EC Poultry Farms : జస్ట్ కోళ్లను పెంచి ఇస్తే చాలు .. సంవత్సరానికి 42 లక్షల ఆదాయం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

EC Poultry Farms : జస్ట్ కోళ్లను పెంచి ఇస్తే చాలు .. సంవత్సరానికి 42 లక్షల ఆదాయం..!

 Authored By anusha | The Telugu News | Updated on :2 December 2023,8:00 pm

ప్రధానాంశాలు:

  •  EC Poultry Farms : జస్ట్ కోళ్లను పెంచి ఇస్తే చాలు ..

  •  ఈసీ పౌల్ట్రీ ఫారం సంవత్సరానికి 42 లక్షల ఆదాయం..!

EC Poultry Farms : చిత్తూరు జిల్లాకు చెందిన ఈసీ పౌల్ట్రీ ఫారం లో సంవత్సరానికి 35 లక్షలు ఆదాయం వస్తుందని ఆ ఫారం ను నిర్వహిస్తున్న శేషాద్రి నాయుడు తెలిపారు.సాధారణ కోళ్ల ఫారం తో పోలిస్తే ఈసీ కోళ్ల ఫారం వలన లాభాలు ఎక్కువగా వస్తాయని శేషాద్రి నాయుడు చెబుతున్నారు. ఈ ఫారం లో ఎక్కువమంది మనుషులతో పనిలేదని, ఇద్దరు ఉంటే సరిపోతుందని, ఇక కంపెనీ కోడి పిల్లలను, మెడిసిన్, దాణాను పంపిణీ చేస్తుందని, మనకు వచ్చే కమిషన్ మాత్రం మిగులుతుంది అని అంటున్నారు. ఒక్క కోడికి 25 రూపాయలు మిగులుతుందని, కేజీకి 11,12 రూపాయలను బట్టి ఇస్తారని. ఒక్కోసారి కోడికి 27 రూపాయలు కూడా మిగులుతాయి అని ఆయన తెలిపారు.

ఈసీ కోళ్ల ఫారాల ద్వారా రైతులకు సంవత్సరానికి గరిష్టంగా 42 లక్షల ఆదాయం వస్తుందని కంపెనీ వాళ్లు చెబుతున్నారు. కోళ్ల షెడ్డు ఏర్పాటు చేశాక కంపెనీ కోడి పిల్లలను, దాణా, మెడిసిన్ పంపిణీ చేస్తుందని, తర్వాత కంపెనీ వాళ్ళే కోళ్లను మార్కెటింగ్ చేసి ఆ డబ్బులను కేజీకి ఇంత ఇస్తామని, రైతులకు కేజీ 14 రూపాయల లెక్క ఇస్తామని కంపెనీ తెలిపింది. సాధారణ కోళ్ల తో పోలిస్తే ఇవి భిన్నంగా ఉంటాయి. ఉష్ణోగ్రతలను నియంత్రిస్తూ కోళ్లను పెంచుతారు. కాబట్టి వీటిని Environmental Control ( ఈసీ) కోళ్ల ఫారాలని అంటారు. సెమీ ఆటోమేటిక్ ఫుల్లీ ఆటోమేటిక్ అని రెండు రకాలు ఉంటాయి. కోళ్లు తినేకొద్ది దాన ఆటోమేటిగ్గా వస్తూ ఉంటుంది. వాటర్ ఎప్పుడు లైవ్ లోనే ఉంటాయి.

ఈసీ కోళ్ల ఫారం లో ఉష్ణోగ్రతలను నియంత్రణలో ఉంచేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. కావలసినంత ఉష్ణోగ్రతను అందించడం వలన కోళ్లు 30,35 రోజుల్లో అమ్మకానికి వస్తాయి. అదే బయట అయితే 50,60 రోజులు పడుతుంది. ఇక ఈసీ కోళ్ల ఫారం షెడ్ కి పెట్టుబడి ఎక్కువే అవుతుంది. కానీ రెండు మూడు ఏళ్లలో తిరిగి వచ్చేస్తుందని పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. దాదాపుగా ఈసీ కోళ్ల ఫారం పెట్టడానికి కోటి రూపాయల వరకు ఖర్చు అవుతుందని రైతులు చెబుతున్నారు. ఇక ఈ కోళ్ల ఫారం పెట్టడానికి అనువైన ప్రదేశంతో పాటు నీటి సరఫరా, విద్యుత్ సరఫరా కచ్చితంగా ఉండాలని, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 500 వరకు ఇలాంటి కోళ్ల ఫారాలు ఉన్నాయని అంచనా. సాధారణంగా కోళ్ల ఫారాల నుంచి దుర్వాసన వస్తుంది కానీ ఈసీ కోళ్ల ఫారాల వలన ఎటువంటి దుర్వాసన రాదని రైతులు చెబుతున్నారు.

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది