Ambati Rambabu : టీడీపీని కాపాడుకోవడానికే జనసేన పుట్టింది.. అంబటి సంచలన వ్యాఖ్యలు
ప్రధానాంశాలు:
Ambati Rambabu : టీడీపీని కాపాడుకోవడానికే జనసేన పుట్టింది.. అంబటి సంచలన వ్యాఖ్యలు
Ambati Rambabu : పిఠాపురం వేదికగా జయకేతనం పేరుతో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అట్టహాసంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ వివిధ అంశాలపై మాట్లాడుతూ వైసీపీ పైన కూడా విమర్శలు చేశారు. దీంతో అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. కేవలం 21 సీట్లలో పోటీ చేసి.. 21 చోట్ల గెలిచి వంద శాతం స్ట్రైక్ రేట్ అంటూ గొప్పలకు పోతున్నారని ఎద్దేవా చేశారు.

Ambati Rambabu : టీడీపీని కాపాడుకోవడానికే జనసేన పుట్టింది.. అంబటి సంచలన వ్యాఖ్యలు
Ambati Rambabu పవర్ ఫుల్ పంచ్‌లు..
పవన్ కళ్యాణ్ రెండు గంటల పాటు మాట్లాడితే.. ఆ ఉపన్యాసం కనీసం ఆయనకైనా అర్థమైందో లేదోనంటూ అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. నిలబడ్డాం, టీడీపీని నిలబెట్టామంటున్న పవన్ కళ్యాణ్.. జనసేనను తెలుగుదేశం పార్టీకి బీటీమ్‌గా మార్చారని అంబటి రాంబాబు విమర్శించారు. పవన్‌ను, జనసేనను అడ్డం పెట్టుకుని కాపులను ఆకర్షించాలనేదే చంద్రబాబు నాయుడు ప్లాన్ అంటూ అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు.
21 సీట్లలో పోటీచేసి, 21 సీట్లు గెలిచి వందశాతం స్ట్రైక్ రేట్ అంటున్న పవన్ కళ్యాణ్.. జనసేన ఎమ్మెల్యేలలో ఎంతమంది తన వాళ్లో చెప్పాలన్నారు. జనసేన ఎమ్మెల్యేలు, జయకేతనం వేదిక మీద ఉన్న వాళ్లల్లో ఎక్కువమంది టీడీపీ పంపిన వాళ్లు, వైసీపీ తిరస్కరించిన వాళ్లే ఉన్నారని అంబటి రాంబాబు సైటెర్లు వేశారు. వందశాతం స్ట్రైక్ రేట్ అంటున్న పవన్ కళ్యాణ్.. తన ఎమ్మెల్యేలలో ఎంత మంది తమ వాళ్లో చెప్పాలన్నారు. సూపర్ 6, సూపర్ 7.. పథకాలు ఏమయ్యాయో చెప్పకుండా 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించినట్లు గొప్పలు చెప్పుకొంటే సరిపోదని అన్నారు.