Viral Video : ప్రస్తుత సమాజంలో రకరకాల వింత సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా వివాహ జీవితానికి సంబంధించి వస్తున్న వార్తలు ఒక్కోటి ఒక్కో రీతిలో సంచలనాలు కలిగిస్తున్నాయి. ఈ రీతిగానే ఇటీవల ఆసుపత్రిలో ఐసీయూలో గడ్డపై ఉన్న యువతిని ఓ యువకుడు పెళ్లి చేసుకోవడం జరిగింది. ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల ఆసుపత్రిలో జరిగింది. చెన్నూరు మండలం లంబాడి పల్లెకు చెందిన శైలజ… భూపాల పల్లెకు చెందిన తిరుపతికి.. ఇదివరకే పెళ్లి నిశ్చయమైంది.

ఆ సమయంలోనే ముహూర్తం కూడా ఖరారు చేశారు. కానీ సరిగ్గా పెళ్ళికి ఒకరోజు ముందు వధువు శైలజ అస్వస్థతకు గురైంది. దీంతో వెంటనే బంధుమిత్రులు శైలజని మంచిర్యాల ఆసుపత్రిలో జాయిన్ చేయడం జరిగింది. అనారోగ్యం కారణంగా శైలజాకి వైద్యులు ఆపరేషన్ చేశారు. ఇటువంటి పరిస్థితులలో ఎవరైనా పెళ్లి వాయిదా వేసుకోవటం జరుగుద్ది. కానీ వరుడు తిరుపతి అందుకు ఒప్పుకోలేదు. అనుకున్న ముహూర్తానికి శైలజాకి తాళి కట్టేశాడు.
ఆపరేషన్ జరిగి..ఐసీయూలో బెడ్ పై ఉన్న శైలజా ని పెళ్లి చేసుకోవడం జరిగింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో ఉన్న ఇతర పేషంట్ల మధ్య దండలు మార్చుకున్నారు. ఈ పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆసుపత్రి వైద్యులు మిగతా కుటుంబ సభ్యులు… ఈ పెళ్లి విషయంలో చాలా శ్రద్ధ తీసుకుని.. అనారోగ్యంతో ఐసీయూ బెడ్ పై ఉన్న ఆమెకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పెళ్లి చేయడం జరిగింది.