Revanth Reddy : కేటీఆర్.. నువ్వు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై పోరాడుతావా? రేవంత్ రెడ్డి ఫైర్?
Revanth Reddy : రేవంత్ రెడ్డి గురించి తెలుసు కదా. ఎదుటి వాళ్లు ఎంతటి వాళ్లు అయినా సరే.. వాళ్లు తప్పు చేస్తే తాట తీస్తారు. ముఖ్యమంత్రి అయినా.. ప్రధాన మంత్రి అయినా.. తన జోలికి వచ్చినా సరే.. అస్సలు వదలరు. అదే రేవంత్ రెడ్డికి ఉన్న పవర్. తన వాక్చాతుర్యంతో అందరినీ కట్టిపడేయగల సత్తా ఉన్న నేత రేవంత్ రెడ్డి.
ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ కు ఉన్న ఒకే ఒక దిక్కు రేవంత్ రెడ్డి. ఆయన పార్టీని బలోపేతం చేసేందుకు చేస్తున్న ప్రయత్నం మామూల్ది కాదు. కాంగ్రెస్ కు పెద్ద దిక్కులా ఉంటూ.. ప్రజల్లో పార్టీ పట్ల విశ్వాసం సమకూర్చేందుకు రేవంత్ రెడ్డి ఎంతో ప్రయత్నిస్తున్నారు. దాని కోసం పాదయాత్రలు, రాజీవ్ భరోసా యాత్రలను కూడా చేపడుతున్నారు రేవంత్ రెడ్డి.
ప్రస్తుతం తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఫుల్ బిజీగా ఉన్నారు. ఈసందర్భంగా ఎన్నికల ప్రచారంలో అధికార టీఆర్ఎస్ పార్టీపై విమర్శల వర్షం గుప్పిస్తున్నారు.
Revanth Reddy : ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం కేటీఆర్ వేస్తున్న పన్నాగాలు ఇవి
అయితే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని.. ఎన్నికల్లో లబ్ధి పొందాలని మంత్రి కేటీఆర్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతు ప్రకటిస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు.
తెలంగాణకు రావాల్సిన నిధులు, విభజన హామీలపై కేంద్రంతో కొట్లాడలేని వాళ్లు విశాఖ ఉక్కు ప్లాంట్ ప్రైవేటీకరణపై ఎలా పోరాడుతారు.. అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
ఓవైపు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుంటే… గ్యాస్ ధరలు పెరుగుతుంటే… పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుంటే.. పార్లమెంట్ లో పోరాడకుండా… టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు మొహం చాటేస్తున్నారు. పార్లమెంట్ లో కేంద్రంతో పోరాడే సత్తా లేదు వీళ్లకు. ప్రధాని మోదీ అంటే భయపడుతున్నారు వీళ్లు. మోదీ అంటే భయమా? లేక రాజీనా? అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.