YS Jagan : ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకి సూపర్ గుడ్ న్యూస్ చెప్పిన జగన్ !
YS Jagan : ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. పీఆర్సీ అమలుపై కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. 12వ పీఆర్సీ ఏర్పాటుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. 12వ వేతన సవరణ సంఘం ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. సీఎం కార్యాలయమే దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ను రెడీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. నిజానికి ఈ సంవత్సరం జులైలోనే కొత్త పీఆర్సీని ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు అమలు చేయాల్సి ఉంది. కానీ.. […]
YS Jagan : ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. పీఆర్సీ అమలుపై కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. 12వ పీఆర్సీ ఏర్పాటుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. 12వ వేతన సవరణ సంఘం ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. సీఎం కార్యాలయమే దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ను రెడీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. నిజానికి ఈ సంవత్సరం జులైలోనే కొత్త పీఆర్సీని ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు అమలు చేయాల్సి ఉంది. కానీ.. ఇప్పటికే జూన్ నెల రావడంతో..
కొత్త పీఆర్సీపైన అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. 12వ వేతన సవరణ సంఘం ప్రకారం ఉద్యోగులకు ఫిట్ మెంట్ ను ఖరారు చేయనున్నారు. దానికి సంబంధించిన పనులు వేగవంతం అయ్యాయి. ఉద్యోగ సంఘాలు కూడా ఏపీ ప్రభుత్వానికి పీఆర్సీని త్వరగా అమలు చేయాలని వినతి పత్రం అందించారు. వచ్చే నెలే కొత్త పీఆర్సీని అమలు చేయాల్సి ఉండటం వల్ల.. వచ్చే నెల నుంచి వేతన స్కేల్ మారనుంది. దానికి సంబంధించిన ఫైల్ ను సీఎం కార్యాలయం.. ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శికి పంపించింది.
YS Jagan: పీఆర్సీ కమిటీ చైర్మన్ గా ఎవరు ఉంటారు?
అయితే.. పీఆర్సీ కమిటీ చైర్మన్ గా ఎవరు ఉంటారు అనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. రిటైర్ అయిన సీఎస్ సమీర్ శర్మతో పాటు మరికొందరు రిటైర్ అయిన అధికారుల పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తోంది. పీఆర్సీ మాత్రమే కాదు.. ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో చాలా హామీలు పెండింగ్ లో ఉన్నాయి. ఆయా పెండింగ్ అంశాలపై సంఘాల నేతలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. దానికి సంబంధించి వచ్చే కేబినేట్ లో సమస్యలపై చర్చిస్తామని ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి అన్నారు. దానికి సంబంధించి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. పీఆర్సీ అమలు సమయం కూడా దగ్గర పడుతుండటంతో ఇక చేసేది లేక.. త్వరగా దానిపై ఒక నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.