Viral Video : సూపర్ బర్డ్.. ఇంట్లోకి డబ్బులు తీసుకొచ్చి పెడ్తున్న పక్షి.. !
Viral Video : ప్రతీ ఒక్కరి జీవితంలో డబ్బు కీలక పాత్ర పోషిస్తుంది. ఏదేని వస్తువు కొనాలన్నా, జీవితంలో స్థిరపడాలన్నా మనీ చాలా ఇంపార్టెంట్. ఈ నేపథ్యంలోనే ప్రతీ ఒక్కరు డబ్బు సంపాదించేందుకుగాను కష్టపడుతుంటారు. కాగా, సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరలవుతున్న వీడియోలో పక్షి సంపాదిస్తోంది. ఎలాగంటే..సోషల్ మీడియాలో వైరలవుతున్న సదరు వీడియోలో ఓ పక్షి అపార్ట్‌మెంటులోని ఓ ఫ్లాటులోకి కిటికీ డోర్స్ ఓపెన్ చేసి ఉండగా అందులో నుంచి ఇంటిలోనికి ప్రవేశించింది.
Viral Video : కిటికీలో నుంచి వచ్చేసి కప్ బోర్డులో డబ్బులు దాచేస్తున్న పక్షి..
xఆ తర్వాత తన నోట కరుచుకుని తీసుకొచ్చిన నోటును కప్ బోర్డ్ ఓపెన్ చేసి మరీ అందులో దాచేసింది. అలా బర్డ్ డబ్బు తీసుకొచ్చి కప్ బోర్డులో స్టోర్ చేయడం చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అదేంటీ బర్డ్ ఇలా చేస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.మాకు అటువంటి బర్డ్ కావాలని కొందరు అడిగేస్తున్నారు.
ఫిగెన్ అనే టర్కిష్ ఉమన్ పక్షికి సంబంధించిన ఈ పన్నెండు సెకన్ల వీడియో షేర్ చేయగా, అది నెట్టింట తెగ వైరలవుతోంది. టర్కిష్ కంట్రీలో సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్‌గా బాగా పాపులర్ అయిన ఫిగెన్ షేర్ చేసిన వీడియోను చాలా మంది నెటిజన్లు ట్విట్టర్ వేదికగా రీ ట్వీట్ చేస్తున్నారు. వైరల్ వీడియోలో బర్డ్ తీసుకొచ్చిన నోటు .. టర్కిష్ లిరా అని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. అనగా ఇండియాలో రూపాయల మాదిరగా టర్కీ దేశంలో టర్కిష్ లిరా అని అర్థం.
https://twitter.com/TheFigen/status/1461337274256396290