YSRCP : బద్వేలు వైసీపీదే.. సుధకు సీఎం జగన్ కంటే ఎక్కువ మెజారిటీ..
YSRCP : ఆంధప్రదేశ్‌లోని బద్వేలు ఉప ఎన్నికలో వైసీపీ జయకేతనం ఎగురవేసింది. అధికార పార్టీ రికార్డు స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంది. మొత్తం 13 రౌండ్లు ముగిసే సరికి 90,950 ఓట్ల భారీ ఆధిక్యంతో వైసీపీ అభ్యర్థి దాసరి సుధ ఎమ్మెల్యేగా విజయం సాధించింది. బీజేపీ, కాంగ్రెస్ పోటీలో నిలిచి ఓటమి పాలయ్యాయి.2019 సాధారణ ఎన్నికల్లో బద్వేలు ఎమ్మెల్యేగా గెలుపొందిన సుబ్బయ్య అనారోగ్యంతో మృతి చెందారు. ఆ నేపథ్యంలో ఈ స్థానానికి ఉప ఎన్నిక రాగా, వైసీపీ దివంగత ఎమ్మెల్యే భార్య దాసరి సుధను బరిలో నిలిపింది.
కాగా, ఈమె తన భర్త కంటే ఎక్కువ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పులివెందులలో వచ్చిన మెజారిటీ కంటే కూడా ఎక్కువ మెజారిటీ ఓట్లను దాసరి సుధ సొంతం చేసుకోవడం విశేషం. పదమూడు రౌండ్లు ముగిసే నాటికి 90 వేల పై చిలుకు ఓట్లు మెజారిటీ రాగా, బీజేపీ అభ్యర్థి పనతల సురేశ్‌పై సుధ విక్టరీ సాధించింది. పులివెందుల ఎమ్మెల్యేగా జగన్‌కు 90,110 ఓట్ల మెజారిటీ రాగా, దాసరి సుధకు 90,950 ఓట్ల ఆధిక్యం లభించింది. బద్వేలు అసెంబ్లీ ఎలక్షన్స్ హిస్టరీలోనే డాక్టర్ దాసరి సుధ అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. ఈ సందర్భంలో అధికార వైసీపీ నేతలు, కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు. ఈ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థిని ప్రతిపక్ష టీడీపీ, జనసేన బలపరిచన సంగతి తెలిసిందే.
YSRCP : అధికార పార్టీ నేతల సంబురాలు..
కాగా, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మాత్రం తమ అభ్యర్థులను బరిలో దింపి పోటీలో నిలిచి ఓడిపోయాయి. ప్రాంతీయ పార్టీ అయిన వైసీపీ చేతిలో జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ ఓటమి పాలయ్యాయి. 13 రౌండ్లు ముగిసే సరికి వైఎస్ఆర్‌సీపీకి 1,12,072 ఓట్లు రాగా, బీజేపీకి 21,661 ఓట్లు, కాంగ్రెస్‌కు 6217 ఓట్లు వచ్చాయి. భారీ విజయం సొంతం అయిన నేపథ్యంలో అధికార వైసీపీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నాయి.