Adilabad..జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి: ఉపాధి కల్పనా అధికారి
కొవిడ్ కట్టడికి విధించిన లాక్‌డౌన్, ఆ తర్వాత టైంలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ప్రైవేటు రంగంలో ఉద్యోగులు చాలా మందిపై వేటు పడింది. ఈ క్రమంలోనే నిరుద్యోగులు ఊళ్ల బాట పట్టి చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు. కాగా, మంచిర్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో జిల్లాలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకుగాను మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పనా అధికారి కౌశిక్ వెంకట రమణ బుధవారం పేర్కొన్నారు.
ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అపోలో ఫార్మసీలో ఫార్మసీ అసిస్టెంట్, ట్రైయినీ, ఫార్మసిస్ట్ జాబ్స్ అవెయిలబుల్‌గా ఉన్నట్లు వివరించారు. ఇందుకు అవసరమైన ట్రైనింగ్ ఇచ్చే ఏర్పాట్లు కూడా ఉంటాయని, పూర్తి వివరాలకు స్థానిక ఐటీఐ కాలేజీలో సంప్రదించాలని కోరారు. అభ్యర్థులు ఈ జాబ్ మేళాకు హాజరయ్యేందుకుగాను ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్‌తో పాటు ఆధార్ కార్డు జిరాక్స్ ఎంప్లాయిమెంట్ కార్డు సబ్మిట్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.