Viral Video : ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాను వినియోగించని వారు లేరంటే అతిశయోక్తి కాదు. చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరు సోషల్ మీడియాను ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల దాకా ప్రతి ఒక్క విషయం కూడా క్షణాల్లో వైరల్ అవుతుంది. అలాగే ఎవరైనా తమ అభిప్రాయాలను, ఏదైనా మాట్లాడటానికి కూడా సోషల్ మీడియాను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇకపోతే నిత్యం వేలాది వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. అందులో కొన్ని వీడియోలు మనల్ని నవ్వింప చేసేలా ఉంటాయి.
మరికొన్ని వీడియోలు ఆలోచింపజేసేలా ఉంటాయి, అలాగే ఇంకా మరికొన్ని వీడియోలు ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో కొంచెం బాధపడేలా కొంచెం భయానకంగా ఉంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి బండరాళ్ల మధ్యలో ఇరుక్కున్నాడు. అక్కడి నుంచి బయటికి రాలేక నానా అవస్థలు పడ్డాడు. అంత పెద్ద బండరాల మధ్యలో ఆ వ్యక్తి దూరడంతో బయటికి రాలేడేమో అనుకున్నారు. చివరికి ఎలాగోలా బయటికి వచ్చేసాడు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. ఈ ఘటన మొత్తాన్ని వీడియో తీసిన ఓ వ్యక్తి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. అది కాస్త క్షణాల్లో వైరల్ అయింది.

కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలం చెన్నంపల్లిలోని కోటలో బోయ రాజేష్ అనే యువకుడు తన మేక కనిపించకపోవడంతో బండరాళ్ల మధ్యలో వెళ్లిందనే అనుమానంతో అందులోకి వెళ్ళాడు. అక్కడ ఏమి కనిపించకపోవడంతో బయటికి వచ్చేందుకు ప్రయత్నించగా అతడు ఎటు కదలలేని పరిస్థితి ఏర్పడింది. ఎంత ప్రయత్నించిన ఆ బండరాల మధ్యలో నుంచి బయటికి రాలేకపోయాడు. అలా చాలాసేపు బయటికి వచ్చేందుకు ప్రయత్నించాడు కానీ ఫలితం లేకపోవడంతో చివరికి రాజేష్ తన ఫోన్ ద్వారా గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే అక్కడికి వచ్చిన ఆ ఊరి జనం అతడిని తాళ్ళ సహాయంతో పైకి లాగేశారు. దీంతో రాజేష్ కి ప్రాణాపాయం తప్పింది.
బండరాళ్ల మధ్య ఇరుక్కున్న యువకుడు
కర్నూలు – తుగ్గలి మండలం చెన్నంపల్లిలోని కోటలో బోయ రాజేష్ అనే యువకుడు తన మేక కనిపించకపోవడంతో బండరాళ్ల మధ్యలో వెళ్లిందనే అనుమానంతో అందులోకి వెళ్ళాడు.
రాజేష్ తన ఫోన్ ద్వారా గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో తాళ్ల సహాయంతో అతనిని పైకి లాగడంతో ప్రాణాపాయం… pic.twitter.com/n4XdaBqO7a
— Telugu Scribe (@TeluguScribe) August 1, 2023