YS Jagan : ఇది అసలు సిసలైన నిర్ణయం అంటే? వైఎస్ జగన్ ముందుచూపుకు హేట్సాఫ్?
YS Jagan : ఇది అసలే టెక్నాలజీ యుగం. ఈయుగంలో కొత్త పుంతలు తొక్కుతున్న సాంకేతికతను మనం అంది పుచ్చుకోవాలి. ఎక్కడ చూసినా స్మార్ట్ ఫోన్లు. అరచేతిలో ప్రపంచాన్ని చూడగలుగుతున్నాం అంటే దానికి కారణం టెక్నాలజీ. ఆ టెక్నాలజీ లేకపోతే మన జీవనమే లేదు. అంతలా టెక్నాలజీకి అలవాటు పడిపోయాం. అందుకే… ఇంటర్నెట్ కు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం కరోనా వల్ల చాలామంది ఉద్యోగులు ఇంట్లో నుంచే పని చేస్తున్నారు. ఇంట్లో నుంచి పని చేయాలంటే ఖచ్చితంగా ఇంటర్నెట్ సౌకర్యం ఉండాల్సిందే. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని…. ఏపీలోని ప్రతి గ్రామంలో ఇంటర్నెట్ కనెక్షన్ కోసం, అమ్మఒడి పథకంలో భాగంగా… ఆప్షన్ గా ల్యాప్ టాప్ పంపిణీపై సీఎం జగన్ ఇవాళ సమీక్ష నిర్వహించారు.
ఈసందర్భంగా మాట్లాడిన సీఎం జగన్.. ఏపీలోని ప్రతి గ్రామంలో ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించాలన్నారు.. అలాగే… అన్ని గ్రామాల్లో అన్ని సదుపాయాలతో కూడిన డిజిటల్ లైబ్రరీలను ఏర్పాటు చేయాలన్నారు. సొంత గ్రామంలోనే ఉండి… వర్క్ ఫ్రం హోమ్ పని చేసుకునే విధంగా కావాల్సిన సదుపాయాలను అందజేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. వాటికి సంబంధించిన అన్ని పనులు త్వరగా పూర్తి కావాలని అధకారులను ఆదేశించారు.
YS Jagan : 2023 మార్చి నాటికి అన్ని గ్రామాల్లో అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ రావాలి
అలాగే… 2023 మార్చి లోగా… ఏపీలోని మారుమూల పల్లెకు కూడా అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలని…. అది హైస్పీడ్ ఇంటర్నెట్ డేటా రావాలని దాని కోసం అన్ని పనులు పూర్తి చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. వచ్చే సంవత్సరం జనవరి 9న అమ్మఒడి పథకం అమలు కానుంది. అప్పుడే అందరికీ ల్యాప్ టాప్ లు అందజేస్తాం. అమ్మఒడి పథకంలో భాగంగా… 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ల్యాప్ టాప్ అందిస్తాం. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ కేబుల్స్ వాడాలి.. అని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.