Business idea : యూఏఈలో కార్పొరేట్ జాబ్ ను వదిలేసి ఇండియాకు వచ్చి.. నెలకు ఈజీగా రెండు లక్షలు సంపాదిస్తున్న జంట.. ఎలాగో తెలుసా?
Business idea ; యూఏఈలో కార్పొరేట్ ఉద్యోగాలను వదిలి సొంతూరికి వచ్చి లక్షల్లో సంపాదిస్తున్నారు కేరళ దంపతులు. దేవకుమార్, శరణ్య ఇద్దరూ యూఏఈలో దాదాపు నాలుగేళ్లు గడిపారు. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల్లో ఉన్నత ఉద్యోగాలు చేశారు. చేతినిండా సంపాదించారు. విలాసవంతమైన జీవితం గడిపారు. కానీ ఏదో తెలియని వెలితి ఎప్పుడూ వెంటాడేది. కేరళ వెళ్లి సొంతంగా ఒక వ్యాపారం ప్రారంభించాలని బలంగా నిర్ణయించుకుంది ఆ జంట. కంపెనీ స్థాపించాలనే కోరిక అయితే ఉంది కానీ.. ఏ సంస్థ పెట్టాలి, ఏ రంగంలో ముందుకు వెళ్లాలి అనేది మాత్రం తెలియదు. వారికి తెలిసింది ఒక్కటే.. వారు ప్రారంభించబోయే వ్యాపారంలో సామాజిక బాధ్యత ఉండాలి.
ఆలోచించగా దేవకుమార్, శరణ్య దంపతులకు ఒక ఐడియా తట్టింది. కేరళలో స్థానికంగా విరివిగా దొరికే ఆకులనే తమ ముడి సరుకుగా మార్చుకున్నారు. అరెకనట్ అనే ఆకు పర్యావరణ అనుకూలమైనవి, బయోడిగ్రేడబుల్‌గా గుర్తించి వాటినే ప్లాస్టిక్‌కు, పేపర్‌కు ప్రత్యామ్నాయంగా వాడేలా తీర్చిదిద్దారు. అయితే పూర్తిగా అరెకనట్ ఆకులతో తొడుగులను తయారు చేయడం కష్టంగా మారడంతో.. కొద్ది మొత్తంలో కాగితం, కొద్ది మొత్తంలో ప్లాస్టిక్ కలిపారు. అదే కాంబినేషన్‌ను తమ బ్రాండ్ పేరుకు తీసుకుని పాప్లా గా నామకరణం చేశారు. 2018లో ప్రారంభమైన పాప్లా కంపెనీ.. ఇప్పుడు టేబుల్‌వేర్‌ల నుండి గ్రో బ్యాగ్‌ల వరకు అరెకనట్ ఆకుల తొడుగుల వరకు ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ప్రస్తుతం పాప్లా కంపెనీ నెలకు రూ. 2 లక్షల టర్నోవర్‌ని సాధిస్తోంది.
ఇద్దరు భార్యభర్తలతో ప్రారంభమైన పాప్లా.. ఇప్పుడు ఏడుగురికి ఉపాధి అందిస్తోంది. పాప్లా ఉత్పత్తులలో ఎక్కువగా ప్లేట్లు, గిన్నెలు, స్పూన్లు వంటి టేబుల్‌వేర్‌లు ఉంటాయి. 4 అంగుళాల నుండి 10 అంగుళాల వరకు ప్లేట్లు, లోతులేని మరియు లోతైన గిన్నెలు, స్పూన్లు వంటి వివిధ పరిమాణాలు ఆకారాల్లో టేబుల్‌వేర్‌లు అందిస్తోంది పాప్లా. కంపెనీ ప్రారంభించినప్పటి నుంచి వినియోగదారుల సూచనలు, సలహాలు స్వీకరిస్తూ అందుకు అనుగుణంగా తమ ఉత్పత్తుల్లో మార్పులు చేస్తూ వస్తోంది పాప్లా. తమ విజయానికి అదికూడా ఓ కారణమని దేవకుమార్, శరణ్య చెబుతున్నారు.