Viral Video : పెళ్లి పీటలపై ఏడ్చిన పెళ్లి కొడుకు.. పెళ్లి కూతురే కారణమంట
Viral Video: పెళ్లి అనగానే ఎక్కడలేని సందడి వచ్చేస్తుంది. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు.. ఇద్దరినీ ఇరు కుటుంబాల వారు అందం గా ముస్తాబు చేస్తారు. అసలు కళ అంత వారి కళ్లలోనే ఉందా అన్నట్లు ఉంటుంది. పెళ్లి ఘడియల ముందు.. పెళ్లికూతురు మోములో సిగ్గు.. అబ్బాయి కళ్ళలో ఆనందం.. ఇవే కదా అసలు పెళ్లి వేడుకకు సందడి తీసుకొచ్చేది.పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తులకు సంబంధించినది మాత్రమే కాదు రెండు కుటుంబాలు వారి అనుబంధాలు ఇలా ఎన్నో ఇద్దరి కలయిక వల్ల ముడి పడతాయి. ఇక అటువంటి పెళ్ళిలో ఎన్నో సందడులు, ఎమోషన్స్ , ప్రేమ ఇలా ఎన్నో మనోభావాలు కలిసి ఉంటాయి. మనమందరం జీవితంలో ఎవరో ఒకరిని ప్రేమిస్తాము.
ఆ ప్రేమని నిలబెట్టుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తాము. కొందరి తల్లి దండ్రులు పిల్లల ప్రేమ వివాహానికి అంగీకరిస్తే ఇంకొంతమంది నిరాకరిస్తారు. కానీ ప్రేమించిన అమ్మాయిని తల్లి దండ్రులే దగ్గరుండి పెళ్లి జరిపిస్తే ఆ ఆనందమే వేరు కదా. అలాంటి సంఘటనే ఇక్కడ జరిగింది. పైగా ఆనందంలో పెళ్లి కొడుకు పెళ్లి పీటల పైనే కంటతడి పెట్టుకున్నాడు. అయితే ఈ భావాలని కాప్చర్ చేయగలిగేది కెమెరా మాత్రమే. అలా పెళ్లి జరుగుతున్నా సమయం లో పెళ్లి కొడుకు పీటల పైన ఏడుస్తూ కెమెరా కంటికి చిక్కాడు.ఎంతో ఆనందంగా ఉండాల్సిన పెళ్లి కొడుకు ఎందుకు ఏడుస్తున్నాడో మొదట ఎవరికీ అర్థంకాలేదు.
పెళ్లి కొడుకు మాత్రమే కాదు అక్కడ ఉన్న అమ్మాయి కుటుంబ సభ్యులు కూడా కంటతడి పెట్టారు. ఎందుకంటే తాను ప్రేమించిన అమ్మాయి కి తాళి కట్టే సమయం రాగానే ఆ సంతోషంలో ఆ వధూ వరుల కంట నీళ్లు వచ్చాయి. అప్పుడు అర్థమైంది అది ఏడుపు కాదు.. ఆనంద భాష్పాలని.. అలా ఏడుస్తూ పెళ్లి కొడుకు వైపు చూసిన పెళ్లి కూతురు ఒక చిన్న చిరు నవ్వు నవ్వింది.ఇక ఆ వీడియో ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసిన వారు ప్రతి ఒక్కరికి ఇలాంటి జీవిత భాగస్వామే రావాలంటూ కోరుకుంటున్న అని ఈ వీడియో ని పోస్ట్ చేసారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతుంది. మీరు కూడా చూసేయండి మరి….
View this post on Instagram