Revanth Reddy : రేవంత్ రెడ్డి రాజీనామా.. ఆయనకే కొత్త బాధ్యతలు..!
ప్రధానాంశాలు:
Revanth Reddy : రేవంత్ రెడ్డి రాజీనామా.. ఆయనకే కొత్త బాధ్యతలు..!
Revanth Reddy : తెలంగాణ రాజకీయాలు ఎంత రసవత్తరంగా మారుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. అసెంబ్లీ ఫలితాల నుండి రాష్ట్ర రాజకీయాలు అందరి దృష్టిని ఆకర్షిస్తూనే ఉన్నాయి. ఇక ఇటీవల లోక్ సభ ఎన్నికలు జరగగా, వాటిలో ఎలాంటి ఫలితం వస్తుందా అని ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయనున్నారని, ఆయన స్థానంలో కొత్త లీడర్ పగ్గాలు చేపట్టబోతున్నారని చర్చ మొదలైంది. అయితే ఇక్కడ మీరు ఆశ్చర్యపోవల్సింది ఏమి లేదు. ఆయన రాజీనామా చేసేది సీఎం పదవికి కాదండోయ్.. టీపీసీసీ పదవికి.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలోనే పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయబోతున్నారు. దీంతో ఆశావహులు చాలామంది దీనికోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
Revanth Reddy పోటీ మాములుగా లేదు..
రెడ్డి సామాజికవర్గానికి చెందిన రేవంత్ ముఖ్యమంత్రిగా కొనసాగుతుండటంతో ఇతర సామాజిక వర్గాలకు పీసీసీ పదవి దక్కే అవకాశం కనపడుతోంది. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కావాలని పట్టుబడుతున్నారు. ఆయన సోదరుడు వెంకటరెడ్డి మంత్రిగా ఉండటంతో మంత్రి పదవి దక్కడం కష్టమే అవుతుంది. అయితే పీసీసీ అయినా ఇవ్వాలని పట్టుబట్టే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గానికి చెందినవారికి ఇవ్వాలని భావిస్తే భట్టి విక్రమార్కకు ఇచ్చే అవకాశం ఉంది. ఆయన ముఖ్యమంత్రి పదవికి పోటీ పడగా, ఆయనకి పీసీసీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని అంటున్నారు. ఇక నాగర్ కర్నూల్ లోక్ సభ సీటు ఆశించిన సంపత్ పేరు కూడా వినపడుతోంది.
బీసీ సామాజికవర్గం నుంచి మధుయాష్కీ గౌడ్, మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్ మధ్య పోటీ ఉండే అవకాశం ఉంది. మరోవైపు మధు యాష్కీగౌడ్ రాహుల్ గాంధీకి సన్నిహితుడు కాబట్టి ఆయన పేరు కూడా ఎక్కువగా వినిపిస్తుంది. మహేష్, అంజన్ కు రేవంత్ మద్దతు ఉంటుంది కాబట్టి రేవంత్ ఎవరిపేరు ప్రతిపాదిస్తే వారికే పీసీసీ పీఠం దక్కే అవకాశం ఉంది. ఇక మైనార్టీల నుంచి ఇవ్వాలనుకుంటే షబ్బీర్ అలీకి ఇచ్చే ఛాన్స్ ఉంది. . ఎస్టీ సామాజికవర్గానికి ఇవ్వాలనుకుంటే మంత్రి సీతక్క కు ఇవ్వొచ్చు.
చూడాలి మరి రానున్న రోజులలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి అనేది.