Today Gold Price : తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు తులం బంగారం ధర ఎంత ఉందంటే..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Today Gold Price : తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు తులం బంగారం ధర ఎంత ఉందంటే..!!

 Authored By ramu | The Telugu News | Updated on :17 May 2025,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Today Gold Price : తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు తులం బంగారం ధర ఎంత ఉందంటే..!!

Today Gold Price : దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. శుక్రవారం పది గ్రాముల బంగారం ధర రూ.96,230గా ఉండగా, శనివారం నాటికి అది రూ.270 పెరిగి రూ.96,500కు చేరుకుంది. అదే సమయంలో వెండి ధరలు మాత్రం తగ్గాయి. కిలో వెండి ధర శుక్రవారం రూ.97,850గా ఉండగా, శనివారం నాటికి రూ.60 తగ్గి రూ.97,790గా నమోదైంది. ఈ మార్పులు దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లోనూ కనిపిస్తున్నాయి.

Today Gold Price తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు తులం బంగారం ధర ఎంత ఉందంటే

Today Gold Price : తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు తులం బంగారం ధర ఎంత ఉందంటే..!!

Today Gold Price తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే..

ఈరోజు మే 17, 2025 న హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరు నగరాల్లో బంగారం ధర రూ.96,500గా ఉంది. వెండి ధర కూడా అన్ని నగరాల్లో రూ.97,790గా ఉంది. ఇవి ఉదయం మార్కెట్ ప్రారంభ సమయంలో ఉన్న ధరలు మాత్రమే కావున, వాటిలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఈ ధరలు స్పాట్ మార్కెట్, అంతర్జాతీయ ధరల ఆధారంగా మారుతుంటాయి.

ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం ఔన్స్ గోల్డ్ ధర $3,210గా ఉండగా, శనివారం నాటికి $7 తగ్గి $3,203కి చేరుకుంది. వెండి ధరలు కూడా స్థిరంగా ఉండగా, ఔన్స్ సిల్వర్ ధర ప్రస్తుతం $32.31గా ఉంది. ఈ మార్పులు అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధానాలు, డాలర్ స్థితిగతులు, ముడి చమురు ధరలతో పాటు అంతర్జాతీయ రాజకీయ పరిస్థితుల ప్రభావంతో చోటుచేసుకుంటున్నాయి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది