Panchayat Raj Elections : బిగ్ బ్రేకింగ్ : ఇంటర్ ,టెన్త్ తర్వాతే పంచాయతీ ఎన్నికలు..?
ప్రధానాంశాలు:
Panchayat Raj elections : బిగ్ బ్రేకింగ్ : ఇంటర్ ,టెన్త్ తర్వాతే పంచాయతీ ఎన్నికలు
Panchayat Raj elections : ఇంటర్మీడియెట్ బోర్డు పరీక్షలు మరో 25 రోజుల్లో మొదలు కానున్న నేపథ్యంలో రాష్ట్రంలో పంచాయతీరాజ్ ఎన్నికలు Panchayat Raj elections ఎప్పుడు జరుగుతాయన్న అంశంపై రాజకీయ వర్గాల్లో సర్వత్రా చర్చ కొనసాగుతోంది. మార్చి 5న మొదలయ్యే ఇంటర్మీడియెట్ పరీక్షలకు Intermediate exams ముందు పెడతారా? మార్చి 21న మొదలై ఏప్రిల్ 4 వరకు సాగే 10వ తరగతి పరీక్షలు 10th exams పూర్తయ్యాక చేపడతారా అన్న దానిపై సర్వత్రా చర్చ కొనసాగుతుంది.
రిజర్వేషన్ల ఖరారు కోసం ఉద్దేశించిన ప్రత్యేక కమిషన్ సోమవారమే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా పంచాయతీరాజ్ సంస్థలైన గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి స్థానిక పరిస్థితులు, జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లను నిర్ణయించాల్సి ఉంటుంది. ఈ కసరత్తు పూర్తి చేయడానికే పంచాయతీరాజ్ శాఖకు కనీసం పది రోజుల సమయం పడుతుందని అంచనా. అన్నీ సిద్ధం చేసుకొనే సరికి ఇంటర్ పరీక్షలు వస్తాయి. వెనువెంటనే పదో తరగతి పరీక్షలు. ఇప్పటికే ఎన్నికల విధులకు జూనియర్ లెక్చరర్లను, ఉపాధ్యాయులను వినియోగించాలని నిర్ణయించారు.
Panchayat Raj Elections మంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి Revanth reddy భేటీ
ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు ఇంటర్ పరీక్షల ప్రారంభానికి ముందు గానీ, పదో తరగతి పరీక్షలు పూర్తయ్యాక గానీ చేపట్టాల్సి ఉంటుంది. 25 రోజుల్లో మొత్తం ప్రక్రియను పూర్తి చేయడం సాధ్యమవుతుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల పై సిఎం రేవంత్ రెడ్డి revanth reddy మంత్రులతో కీలక సమావేశం నిర్వహించారు. విద్యార్థుల భవిష్యత్, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఇంటర్మీడియట్, టెన్త్ పరీక్షల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని అంతా ఏకాభిప్రాయానికి వచ్చారు.