే ఏదో ఒక నాటికి మీ బంధం కూడా తెగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇటువంటి సమయంలో మీ పార్టనర్ కి మీరు ప్రధానంగా ఎటువంటి అబద్ధాలు చెప్పకూడదు ఇప్పుడు మనం తెలుసుకుందాం…
ఏదైనా నచ్చినట్లు జీవించండి. నటించవద్దు.. ఏదైనా మీకు నచ్చకపోతే మీ పార్ట్నర్ తో నిర్భయంగా చెప్పేయండి. ఎందుకనగా మీ పార్ట్నర్ కి నచ్చినట్లు నటించడం ద్వారా ఏదో ఒక నాటికి వాస్తవం బంధంపై ప్రభావం పడుతుంది. శాలరీ గురించి అబద్ధం: మీ శాలరీ గురించి అసత్యం చెప్పడం ద్వారా మీ మీ పార్ట్నర్ కొన్ని రోజులు పాటు మంచి అభిప్రాయాన్ని పొందవచ్చు. కానీ బంధం వీక్ అయినప్పుడు అదే విషయం బంధం తెగిపోయే వరకు వస్తుంది. కాబట్టి శాలరీ గురించి మీ పార్ట్నర్ కి అసత్యాలు చెప్పకండి. ఇది మీ బంధంలో నమ్మకాన్ని పెంపొందిస్తుంది.
బాగున్నట్లు అస్సలు నటించకండి : మీ పార్ట్నర్ తో ఘర్షణలు జరుగుతున్నప్పుడు మీ టెన్షన్ ని అన్సి వేసుకున్నట్లు నటించకండి. వాళ్లు ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు సమాధానం ఇవ్వండి. అటువంటి సందర్భంలో మాట్లాడకుండా ఉంటే అదే నిజం గా భావిస్తుంటారు. అటువంటి ధోరణి మీ బంధానికి బలహీనత పరుస్తుంది. కాబట్టి మీ పార్ట్నర్ కి అబద్ధాలు చెప్పడం మానేయండి. మీ ఎక్స్ లవర్ గురించి ఆసత్యం : మీ మాజీ లవర్ గురించి మీ భాగస్వామికి ఏనాడు కూడా అసత్యం చెప్పవద్దు.. ఎందుకనగా ఇలా చేయడం వలన మీ పార్ట్నర్ కి మీపై ఉండే నమ్మకం పోతుంది. కావున ఇలా చేయడం మంచిది కాదు.