Ramarao On Duty Movie Review : రామారావు ఆన్‌డ్యూటీ మూవీ ఫ‌స్ట్ రివ్యూ..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Ramarao On Duty Movie Review : రామారావు ఆన్‌డ్యూటీ మూవీ ఫ‌స్ట్ రివ్యూ..!

Ramarao On Duty Movie Review : మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్న విష‌యం తెలిసిందే. అయితే ఆయ‌న‌కు విజ‌యం అనేది అంద‌ని ద్రాక్ష‌గానే మారింది. చివ‌రిగా రాజా ది గ్రేట్ చిత్రంతో మంచి హిట్ కొట్టిన ర‌వితేజ మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ యేడాది ‘ఖిలాడి’ మూవీతో పలకరించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. ఈ మూవీ తర్వాత రవితేజ కొత్త దర్శకుడు శరత్ […]

 Authored By sandeep | The Telugu News | Updated on :28 July 2022,11:58 pm

Ramarao On Duty Movie Review : మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్న విష‌యం తెలిసిందే. అయితే ఆయ‌న‌కు విజ‌యం అనేది అంద‌ని ద్రాక్ష‌గానే మారింది. చివ‌రిగా రాజా ది గ్రేట్ చిత్రంతో మంచి హిట్ కొట్టిన ర‌వితేజ మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ యేడాది ‘ఖిలాడి’ మూవీతో పలకరించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. ఈ మూవీ తర్వాత రవితేజ కొత్త దర్శకుడు శరత్ మండవ దర్శకత్వంలో ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే సినిమా చేసాడు. ఈ సినిమాలో తొలిసారి ఎమ్మార్వో ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ శుక్రవారం విడుదల కానున్న సినిమాపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి.

Ramarao On Duty Movie Review : ఎలా ఉందంటే..

రవితేజ హీరోగా నటించిన లేెటస్ట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’. ఈ సినిమాలో ప్రభుత్వాధికారి అయిన ఎమ్మార్వో రామారావు పాత్రలో రవితేజ నటించారు. నిజాయితీగా మారు పేరుగా చట్టానికి కట్టుబడే ఎమ్మార్వో పాత్రలో రవితేజ నటించారు. రీసెంట్‌గా ఈ సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ వాళ్లు U/A సర్టిఫికేట్ జారీ చేశారు. చిత్రంలో ర‌వితేజ త‌న పాత్ర‌కు త‌గ్గ న్యాయం చేశాడ‌ని చెబుతున్నారు. ఈ మధ్యకాలంలో ఒక ప్రభుత్వాధికారి పాత్రను పాజిటివ్‌గా చూపించడం బాగుందున్నారు. ఈ సినిమాలో హీరో పాత్ర మినహా మిగతావి అవినీతి పాత్రల్లో చూపించినట్టు పేర్కొన్నారు.

Ramarao On Duty Movie Review And Live Updates

Ramarao On Duty Movie Review And Live Updates

ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న అవినీతిని, కుట్రలు, కుతంత్రాలను హీరో ఎలా ఫేస్ చేసాడనేది చక్కగా పిక్చరైజ్ చేసినట్టు సెన్సార్ స‌భ్యులు చెప్పిన‌ట్టు తెలుస్తుంది. ఈ చిత్రంలో మాస్ మహారాజ్ సరసన దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించారు. ఈ నెల 29న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ ఎస్.ఎల్.వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మించారు. ఇప్ప‌టి వ‌రకు విడుద‌లైన ప్ర‌చార చిత్రాల‌ను బ‌ట్టి సినిమాపై అంచ‌నాలు గ‌ట్టిగానే పెట్టుకున్నారు.

థియేట్రిక‌ల్ బిజినెస్ కూడా భారీగా జ‌రిగింది. రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే.. తెలంగాణ (నైజాం) రూ. 5 కోట్లు.. రాయలసీమ (సీడెడ్) రూ. 3 కోట్లు ఆంధ్ర ప్రదేశ్ మొత్తం కలిపి రూ. 7 కోట్లు.. తెలంగాణ +ఆంధ్ర ప్రదేశ్ కలిపి రూ. 15 కోట్లు .. కర్ణాటక + రెస్టాఫ్ భారత్ రూ. కోటి ఓవర్సీస్ రూ. 1.2 కోట్లు.. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 17.20 కోట్లకు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేసింది. ఓవరాల్‌గా ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే .. రూ. 18 కోట్లు రాబట్టాలి.

రామారావు ఆన్ డ్యూటీ రివ్యూ .. హై ఓల్టేజ్ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్

స‌క్సెస్‌లు లేక దిగాలుగా ఉన్న‌ మాస్ మహారాజా రవితేజ హీరోగా వస్తున్న తాజా చిత్రం రామారావు ఆన్ డ్యూటీ ఈ మూవీ పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. ఇప్పటికే థియేట్రికల్ ట్రైలర్ మూవీపై మరింత అంచనాలను పెంచేశాయి. ప్ర‌మోష‌న్‌లో భాగంగా సినిమాకి సంబంధించి ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను షేర్ చేసుకున్న టీం మూవీపై మ‌రింత ఆస‌క్తి పెంచారు. ఇంతకీ రామారావు ఆన్ డ్యూటీ సరిగానే చేశాడా అంటే.. ఓసారి రివ్యూను చూద్దాం..

క‌థ‌ : 1995లో జ‌రిగిన క‌థ‌గా రామారావు ఆన్ డ్యూటీని రూపొందించ‌గా, అక్కడ రామారావు (రవితేజ) అనే వ్య‌క్తి సబ్ కలెక్టర్‌గా పనిచేస్తుంటాడు, వ్యవస్థ యొక్క చట్టాలకుకట్టుబడి అతను న్యాయం కోసం తన బాధ్యతను నిర్వర్తిస్తాడు. అయితే కొన్ని కార‌ణ‌ల వ‌ల‌న త‌న ప‌దవి పోతుంది. స‌బ్ క‌లెక్ట‌ర్ నుండి త‌హ‌శీల్ధార్‌గా సొంత గ్రామానికి రామారావు ట్రాన్స‌ఫ‌ర్ కాగా, ఆ స‌మ‌యంలో ఊరి ప్ర‌జ‌లు త‌ప్పిపోయార‌ని తెలుసుకుంటాడు. మ‌రి వారు ఎలా త‌ప్పిపోయారు, వారిని కిడ్నాప్ చేశారా? వెతికి ప‌ట్టుకునే క్ర‌మంలో ఎదుర‌య్యే ప‌రిస్థితులు ఏంట‌నేది సినిమా చూస్తే తెలుస్తుంది.

ప‌నితీరు : డిప్యూటీ కలెక్టర్ క్యారెక్టర్‌లో హై ఓల్టేజ్ మాస్ డైలాగ్స్‌లో మాస్ మాహారాజా అదరగొట్టాడు. చట్టానికి లోబడి, న్యాయం కోసం బాధ్యత నిర్వహించే పాత్రలో రవితేజ యాక్టింగ్ హైలెట్ అని చెప్పొచ్చ‌. ఫస్ట్ హాఫ్‌లో రవితేజ్ లుక్, మాస్ ఎలిమెంట్స్ అదిరిపోయాయి. సాంగ్స్ యావరేజ్‌గా ఉన్నా.. బ్యాక్ గ్రౌండ్‌ మ్యూజిక్‌ సూపర్‌గా ఉంది. శరత్ మండవకు డైరెక్టర్‌గా ఇది తొలి సినిమానే అయినా.. రవి తేజను సరికొత్తగా చూపించాడు .. కొన్ని డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి.

ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోగా, సెకండాఫ్‌లో మలుపులు, ట్విిస్టులతో స్క్రీన్‌ ప్లే మెస్మరైజ్ చేస్తుంది.. క్లైమాక్స్ సీన్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయి. మలయాళీ నటి రజిషా విజయన్ తన పాత్ర మేరకు బాగానే చేసింది మరియు దివ్యాంక‌ కౌశిక్ కు స్కోప్ లేదు. చిరు నవ్వుతో, కళ్యాణ రాముడు, హనుమాన్ జంక్షన్ వంటి అధిభూతమైన కామెడీ తో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న వేణు తొట్టెంపూడి, చాలా సంవత్సరాల తర్వాత ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గా రీ ఎంట్రీ ఇచ్చాడు, పాత్ర‌లో జీవించాడు. పీటర్ హెయిన్, స్టన్ శివ అద్భుతమైన యాక్షన్ బ్లాక్‌లని కంపోజ్ చేశారు. రవితేజ అభిమానులకు విజువల్ ఫీస్ట్. మొత్తానికి ఈ చిత్రం రవి తేజకు హై ఓల్టేజ్ మాస్ ప్యాకెజ్ హిట్ అని చెప్పొచ్చు.

రివ్యూ : 2.5/5

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది