Kothapallilo Okappudu Movie Review : కొత్తపల్లిలో ఒకప్పుడు మూవీ రివ్యూ అండ్ రేటింగ్..!
ప్రధానాంశాలు:
Kothapallilo Okappudu Movie Review : కొత్తపల్లిలో ఒకప్పుడు మూవీ రివ్యూ అండ్ రేటింగ్..!
Kothapallilo Okappudu Movie Review : ఒకప్పుడు పెద్ద సినిమాలు బాగుండేవి..ప్రేక్షకులు సైతం పెద్ద హీరోల చిత్రాలకు మొగ్గు చూపించేవారు. కానీ ఇప్పుడు ప్రేక్షకుల సెట్ మారింది. అగ్ర హీరోల సినిమాల కంటే చిన్న హీరోల సినిమాలకు , కొత్త దర్శకుల కథలకే మొగ్గు చూపిస్తున్నారు. దీంతో చిన్న చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాలు సాధిస్తున్నాయి. మూస ధోరణిలో కాకుండా ప్రేక్షకులు కోరుకునే కొత్తదనం ఆకట్టుకుంటున్నారు. ఆ మధ్య వచ్చిన ‘కేరాఫ్ కంచరపాలెం’ అలాంటి సినిమానే. కొత్త తరహా ప్రయత్నాలకు బూస్టప్ ఇచ్చిన సినిమాల్లో అదొకటి. హీరో రానా ఈ చిత్రానికి నిర్మాతగా, సమర్పకుడిగా వ్యవహరించి సక్సెస్ అందుకున్నాడు. తాజాగా ఇప్పుడు ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ అనే సినిమాకు సైతం తానే సమర్పకుడిగా వ్యవహరించాడు. కంచరపాలెం చిత్రాన్ని నిర్మించిన ప్రవీణ పరుచూరి ఈ చిత్రంతో దర్శకురాలిగా మారారు. మరి ఈ సినిమా ఎలా ఉంది..? కథ ఏంటి..? ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంది అనేది చూద్దాం…

Kothapallilo Okappudu Movie Review : కొత్తపల్లిలో ఒకప్పుడు మూవీ రివ్యూ అండ్ రేటింగ్..!
Kothapallilo Okappudu Movie Review : కొత్తపల్లిలో ఒకప్పుడు మంచి ఫీల్ మూవీ
రూరల్ బ్యాక్‌డ్రాప్ నేపథ్యంలో నడిచే మానవీయ కథ ఇది. గ్రామంలో జల్సా గా తిరిగే రామకృష్ణ, ప్రజలను వేధించే వడ్డీ వ్యాపారి అప్పన్న, వీరి మధ్య ఎదురై సంఘర్షణలు ఈ కథకు ముడి పెడతాయి. గ్రామ పెద్ద రెడ్డి, అతని కూతురు సావిత్రి, గిరిజన యువతి పాత్రల మిళితంతో కథలో ప్రేమ, నమ్మకం, విశ్వాసం వంటి భావోద్వేగాలు చోటుచేసుకుంటాయి. అసలు భయపెడే వాడే దేవుడవుతాడా? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పే ప్రయత్నమే ఈ సినిమా.
కథలో మలుపులు సవ్యంగా ప్రెజెంట్ చేయాలన్నదే దర్శకుడి ధ్యేయం అయినా, కొన్ని సందర్భాల్లో కథనం బలహీనంగా అనిపిస్తుంది. పాత్రల మధ్య ముడిపడే సంబంధాలు, వారి స్వభావాలపై క్లారిటీ లోపించడం కథను కొంత తేలికగా చేస్తుంది. అయితే కొన్ని కీలక సన్నివేశాలు మాత్రం మంచి ఫీలింగ్‌ను కలిగిస్తాయి. ముఖ్యంగా సినిమా చివర్లో వచ్చే కొన్ని భావోద్వేగ దృశ్యాలు ప్రేక్షకుడిని కొద్దిసేపు ఆలోచింపజేస్తాయి. కథనంలో కొన్ని అనవసరమైన సన్నివేశాలు కథ వేగాన్ని ప్రభావితం చేసినా, దర్శకుడు ప్రామాణికంగా ప్రయత్నించినట్లు స్పష్టంగా తెలుస్తుంది.
నటీనటుల పరంగా చూస్తే.. రామకృష్ణగా మనోజ్ చంద్ర, అప్పన్నగా రవీంద్ర విజయ్ ఆకట్టుకున్నారు. రవీంద్ర విజయ్ తన విలనిజంతో సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. బెనర్జీ పాత్రలో మరోసారి తన నటనతో మెప్పించారు. ఉషా బానెల గిరిజన యువతిగా సహజమైన నటన కనబరిచారు. ప్రవీణ పరుచూరి దర్శకుడిగానే కాకుండా ఓ చిన్న పాత్రలో కనిపించి ఆసక్తికరంగా నిలిచారు. కొత్తవాళ్లే అయినా నటన పరంగా సంతృప్తికరంగా చూపించారు.
సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ ఈ చిత్రానికి బలంగా నిలిచాయి. పేట్రో ఆంటోనియాడిస్ తన కెమెరా ద్వారా గ్రామీణ వాతావరణాన్ని బాగానే ఆవిష్కరించారు. క్లైమాక్స్‌లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మంచి ఇంపాక్ట్‌ను కలిగించింది. కథలో చెప్పిన “దేవుడు అంటే నిజమో అబద్దమో కాదు, నమ్మకం” అన్న థీమ్ థాట్ స్పష్టంగా ఉన్నా, ప్రేక్షకుడిలో ఆ నమ్మకాన్ని ప్రేరేపించడంలో కొంత వెనకబడ్డారు. అయినప్పటికీ ఇది హానెస్ట్ అటెంప్ట్. గ్రామీణ కథలను ప్రేమించే ప్రేక్షకులకు ఒకసారి చూడదగ్గ చిత్రం ఇది.