Viral Video : ఆస్తికోసం తండ్రిని చావబాదిన కొడుకు.. మృత్యువాత పడిన తండ్రి… వీడియో ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral Video : ఆస్తికోసం తండ్రిని చావబాదిన కొడుకు.. మృత్యువాత పడిన తండ్రి… వీడియో !

 Authored By ramu | The Telugu News | Updated on :28 April 2024,4:02 pm

ప్రధానాంశాలు:

  •  Viral Video : ఆస్తికోసం తండ్రిని చావబాదిన కొడుకు.. మృత్యువాత పడిన తండ్రి... వీడియో !

Viral Video : నేటి సమాజంలో ప్రేమానురాగాలు అనేవి ఆస్తి పంపకాలపైనే ఆధారపడి ఉంటున్నాయి. ఇక ఈ ఆస్తి పంపకాల వలన ఒకే కుటుంబానికి చెందిన వారు సైతం గొడవలు పడి విడిపోతున్నారు. అంతేకాదు ఆస్తి ఇవ్వలేదని తల్లిదండ్రులను బయటకు గెంటేసిన కొడుకులు కూడా ఉన్నారు. అయితే ఇలాంటి సంఘటనలు మనం ఇప్పటికే చాలా చూస్తూ వచ్చాం. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇలాంటిదే ఓ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ ఘటన ఎక్కడ ఎప్పుడు చోటు చేసుకుంది అనేది తెలియదు కానీ దీనికి సంబంధించిన వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోని గమనించినట్లయితే సోఫా పైన కూర్చుని ఉన్న ఓ వ్యక్తిని ఓ యువకుడు వచ్చి పిడుగుద్దులతో మొఖంపై కొట్టడం మొదలు పెట్టాడు.

Viral Video ఆస్తికోసం ఘోరంగా తండ్రిని

ఇక ఆ వ్యక్తి వయసు కూడా చాలా పెద్దది కావడంతో తట్టుకోలేక అపస్మారక స్థితికి వెళ్ళినట్లుగా కనిపిస్తుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే. కే సంతోష్ (40)అనే వ్యక్తి ఆస్తికోసం తన కన్న తండ్రి పై వికృత స్థాయిలో దాడి చేశాడు. ఈ వీడియోలో సోఫాలో కూర్చుని కనిపిస్తున్న వ్యక్తి శ్రీ అమృత సాగో ఇండస్ట్రీస్ యజమాని కులందైవేలు (63)అని తెలుస్తోంది. అయితే అతని కొడుకు సంతోష్ ఆస్తి కోసం తన తండ్రి పై వికృత స్థాయిలో దాడి చేయడంతో అపస్మారక స్థితి లోకి వెళ్లిపోయాడు. దీంతో గత రెండు నెలలుగా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇటీవల ఏప్రిల్ 18న గుండెపోటుతో మరణించారు.

Viral Video ఆస్తికోసం తండ్రిని చావబాదిన కొడుకు మృత్యువాత పడిన తండ్రి వీడియో

Viral Video : ఆస్తికోసం తండ్రిని చావబాదిన కొడుకు.. మృత్యువాత పడిన తండ్రి… వీడియో !

అయితే కులంధైవేలు మరణం పై అనుమానం రావడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తుండగా కొడుకు సంతోష్ తండ్రిని దారుణంగా కోడుతున్న వీడియో బయటపడింది. దీంతో పోలీసులు సంతోష్ ని ఏప్రిల్ 25 న అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆస్తి కోసం తండ్రిని ఇంత దారుణంగా కొట్టిన సంతోష్ ను నేటిజనులు తిట్టిపోస్తున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది