Shubman Gill : విరాట్ కోహ్లీ గాయంపై అభిమానుల్లో టెన్షన్.. క్లారిటీ ఇచ్చిన శుభ్‌మ‌న్ గిల్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Shubman Gill : విరాట్ కోహ్లీ గాయంపై అభిమానుల్లో టెన్షన్.. క్లారిటీ ఇచ్చిన శుభ్‌మ‌న్ గిల్

 Authored By ramu | The Telugu News | Updated on :7 February 2025,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Shubman Gill : విరాట్ కోహ్లీ గాయంపై అభిమానుల్లో టెన్షన్.. క్లారిటీ ఇచ్చిన శుభ్‌మ‌న్ గిల్

Shubman Gill : భార‌త జ‌ట్టు Team Indai  టీ20 ప్ర‌పంచ క‌ప్ ద‌క్కించుకొని ఇప్పుడు champions trophy ఛాంపియ‌న్స్ ట్రోఫీపై క‌న్నేసింది. అయితే 2025 ఛాంపియన్స్‌ ట్రోఫీకి ముందు కీలక ఆటగాళ్ల గాయాలు భారత్‌కు India ఆందోళనగా మారాయి. ఇంతకుముందే స్టార్‌ పేసర్‌ jasprit bumrah జస్ప్రీత్ బుమ్రా, ఇప్పుడు కీలక బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి virat kohli ఈ జాబితాలో చేరారు. కుడి మోకాలి నొప్పితో బాధ‌ప‌డుతున్న కోహ్లీ గురువారం నాగ్‌పుర్‌లో మొదలైన భారత్‌- ఇంగ్లాండ్‌ మొదటి వన్డేకి కోహ్లీ దూరమయ్యాడు. కోహ్లీ గాయం తీవ్రతపై స్పష్టత లేదు. టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్ అతడు త్వరగా కోలుకుంటాడని భావిస్తోంది. అయితే కోహ్లీ గైర్హాజరీపై అతని అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఫిట్‌నెస్ ఫ్రీక్ అయిన కోహ్లీకి మోకాలి నొప్పి అంటే నమ్మశక్యంగా లేదని సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేస్తున్నారు.

Shubman Gill విరాట్ కోహ్లీ గాయంపై అభిమానుల్లో టెన్షన్ క్లారిటీ ఇచ్చిన శుభ్‌మ‌న్ గిల్

Shubman Gill : విరాట్ కోహ్లీ గాయంపై అభిమానుల్లో టెన్షన్.. క్లారిటీ ఇచ్చిన శుభ్‌మ‌న్ గిల్

Shubman Gill ఇది క్లారిటీ..

కోహ్లీకి నిజంగానే మోకాలి నొప్పి ఉందా? లేక సాకుతో తప్పించారా? అని ప్రశ్నిస్తున్నారు. గత కొద్ది రోజులుగా విరాట్ కోహ్లీ పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ఫిట్‌నెస్‌కి మారుపేరుగా నిలిచిన కోహ్లీ, గాయాల కారణంగా మ్యాచ్‌లను చాలా అరుదుగా మిస్ అవుతాడు. నిజానికి, 2022 జనవరిలో జోహన్నెస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికా-భారత టెస్ట్ తర్వాత 1130 రోజులకు గాయంతో మ్యాచ్ మిస్ అవ్వడం ఇదే తొలిసారి. అయితే తొలి వ‌న్డే అనంత‌రం శుభ్‌మన్ గిల్ క్లారిటీ ఇచ్చాడు. ‘ఉదయం లేవగానే కోహ్లీ మోకాలు వాచింది. బుధవారం ప్రాక్టీస్ సెషన్‌ వరకు కోహ్లీ బాగానే ఉన్నాడు. ఈ గాయంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తదుపరి మ్యాచ్ వరకు కోహ్లీ ఫిట్ అవుతాడు అని శుభ్‌మన్ గిల్ తెలిపాడు.

కోహ్లీ గైర్హాజరీలో నెంబర్-3లో బ్యాటింగ్ చేసిన శుభ్‌మన్ గిల్ అసాధారణ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.ఆరంభంలోనే వికెట్లు కోల్పోయినప్పుడు నెంబర్ 3 బ్యాటర్ పరిస్థితులకు తగ్గట్లు ఆడాల్సి ఉంటుంది. అదే ఓపెనర్లు శుభారంభం అందిస్తే అదే జోరును కొనసాగించాలి. ఈ ఆలోచన విధానంతోనే పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేశాను. మంచి షాట్స్ ఆడటంపైనే ఫోకస్ పెట్టాను అని అన్నారు. గురువారం మ్యాచ్‌కు ముందు కొన్ని షటిల్ స్ప్రింట్లు చేస్తున్నప్పుడు కోహ్లి కుడి మోకాలికి పెద్ద పట్టీ ఉంది. కోహ్లీని టీమ్‌ ఫిజియో కమలేష్ జైన్ నిశితంగా పరిశీలిస్తుండటం కనిపించింది. ఇప్పటి వరకు కోహ్లీ స్కానింగ్‌ చేయించుకోలేదు. నేషనల్ క్రికెట్ అకాడమీ లో చెక్-అప్ కోసం బెంగళూరుకు వెళ్తాడా లేదా ఫిబ్రవరి 9న కటక్‌లో జరిగే రెండో వన్డేకు అందుబాటులోకి వస్తాడా? అనేది చూడాలి. సిరీస్‌లో చివరి మూడో వన్డే ఫిబ్రవరి 12న అహ్మదాబాద్‌లో జరుగుతుంది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది