Harish Rao VS Komati Reddy : అసెంబ్లీలో మాటల మోత.. హరీష్ రావు VS కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Harish Rao VS Komati Reddy : అసెంబ్లీలో మాటల మోత.. హరీష్ రావు VS కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..!

 Authored By aruna | The Telugu News | Updated on :13 February 2024,12:00 pm

Harish Rao VS Komati Reddy : తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే కృష్ణ ప్రాజెక్టులకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు, నీటిపారుదల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. మంత్రి ఉత్తమ్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత హరీష్ రావు మాట్లాడేందుకు స్పీకర్ గడ్డం ప్రసాద్ అవకాశం ఇచ్చారు. ప్రభుత్వం వాస్తవానికి దూరంగా ఉన్న ప్రజెంటేషన్ ఇచ్చినట్లు హరీష్ రావు ఆరోపణలు చేశారు. తమకు కూడా అవకాశం ఇవ్వాలని కోరామని నిజాలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కానీ ఇందుకు స్పీకర్ అనుమతించకపోవడం దురదృష్టకరమన్నారు. కృష్ణ ప్రాజెక్టులను కేఆర్ఎంబి కి అప్పగించబోమని ప్రభుత్వం ప్రకటించడం అనేది తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ విజయమే అని అన్నారు.

త్వరలో నల్గొండలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సభ పెడుతున్నందువల్లే ఈ ప్రకటన చేసి తప్పులను సవరించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. అయితే హరీష్ రావు వ్యాఖ్యలపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. నల్గొండ జిల్లాకు మోసం చేసినందుకే ప్రజలు బీఆర్ఎస్ ను ఓడించారని విమర్శించారు. ఏపీ అసెంబ్లీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ వినలేదా అంటూ ప్రశ్నించారు. ఏపీ సీఎం చెప్పాక కూడా తామే తప్పు చేసినట్లు మాట్లాడితే ఎలా అని నిలదీశారు. కేసీఆర్, హరీష్ రావు, జగదీశ్ రెడ్డి తమ నల్గొండ జిల్లాలో మోసం చేశారని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఆరోపించారు. ఇప్పటికీ తాగునీటి సమస్యలు తప్పడం లేదన్నారు. జగదీష్ రెడ్డి మొఖం చల్లకే ఈరోజు అసెంబ్లీకి రాలేదని ఎద్దేవా చేశారు.

కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని ఆ తర్వాతే నల్గొండ సభకు రావాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేసారు. తెలంగాణ ఉద్యమంలో హరీష్ రావుకు పెట్రోల్ దొరికింది కానీ అగ్గిపెట్ట దొరకలేదని ఉన్నారు. నల్గొండ ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాకే అక్కడికి రావాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో సభలో కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ తో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రికార్డు నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. ప్రభుత్వం వాస్తవానికి దూరంగా ప్రజెంటేషన్ ఇచ్చినట్లు హరీష్ రావు తెలిపారు దేనితో కోమటిరెడ్డి వెంకటరెడ్డి హరీష్ రావు ఎదురుదాడి తిరిగారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది