Today Gold Price : నిన్నటి వరకు ఊరించిన బంగారం ధర.. ఈరోజు హడలెత్తించింది..!
Today Gold Price : గత వారం రోజులుగా తగ్గుదల కనిపించిన బంగారం ధరలు (Gold Price) ఈరోజు ఊహించని విధంగా భారీగా పెరిగాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల పసిడికి 10 గ్రాములకు రూ.1,200 పెరిగి తాజాగా రూ.95,130కి చేరింది. ఇదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.1,100 పెరిగి 10 గ్రాములకు రూ.87,200 వద్ద కొనసాగుతోంది. పెరుగుతున్న అంతర్జాతీయ బులియన్ మార్కెట్, డాలర్ మారక రేటు ప్రభావం, ఆభరణాలపై డిమాండ్ పెరగడం వంటి కారణాలతో బంగారం ధరలు పెరిగాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Today Gold Price : నిన్నటి వరకు ఊరించిన బంగారం ధర.. ఈరోజు హడలెత్తించింది..!
ఇక వెండి విషయానికి వస్తే.. వెండి ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1,08,000 వద్ద స్థిరంగా ఉంది. గత కొన్ని రోజులుగా వెండి ధరలు స్థిరంగా ఉండటం వినియోగదారులకు కొంత ఊరట కలిగించినా, బంగారం ధరలు ఇలా ఊహించని రీతిలో పెరగడం మళ్లీ వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది. మున్ముందు పెళ్లిళ్ల సీజన్ దగ్గరపడుతుండటంతో బంగారం కొనుగోలు చేసే వారి ఖర్చు మరింతగా పెరిగే అవకాశముంది.
రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో కూడా బంగారం ధరలు సమానంగా నమోదయ్యాయి. హైదరాబాద్లో లాగానే విశాఖపట్నం, విజయవాడ, వరంగల్, నల్గొండ వంటి నగరాల్లోనూ ఈ ధరలే అమలులో ఉన్నాయి. వినియోగదారులు ప్రస్తుతం బంగారం కొనుగోలుపై పునరాలోచిస్తున్నా, దీర్ఘకాలిక పెట్టుబడిగా పసిడిని కోరుకునే వారు మాత్రం తక్కువ మొత్తాల్లో అయినా కొనుగోలు చేస్తుండటం గమనార్హం.