జగన్ పై సొంత పార్టీ సీనియర్ నాయకుల అసంతృప్తి.. తిట్టిన వారికి పదవులేంటి జగనన్న?
ys jagan mohan reddy : ఏపీ అధికార పార్టీ వైకాపా కు చెందిన కొందరు సీనియర్ నాయకులు గత కొంత కాలంగా తీవ్ర అసంతృప్తితో రగిలి పోతున్నారు. అసంతృప్తి ఉంటే మొదట లో లోపలే ఉంటుంది. కాని ఇప్పుడు ఆ అసంతృప్తి పీక్స్ కు వెళ్తుంది. వైకాపా నాయకులు తమ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మెల్లగా గొంతు ఎత్తుతున్నారు. పార్టీ కోసం మొదటి నుండి పని చేస్తున్న వారిని వదిలేసి మద్యలో వచ్చిన వారిని కొత్తగా వచ్చిన వారిని మంత్రి వర్గంలోకి తీసుకోవడం తోనే ఈ గొడవ మొదలు అయ్యింది. కాంగ్రెస్ లో ఉన్న వారు జగన్ సొంత పార్టీ పెట్టగానే అధికార పార్టీని వదిలేసి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెంట నడిచారు. ఇప్పుడు వారు తమకు దక్కని గౌరవం గురించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో చర్చిస్తున్నారట.
ys jagan mohan reddy : తిట్టిన వారికి పదవులు..
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జైల్లో ఉన్న సమయంలో కొందరు తెలుగు దేశం పార్టీకి చెందిన వారు మరియు కాంగ్రెస్ కు చెందిన వారు ఇష్టానుసారంగా తిట్టారు. వారిలో కొందరు వైకాపాలో జాయిన్ అయ్యారు. మొన్నటి ఎన్నికల్లో వారికి సీట్లు ఇవ్వడమే కాకుండా వారికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టడం ద్వారా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొదటి నుండి వైకాపా కోసం పని చేస్తున్న వారిని అవమానించినట్లు అయ్యింది అంటూ ఆ సీనియర్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గౌరవం లేని చోట పని చేయాల్సిన అవసరం ఏంటీ.. ఎందుకు కష్టపడి పని చేసి ఇతరుల ముందు గౌరవం లేకుండా తల దించుకోవాలంటూ ఆ వైకాపా అసంతృప్త నేతల ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ys jagan mohan reddy : జగన్ మంతనాలు..
పార్టీ అధినేత అన్నప్పుడు అందరిని కలుపుకు వెళ్లాలి. ఆ విషయం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బాగా తెలుసు. అందుకే అసంతృప్త నాయకులతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. తిట్టిన వారికి మంత్రి పదవులు ఇవ్వడం వెనుక ఉద్దేశ్యంను వారికి చెప్పే ప్రయత్నాలు చేస్తున్నాడట. మొత్తానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి సొంత పార్టీలో అనేక విధాలుగా అసంతృప్తులు ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. అయినా కూడా ప్రభుత్వ వ్యవహారాలతో పాటు పార్టీ వ్యవహారాలను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చక్క బెట్టుకుంటున్నారు.