AP Elections 2024 : 2024 లో ఏపీలో ఆ పార్టీనే పక్కాగా గెలవబోతుందట.. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే?
AP Elections 2024 : ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. కానీ.. ఇప్పటి నుంచే పార్టీలన్నీ ఎన్నికల కోసం సమాయత్తం అవుతున్నాయి. ఏపీలో ప్రధానంగా పోటీ అంటే అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్యనే. జనసేన పార్టీ గత ఎన్నికల్లో అంతగా ప్రభావం చూపించలేదు కానీ.. ఈసారి మూడో ప్లేస్ ను మాత్రం ఆక్రమించే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్, బీజేపీల పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పార్టీలు అసలు ఏపీలో ఉన్నాయో లేవో కూడా తెలియదు. ఒక్క సీటు గెలిస్తే గొప్పే. అందుకే ప్రధానంగా పోటీ అంటే వైసీపీ, టీడీపీ, జనసేన మధ్యే.
అయితే.. వైసీపీని ఢీకొట్టేందుకు టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయా? లేక విడివిడిగా పోటీ చేస్తాయా అనేది తెలియదు కానీ.. ఎంత మంది కలిసి వచ్చినా.. ఎన్ని పార్టీలు ఏకమైనా ఏపీలో 2024 లో అధికారంలోకి వచ్చేది మాత్రం మళ్లీ వైసీపీనే అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. అది పక్కా.. నో డౌట్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు కూడా. కాకపోతే 2019 లో వచ్చినంత మెజారిటీ అయితే రాకపోవచ్చు. ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయిలో అయితే సీట్లను వైసీపీ గెలుచుకుంటుందని.. ఈసారి వైసీపీకి వచ్చే సీట్లు కొన్ని జనసేనకు వెళ్తాయని అంటున్నారు. ఇక.. జనసేన, టీడీపీ పార్టీలు కలిసి పోటీ చేసినా..
AP Elections 2024 : జనసేన, టీడీపీ కలిసినా కలవకపోయిన ఫరక్ లేదు
కలవకుండా వేర్వేరుగా పోటీ చేసినా పెద్దగా ప్రయోజనం లేదంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే.. రెండు పార్టీలు కలిస్తే వాటికి నష్టం తప్పితే లాభం ఏం ఉండదట. టీడీపీ వ్యతిరేకులు, జనసేన వ్యతిరేకులు ఆ రెండు పార్టీలు కలిస్తే వేరే పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే.. 2024 లో పక్కాగా వైసీపీ గెలుస్తుందని తెలిసినప్పటికీ వైసీపీ పార్టీ కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలని.. ప్రజల్లో వ్యతిరేకత రాకుండా పలు సంస్కరణలు చేపట్టాలని సూచిస్తున్నారు. పలు విషయాల్లో జగన్ సర్కార్ కనుక ఎన్నికల వరకు సరైన అడుగులు వేయగలిగితే ఇక తిరుగు ఉండదని.. 2024 లో ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా ఖచ్చితంగా గెలుపు మాత్రం జగన్ దే అని బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. చూద్దాం మరి 2024 లో ఏం జరుగుతుందో.