RRR 1st Day Collections : రికార్డులు బద్దలు కొట్టిన ఆర్ఆర్ఆర్.. బహుబలి2‌ను మించి వసూళ్లు.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

RRR 1st Day Collections : రికార్డులు బద్దలు కొట్టిన ఆర్ఆర్ఆర్.. బహుబలి2‌ను మించి వసూళ్లు..

 Authored By mallesh | The Telugu News | Updated on :26 March 2022,3:00 pm

RRR 1st Day Collections : ఫ్లాప్ అంటే ఏంటో తెలియని దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. ఆయన డైరెక్షన్ లో వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీ అన్ని రికార్డులు బద్దులు కొడుతోంది. విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంటోంది ఈ మూవీ. కానీ కొందరి నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. నీ ఈ మూవీ వసూళ్లు మాత్రం ప్రస్తుతం చర్చణీయాంశంగా మారింది. నైజాం ఏరియాకు సంబంధించిన థియేట్రికల్ హక్కులు రూ.70 కోట్లు, సీడెడ్ హక్కులు రూ.37 కోట్లు, ఉత్తరాంధ్ర థియేట్రికల్ రైట్స్ రూ.22 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇక్కడే సుమారు రూ.130 కోట్లు వరకు బిజినెస్ జరిగింది.

ఇక ఆంధ్రాలోని పలు జిల్లాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి మాట్లాడుకుంటే.. తూర్పు గోదావరి జిల్లా థియేట్రికల్ హక్కులు రూ.14 కోట్లు, పశ్చిమ గోదావరి రూ.12 కోట్లు, గుంటూరు రూ.15 కోట్లు, కృష్ణా రూ.13 కోట్లు, నెల్లూరు రూ.8 కోట్లకు వరకు బిజినెస్ అయింది. దీంతో తెలంగాణ, ఏపీలో ఈ మూవీ హక్కుల విలువ సుమారు రూ.190 కోట్లకు పైగానే ఉన్నది.తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు ఇలా..ఆర్ఆర్ఆర్ మూవీ నైజాంలో రూ.22 కోట్లకు పైగా షేర్ నమోదు చేసే చాన్స్ ఉంది. సీడెడ్‌ ఏరియాలో రూ.14 కోట్లు, ఆంధ్రాలో రూ.36 కోట్లు షేర్ సాధించే చాన్స్ ఉన్నది.

record breaking RRR 1st Day Collections

record breaking RRR 1st Day Collections

RRR 1st Day Collections : రికార్డు స్థాయిలో కలెక్షన్స్..

దాంతో తెలుగు రాష్ట్రాల్లోనే సుమారు రూ.70 కోట్ల షేర్ రాబట్టనున్నది. కర్ణాటకలో రూ.8 కోట్లు, తమిళనాడులో రూ.5 కోట్లు, కేరళలో రూ.1.2 కోట్ల షేర్ సాధించుకునే చాన్స్ ఉంది. మొత్తంగా వరల్డ్ వైడ్ గా రూ.125 కోట్ల షేర్, రూ.250 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించే చాన్స్ ఉంది. ఈ సినిమా రూ.800 కోట్ల షేర్ సాధిస్తే బ్లాక్ బస్టర్‌గా, 630 కోట్లకో పైగా సాధిస్తే హిట్ అని, రూ.450 కోట్లకుపైగా వసూలు చేస్తే హిట్ అని, రూ.450 కోట్లకు తక్కువగా వస్తే.. యావరేజ్ అని, రూ.420 కోట్ల లోపు వసూలు చేస్తే ఫ్లాప్‌ అని, రూ.350 నుంచి రూ.370 లోపు వస్తే డిజాస్టర్‌ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది