Viral Video : ఆ పాటకు మాస్ స్టెప్స్ వేస్తూ పెళ్లి మండపానికి వచ్చిన వధువు…. మరల ఆ ట్రెండ్ రిపీట్ అవుతుందిగా.. వీడియో

Advertisement

Viral Video : ప్రస్తుత కాలంలో పెళ్లిళ్లలో పెళ్లికూతురు పెళ్ళికొడుకు వేసే డాన్సులు నెట్టింట బాగా సందడి చేస్తున్నాయి. ఇదివరకు రోజుల్లో అయితే పెళ్లికూతురు సిగ్గుపడుతుంటే ఒక నలుగురు ఆమెను తీసుకుని మండపంలోకి తీసుకొచ్చేవారు. కానీ ఇప్పుడు ట్రెండు పూర్తిగా మారిపోయింది. ఇక ఇప్పుడు పెళ్లికూతురే డాన్స్ వేస్తూ పెళ్లి మండపంలోకి వస్తున్నారు. రీసెంట్గా తెలంగాణలో ఒక పెళ్లికూతురు బుల్లెట్ బండి అనే పాటకు డాన్స్ చేయగా అది నెట్టింటా వైరల్ గా మారింది. ఇక దానికి సంబంధించిన డాన్స్ వీడియో అప్పుడు తెగ సందడి చేసింది. ఇక పెళ్లికూతురు వేసిన మాస్ స్టెప్స్ అందర్నీ ఆశ్చర్యపరిచాయి.

Advertisement

దీంతో ఇలాంటివి ఎన్నో రకాల వీడియోలతో ఫాలోవర్స్ ని పెంచుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ఏ సినిమా పాటైనా కొత్తగా చూపిస్తే చిటికెలో ట్రెండ్ అవుతుంది. ఇక యువతీ యువకుల డాన్స్ వల్ల ఆ పాటకు మంచి ఊపు వస్తుంది. ఇక ఇటీవల రిలీజ్ అయిన అరబిక్ పాట ఒకటి యూట్యూబ్ లో ట్రేండింగ్ గా మారింది. దాదాపుగా ఇప్పటివరకు 10 కోట్ల 95 లక్షల మంది ఈ పాటను వీక్షించారు. ఈ పాట విడుదలై నెల రోజులు కావస్తున్న ఇప్పటికే అదే క్రేజ్ ఈ పాటకి ఉండడం విశేషం. ఇక ఈ పాటకి నేటి జనలే కాకుండా సినీ తారులు కూడా డాన్స్ చేస్తూ రీల్స్ చేశారు.

Advertisement
The bride mass steps to Bullettu Bandi Song on video
The bride mass steps to Bullettu Bandi Song on video

నేటి సినీ తారలు సమంత, కీర్తి సురేష్, రష్మిక, వేదిక , పూర్ణ , రితిక సింగ్, ఇంకా ఎంతోమంది ఈ పాటలకు చిందులేశారు. అయితే సినీ తారలకేమాత్రం తీసిపోకుండా ఇంస్టాగ్రామ్ వేదికగా ఎంతో మంది యువతీ యువకులు ఈ డ్రెండ్ ను ఫాలో అవుతున్నారు. ఇక ఇప్పుడు అలా సోషల్ మీడియాలో ఒక యువతి చేసిన డాన్స్ వైరల్ గా మారింది. బ్లాక్ కలర్ స్పెట్స్ పెట్టుకుని, పెళ్లి మండపం లోకి వస్తున్న పెళ్లికూతురు తన ఫ్రెండ్స్ తో కలిసి బుల్లెట్ బండి అనే సాంగ్ డాన్స్ చేసి నెట్టింట వైరల్ గా మారారు. మంచి పట్టు చీర కట్టుకొని ఒళ్లంతా నగలతో మండపంలోకి డాన్స్ చేస్తూ వచ్చింది. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.

Advertisement
Advertisement