Urvasivo Rakshasivo Movie Review : ఊర్వశివో రాక్షసివో మూవీ రివ్యూ & రేటింగ్…!
Urvasivo Rakshasivo Movie Review : నటీనటులు.. అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్, సునీల్, ఆమని, వెన్నెల కిషోర్ నిర్మాతలు.. ధీరజ్ మొగిలినేని & ఎం విజయ్, సంగీతం.. అచ్చు రాజమణి
దర్శకుడు రాకేష్ శశి, అల్లు శిరీష్, అను ఇమ్మాన్యూయేల్ జంటగా నటించిన ఊర్వశివో రాక్షసివో. ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావలసి ఉన్నా పలు కారణాల వాలన వాయిదా పడుతూ వచ్చి నవంబర్ 4వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ట్రైలర్ ఇప్పటికే ఓవర్గం ప్రేక్షకులను ఇంతగానో ఎట్రాక్ట్ చేసింది. సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలు ఎక్కువగా హైలెట్ కానున్నట్లు ట్రైలర్ తోనే క్లారిటీ ఇచ్చేశారు. మొదటిసారి అల్లు శిరీష్ లిప్ లాక్ సన్నివేశాలలో కూడా నటించడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. మరి ఈ చిత్ర కథ ఎలా ఉందంటే..
కథ : శ్రీ కుమార్ (అల్లు శిరీష్) ఒక ఇంట్రావర్ట్ గా పని చేస్తుంటాడు. ఆయన చాలా అమాయక వ్యక్తి, అతను IT లొ పనిచేసే ఒక ఎక్సట్రావర్ట్ , కెరీర్-ఆధారిత అమ్మాయి అయిన సిందూజ (అను ఇమాన్యుయేల్)తో ప్రేమలో పడతాడు , సమయం గడిచేకొద్దీ వారిద్దరి ప్రేమలో మార్పులు వస్తుంటాయి. ఆమెకు శారీరక సంబంధం మాత్రమే అవసరం అనడంతో కథ వేరే మలుపు తిరుగుతుంది. , చివరిగా, రెండు విలక్షణమైన మనస్తత్వాలు ఈ సంఘర్షణను ఎలా ఎదుర్కొంటాయి అనేది చిత్ర కథగా మలిచాడు దర్శకుడు.
పర్‌ఫార్మెన్స్ : చిత్రంలో అల్లు శిరీష్ కొంత మెరుగైన నటన కనబరిచాడు. శ్రీకుమార్ పాత్రలో ఒదిగిపోయాడు. అమాయక వ్యక్తిగా చాలా బాగా చేసాడు, సిందూజగా అను ఇమ్మాన్యుయేల్ తన పాత్రను అద్భుతంగా పోషించింది. కేవలం గ్లామర్ కోసం మాత్రమే కాకుండా కీలక పాత్రలలో అద్భుతమైన నటనా విన్యాసం ప్రదర్శించింది. ఇక వెన్నెల కిషోర్, సునీల్, ఆమని అందరూ తమ పాత్రలలో ఒదిగిపోయి మెప్పించారు.
ఇక కథలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ రాకేష్ శశి సరైన డ్రామా మరియు కామెడీని అందించడం ద్వారా సినిమాను చాలా బాగా డీల్ చేసాడు కానీ భావోద్వేగాలను తీసుకురావడంలో మాత్రం విఫలమయ్యాడు. తన్వీర్ మీర్ సినిమాటోగ్రఫీ బాగుంది, అతను చిత్రానికి అవసరమైన విధంగా విజువల్స్ అందించాడు మరియు అచ్చు రాజమణి యొక్క కొన్ని పాటలు మరియు నేపథ్యం చాలా బాగుంది మరియు మిగిలిన సాంకేతిక బృందం తమ సత్తా చాటింది.
ప్లస్ పాయింట్లు : కథ
కామెడీ
పర్‌ఫార్మెన్స్
మైనస్ పాయింట్లు : స్లో పేస్
సంగీతం
చివరిగా.. ఊర్వశివో రాక్షసివో చిత్రం ఫస్ట్ పార్ట్ కొంత సహనాన్ని పరీక్షిస్తుంది, అయితే తర్వాత కామెడీ వలన ప్రేక్షకుల ఆసక్తిని కలిగించడంతో కొంతమేరకు చిత్రం సేవ్ అయిందనే చెప్పాలి మరియు హీరో మరియు హీరోయిన్ సాన్నిహిత్యం సన్నివేశాలు కొన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటాయి. ఏది ఏమైనప్పటికీ, ఈ చిత్రం నేటి తరంలో చాలా సమకాలీన పాయింట్‌గా రూపొందించబడింది ,మంచి పాయింట్‌తో దర్శకుడు కాసేపు ఎంగేజ్ చేయగలుగుతాడు.
రేటింగ్: 2.755