Varalakshmi Vratham : శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి.. పాటించాల్సిన నియమాలు..?
Varalakshmi Vratham : వరలక్ష్మి వ్రత పూజ విధానం ఆచరించడం వలన సకల శుభాలు కలుగును . ఇది సుమంగళీలు ఈ వ్రతము.దినిని ఆచరించడం వలన ముత్తైదు తనంను ప్రసాధిస్తుంది ఆ శ్రీమహలక్ష్మి దేవి . స్త్రీలు దిర్ఘకాలం సుంమంగళిగా ఉండాలని ఈ వ్రతంను చెస్తారు. ఈ వ్రతం వలన సిరి సంపదులు కలుగుతాయి . సంపదలు అంటే కేవలం ఒక్క డబ్బుమాత్తమే కాదు ఆయుర్ ఆరోగ్యాలు , బోగ బాగ్యాలు , కీర్తి ప్రతిష్టలు , సంతోషం , పశు సంపద , ధాన్య సంపద , జ్ఞాన సంపదలు ఇవ్వన్ని సంపదులే .విటన్నింటిన్నిఇస్తుంది ఆ తల్లి .శ్రావణ మాసం లో వరక్ష్మి పూజాను చెసుకునేవారి యొక్క కోరికలను కోంగుభంగారం చెస్తుంది ఆ మహలక్ష్మి దేవి అమ్మవారు . ఈ వ్రతం ఏంతోపవిత్రమైనది మరియు మంగళకరమైనది . ఈ వ్రతం వలన ఆ తల్లి యొక్క కృప కటాక్షాలు కలిగి ఐశ్వర్యం సిధ్ధిస్తుంది.
కోరిన వేంటనే వరాలను ఇస్తుంది కాబట్టి వరమమలక్ష్మి దేవి అంటారు . విజయంలో తోడు నిలుస్తుంది కాబట్టి విజయ లక్ష్మి దేవి అని. ధైర్యే సహసే లక్ష్మి అన్నారు పెధ్ధలు . మీరు ధైర్యంగా ఉండండి అని ధైర్యలక్ష్మిదేవిగిగా మనకు అండగా ఉంటుంది. ఈ వ్రతంను ఆచరించుట వలన అష్ట లక్ష్మి దేవతలు మన ఇంట్ట కోలువై ఉంటారు . పెదరికాని చోటే ఉండదు ఆ తల్లి దయ ఉంటే . ఈభూలోకంలో ఏ కష్టాలు లేకుండా ఉండాలంటే దైవ ఆరాధన త్పక చేయాలి . అప్పుడు ఆ దేవుళ్ళ కరుణా కటాక్ష్యాలు మనపై ఉంటాయి . పెదరికంతో బాదపడేవారు . భర్తఆయుష్ పెరగాలి వారి ఆరోగ్యం బాగుండాలని కోరుకునేవారు ఈ వ్రతమును తప్పనిసరిగా ఆచరించండి . అంతా శుభమే జరుగుతుంది . మరి ఈ వ్రతమును ఏలాచేయాలి . ఏ పూజా సామాగ్రి కావాలి అనేది తేలియజేయడం జరిగింది .
Varalakshmi Vratham : శ్రీ మహలక్ష్మి పూజా సామాగ్రి :
పసుపు , కుంకుమ ,వీడి పూలు , గంధం , పూల మాల , 30 వక్కలు , ఖర్రూరాలు , అగర్ వత్తులు ,30 లేదా 40 రూ/ చిల్లర పైసలు ,తేల్లని వస్త్రం , జాకేట్ ముక్క , మామిడి ఆకులు , ఐదు రకాల పండ్లు , మహ లక్ష్మి దేవి పూటో , కలశం , కోబ్బరి కాయలు , తేల్ల దారం లేదా పసుపు రాసిన కంకణం ,ఇంట్లోతయారు చేసిన నైవేధ్యాలు , బియ్యం , పంచామృతాలు , దీపపు కుందులు , ఒత్తులు , నెయ్యి .శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి దేవి వ్రతమును ఆచరించాలి . ఆ శుక్ర వారం నాడు విలు కుదరక పోతే తువాత వచ్చే శుక్రవారంలు శ్రావణ మాసం ముగియకముందే ఆ వ్రతమును ఆచరించాలి . ఈ వ్రతం భూలోకంలో ఏందు చేయబడులటకు కారణం పూర్తిగా వివరించడం జరిగింది .ఇప్పుడు ఈ కథ ను తెలుసుకుందాం . ఈ వరలక్ష్మిదేవి వ్రతమును కథ రూపంలో చేప్పడం జరుగుతుంది . వరలక్ష్మి దేవి వ్రతము ఆది దేవత అయిన శ్రీ మహ లక్ష్మి దేవి ఒక నాటి రాత్రి సమయంలో చారుమతి అనే ఒక స్త్రీ కి కలలో సాక్ష్యాత్కరించింది . సువాసినలందరూ చేసే ప్రాభవ వ్రతము `శ్రీ వరలక్ష్మీ నమస్తు వసుప్రదే ,సుప్రదే , శుక్రవారం నాడు జరుపుకునే వరలక్ష్మి వ్రతంతో ధన ,కనక ,వస్తు,వాహనాది , సమృద్దులకు మూలం . శ్రావణ శుక్రవార వ్రతంతో పాపాలు తొలిగి లక్ష్మి ప్రసన్నత కలుగుతుంది .
శ్లోకం : నమస్తేస్తు మహమాయే శ్రీ పీఠే సుర పూజితే !
శంకచక్ర గాధా హస్తే మహలక్ష్మి నమోస్తుతే !!
భావం : మహ మాయారూపిణి , శ్రీ పీఠ వాసిని, దేవతలు నిరంతరము సేవించే లోక మాత , శంక చక్ర, గదల్ని ధరించిన మహ లక్ష్మిదేవి అష్టై శ్వరాలన్ని కలుగజేసే అష్ట లక్ష్మిరూపాన్నే వరలక్ష్మి దేవి గా మనం ఆరాధిస్తాం .భక్తితో పూజించిన వారికి , కోల్చినవారికి కోంగు బంగారమై వరాలనిచ్చే వర మహలక్ష్మి .
వ్రత విధానం : ఈ వర్తమును ఆచరించేవారు శ్రావణ శుక్రవారంనాడు ప్రాత కాలంనే ( తేల్లవారు జామున) లేచి వాకిళ్ళు ఉడిచి పెడతో కళ్ళాపు చల్లి ముగులతో తిర్చిదిధ్ధాలి .వాకిళ్లలలో, గుమ్మం బయట ముగ్గులతో ఇల్లు కలకలాడితే ఆ గృహము ఆ అమ్మవారికి చాలా ఇష్టం కలుగుతుంది . ఇంటిని శుభ్రం చేసుకోవాలి . ఇంటిలోపూజ మందిరంలో లేదా హాల్ లో ఏవ్వరు తగలని చోట ఆ మండపాన్ని ఏర్పాటుచేసుకోవాలి .ఈ మండపం పైన బియ్యపు పిండితో ముగ్గు వేసి , కలశం ఏర్పాటు చేసుకోవాలి . అమ్మవారి పూటో లేదా రూపును తయారుచేసి రూపును తయారు చేసి అమర్చుకోవాలి .పూజా సామాగ్రి , తోరణాలు అక్షింతలు పసుపు గనపతిని ముందుగానే సిధ్ధం చేసి పెట్టుకోవాలి .
Varalakshmi Vratham : తోరం తయారు చేసుకోవడం :
ఒక తేల్లటి దారపు రీలును తిసుకొని ఆ దారంను ఐదు లేదా తొమ్మిది వరుసల పోగులని తిసుకొని దానికి పసుపు రాయాలి . ఆ దారంనకు ఐదు లేదా తొమ్మిది పూలను కట్టి ముడులు వేసి తోరణంను తయారుచేసుకోని పీఠం వద్ద ఉంచాలి .ఈ తోరం పై పసుపు , కుంకుమ , అక్షింతలు వేసి ,పూజించి పెట్టుకోవాలి. మొదలు పెట్టాలి .ఇవిధంగా తోరాలను సిధ్ధం చేసుకున్న తరువాత పూజకు సిద్ధం కావాలి .
Varalakshmi Vratham : గణపతి పూజ :
అదౌ నిర్విఘ్నేన వ్రత పరిసమాప్త్యర్థం గణపతి పూజ కరిష్యే …వక్రతుండ మహ కాయ కోటి సూర్య సమ ప్రభ నిర్వఘ్నం కురుమోదేవో సర్వ కార్యేషు సర్వదా !! అగచ్చ వరసిధ్ది వినాయక , అంబికా ప్రియనందన పూజగృహణ సముఖ నమస్తే గణ నాయక !! అని సుతిస్తూతు గణపతిపై అక్షింతలు చల్లాలి . యధాక్తి శాడోపచార పూజ చేయాలి .
ఓం సుముఖాయ నమ: , ఓం ఏక ధంత్తాయ నమ: , ఓం గజ కర్ణికాయ నమ: , ఓం కపిలాయ నమ: , ఓం లంబోదరాయ నమ: , ఓం వికటాయ నమ: , ఓం విగ్నరాజాయ నమ: , ఓం గణాధి పాయ నమ: , ఓం దూమకేతవే నమ: , ఓం వక్రతుండాయ నమ:, ఓం గణాధ్యక్షాయ నమ: , ఓం పాల చంద్రాయ నమ: , ఓం గజాననాయ నమ: , ఓంశుర్పకరణాయ నమ: , ఓం పేరంభాయ నమ: , ఓం స్కంద పూర్వాజయ నమ: , ఓం శ్రీ మహ గణాధిపతయే నమ: ,నానావిధ పరిమళపుత్ర పుష్పాణి సమర్పయామి అంటు స్వామిపై పుష్పాలు ఉంచాలి.ఓం శ్రీ మహ గణాధిపతాయే నమ: దూఫం అఫ్రూపయామి , ఓం శ్రీ గణాధిపతాయే నమ: దీపం దర్శయామి , స్వామివారి ముందు పండ్లు లేదా బెల్లం గాని నైవేధ్యంగాపెట్టాలి . రకరకాల పిండి వంటలు బెల్లంతో చేసిన అన్నం అంటే అమ్మవారికి ఏంతో ప్రితికరం .భర్గోదెవస్య ధీమహి ధియోయో న: ప్రచోధయత్ అని గాయత్రి మంత్రంను జపిస్తూ నిటిని నివేదనచేసి చూట్టూ జల్లుతూ…సత్యం తర్తేనా పరించామి , అమృతమస్తు, అమృత పస్తరణమసి ,ఓం ప్రాణామయ స్వాహ , ఓం అపాణాయ స్వాహ ,ఓం ఉదానాయ స్వాహ , ఓం సమనాయ స్వాహ ,ఓం బ్రహ్మేణే స్వాహ గుడ సహిత ఫల నివేదనంసమర్పయామి ,మధ్యే మధ్యే పానీయం సమర్పయామి ( నీటిని వదలాలి ).
ఓం శ్రీ మహ గణాధిపతయే నమ: తంబులం సమర్పణయామి …తాబులనాంతరం అచమనంసమర్పయామి,( కర్పూరం వేతిగించి నీరాజనం ఇవ్వాలి ) ఓం శ్రీ మహ గణాధిపతయే నమ: కర్పూరం నీరాజనం సమర్పయామి….నీరాజనాంతరం ఆచమనీయం సమర్పణయామి .అనేనా మాయా చరిత గణపతి అర్చననేన భగవత: సర్వాత్మక: శ్రీ గణపతిర్దేవాతా సుప్రిత సుప్రితసుపన్న వరదాభవత్ ! మమ యిష్టకామర్థ్యం సిధ్ధిరస్తు !! వినాయకునికి నమస్కరించి పూజచేసిన అక్షింతలు తల మీద వేసుకోవాలి .మహ గణపతి పూజను ముగించిన అనంతరం వరలక్ష్మి వ్రతంను ప్రారంభించాలి .
Varalakshmi Vratham : కలశపూజ :
కలశయ్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత : ,మూలేతత్ర స్థితో బ్రమ్మహ మధ్యే మాతృగణ : స్థిత: , కుక్షౌతుస్సాగరసస్సర్వే సప్త ద్వీప వసుంధరా , ఋగ్వేధ,యజుర్వేదో సామవేదో అధ్వరణ: , అంగైశ్చ సహిత సర్వేశ కలశాంబు సమాశ్రితా: . ఆయాంతు పూజార్థం దురితక్షయకారకా: గంగేచ యమునేచైవ గోదావరి , సరస్వతి ,నర్మదే , సింధూ ,కావేరి ,జలేస్మిన్ సన్నిధింకురు . అంటూ శ్లోకాన్ని చదివి కలశంలోకి నీటిని పుష్పంతో ముంచి భగవంతుడుపై , పూజ చేస్తున్నవారు తలపైన చల్లుకోవాలి .అధాంగ పూజ పువ్వులు లేదా అక్షింతలలో కలశానికి పూజ చేయాలి . కటిం పుజయామి , పద్మాలయయైనమ: ,నాభిం పూజయామి, మదనమాత్రేనమ: , స్తనౌ పూజయామి , కంబుకంఠ్యైనమ: ,కంఠంపూజయామి, సుముఖాయైనమ: ,ముఖపూజయామి , సునేత్రేయానమ: , నేత్రంపూజయామి,రమాయానమ:,కర్ణౌ పూజయామి ,కమలాయైనమ: , శిరం పూజయామి , శ్రీ వరలక్ష్యైమ్మనమ: ,సర్వాణ్యంగాని పూజయామి ,
( ఆ తరువాత పుష్పాలతో అమ్మవారికి అష్టోత్తర శతనామాలతో పూజించాలి )
Varalakshmi Vratham : వరలక్ష్మి అష్టోత్తర శతనామావళి :
ఓం ప్రకృత్యైనమ: , ఓం విరకృత్యైనమ: ,ఓం విద్యాయైనమ: , ఓం సర్వభూత హితప్రదాయై నమ: ,ఓం శ్రద్ధాయై నమ: , ఓం విభూత్యైనమ: , ఓం సురభ్యైనమ: , ఓం పరమాత్మికాయై నమ: , ఓం వాచ్యై నమ: , ఓం పద్మాలయాయై నమ: , ఓం శుచయే నమ: , ఓం స్వాహయై నమ: , ఓం స్వధాయై నమ:, ఓం సుధాయై నమ: , ఓం ధన్యాయై నమ: , ఓం హిరణ్మయై నమ: , ఓం లక్ష్మ్యై నమ: ,ఓం నిత్యపుష్టాయై నమ: , ఓం విభావార్యైనమ: , ఓం ఆదిత్యైనమ: , ఓం దిత్యైనమ: , ఓం దిప్తాయైనమ: , ఓం రామాయై నమ:, ఓం వసుధాయైనమ: , ఓం వసుధారిణై నమ: , ఓం కమలాయైనమ: , ఓం కాంతాయైనమ: , ఓం కామాక్ష్యై నమ: , ఓం క్రోధ సంభవాయైనమ:, ఓం అనుగ్రహ ప్రదాయైనమ: , ఓం బుద్ధ్యై నమ: , ఓం అనఘాయై నమ: , ఓం హరివల్లభాయైనమ: , ఓం అశోకాయైనమ:, ఓం అమృతాయైనమ: , ఓం దీపా యైనమ: , ఓం తుష్టయే నమ:, ఓం విష్టుపత్న్యై నమ: , ఓం లోక వినాశిన్యై నమ: , ఓం ధర్మనిలయాయై నమ:, ఓం కరుణాయై నమ: , ఓం లోకమాత్రే నమ: , ఓం పద్మప్రియయై నమ: , ఓం పద్మహస్తాయై నమ: , ఓం పద్మాక్ష్యై నమ: , ఓం పద్మ సుందర్యై నమ: , ఓం పద్మాద్భవాయై నమ: , ఓం పద్మాముఖియై నమ: , ఓం పద్మనాభప్రియై నమ: , రామాయై నమ:,ఓం పద్మ మాలాధరయై నమ: , ఓం దేవ్యై నమ: , ఓం పద్మిన్యై నమ: , ఓం పద్మ గంధిన్యై నమ: , ఓం పుణ్య గంధాయై నమ: ,ఓం సుప్రసన్నాయై నమ: ,ఓం ప్రసాదాభిముఖీయై నమ: , ఓం ప్రభాయై నమ: , ఓం చంద్ర వదానాయై నమ: , ఓం చంద్రాయై నమ: , ఓం చంద్రసహోదర్యై నమ: , ఓం చతుర్భుజాయై నమ: , ఓం చంద్రరూపాయై మ: , ఓం ఇందిరాయై నమ: ,ఓం ఇందుశీతలాయై నమ: , ఓం ఆహ్లదజనన్యై నమ: , ఓం పుష్ట్యె నమ: , ఓం శివాయై నమ:, ఓం శివకార్యై నమై: , ఓం సత్యై నమ: , ఓం విమలాయై నమ: , ఓం విశ్వజనన్యై నమ: , ఓం దారిద్ర నాశిన్యై నమ: , ఓం ప్రితి పుష్కరిణ్యై నమ: , ఓం శాంతన్యై నమ: , ఓం శుక్లమాలాంబరాయై నమ: , ఓం శ్రీయై నమ: , ఓం భాస్కర్యై నమ: , ఓం బిల్వ నిలయాయై నమ:, ఓం వరాహయై నమ: ,ఓం యశస్విన్యై నమ: , ఓం వసుంధరాయై నమ: ,ఓం ఉదారంగాయై నమ:, ఓం హరిణ్యైయై నమ: , ఓం హేమమాలిన్యై నమ: , ఓం ధనధాన్య కార్యైనమ: , ఓం సిద్ధ్యై నమ: ,ఓం త్రైణ సౌమ్యా యై నమ: , ఓం శుభప్రదాయై నమ: , ఓం నృపవేశగతానందాయై నమ:, ఓం వరలక్ష్మ్యై నమ: , ఓం వసుప్రదాయై నమ: , ఓం శుభాయైనమ: , ఓం హిరణ్యప్రాకారాయై నమ: , ఓం సముద్రతననాయై నమ:, ఓం జయయైనమ:, ఓం మంగళాదేవ్యై మ: , ఓం విష్టు వక్షస్థల సిథాయైనమ:, ఓం ప్రసన్నాక్ష్యై నమ:, ఓం నారాయణసిమాశ్రితాయై నమ:, ఓం దారిద్ర ధ్వంసిన్యై నమ: , ఓం సర్వోపద్రవ వారిణ్యై నమ: , ఓం నవ దుర్గాయై నమ: , ఓం మహకాళ్యై నమ: , ఓం బ్రహ్మ విష్టు శివాత్మికాయై నమ: , ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమ: ,ఓం భువనేశ్వర్యై నమ: ,
Varalakshmi Vratham : తోర పూజ :
తోరణాన్ని అమ్మవారి వద్ధ ఉంచి అక్షింతలతో ఈ విధంగా పూజించాలి . కమలాయైనమ: ప‌్రథమం గ్రంథి పూజయామి , రమయానమ: ద్వితియం గ్రంథి పూజయామి , లోకమాత్రేనమ: తృతియ గ్రంథి పూజయామి ,విశ్వజనన్యైనమ: చతుర్ధ గ్రంథి పూజయామి , మహలక్ష్మ్యైనమ: పంచ గ్రంథి పూజయామి , క్షీరాభితనయాయైమ: షష్ఠిమ గ్రంథి పూజయామి , విశ్వసాక్షిణ్యై నమ: గ్రంథి పూజయామి , చంద్రచోదర్యైనమ: అష్టమ గ్రంథి పూజయామి, శ్రీ వరలక్ష్మి యై నమ: నవమ గ్రంథి పూజయామి , ఈ క్రింది శ్లోకాలు చదువుతూ తోరణం కట్టుకోవాలి .
బద్నామి దక్షేణేహస్తే నవసూత్రం శుభప్రదం !
పుత్రపౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహిమే రమే !!
వరలక్ష్మి వ్రత కథ ప్రారంభం :
ఒక నాడు పరమేశ్వరుడు కైలాస గిరియందు సకల మునిగణ సంసేతుడైయున్న సమయంబున పార్వతి దేవి వినయంబుగా ,” ప్రాణేశ్వర ! స్త్రీలు సకలైవ్వర్యములు కలిగియుండుటకు ఆచరించదగిన వ్రతమేదియో సెలవియూ ” డని కోరెను . అంతట , పర్మేశ్వరుడు ” దేవి ! వరలక్ష్మీ వరమనునది స్త్రీలకు సౌభాగ్యమొసగును . దానిని శ్రావణ మాసమందు పౌర్ణమికు ముందు వచ్చు శుక్ల పక్ష శుక్రవారం నాడు చేయవలేను అనెను . అది విని యామే ,స్వామి ! ఆవ్రతం ఎలా ఆచరించవలేనో సెలవీష య వేడెను .,, ” ఆ వ్రతమును మునుపు ఎవ్వరు ఆచరించి తరించారో తెలుపగోరెద ష ననెను. అంతట సరమ్మేశ్వరుడు “ఓ పడతీ ! ఆ వ్రత కథను చెప్పెదను వినుము ” అని కథ చెప్పెను .పూర్వము మగధ రాజ్యమున కుండిన నగరమను నోక పురము గలదు . అది బహు సుందరమైన పట్టణం . అందు చారుమతి యను ఒక స్వాధి ఉంది .
ఆమే సద్గుణములకు మెచ్చి ఆది లక్ష్మి ఆమే స్వప్నమున ప్రత్యక్షమై ఆమెతో, “చారుమతి ! నీ సద్గునములకు నేను మెచ్చితిని . నీకు కావాలయు వరములనోసగు తలంపు నాకు కలిగెను .కావున నీవు శ్రావణ పౌర్ణమి ముందు వచ్చు శుక్రవారమునాడు వరలక్ష్మి వ్రతము చేయుము .అప్పుడు నువ్వు కోరిన కోర్కెలను దీర్చెద .” నని చెప్పి మాయమయ్యను . వేంటనే ఆమె మేల్గాంచి, తన స్వప్న వృతాంతము తన భర్తకు నివేదింప్ప నతడునూ మిగల సంతోషించి ఆమెనా వ్రతము ఆచరించుటకు ప్రోత్సహించెను . ఆ స్వప్న వృతాంతమును తెలిసిన ఆ పట్టణ స్త్రీలు శ్రావణ మాసంకోరకు ఎదురు చూచుండిరి . అంతలో శ్రావణ మాసం వచ్చెను . అంతట చారు మతి వారందరితో కలసి నీర్ణిత దినమున స్నానాదులను ఆచరించి , ఒక చోట ఆవు పెడతో అలికి, బీయ్యముతో మంటపమేర్పరచి మర్రి చిగుళ్ళు మొదలగు పంచ పలవులతో కలశంబేర్పరచి , అందు వరలక్ష్మిదేవిని ఆవామనంచేసి , సాయంత్రమైనంత నధిక భక్తితో .
లక్ష్మిం క్షీరసముద్రరాజతనయాం శ్రీ రంగథామేశ్వరీం !
దాసీ భూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం!!
శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవ: బ‌్రహ్మేంద్ర గంగాధారం !
తాంత్రిలోక్య కుటుంబినీం సరసీజాం వందేముకుందప్రియాం!!
Varalakshmi Vratham : అని స్తుతించి , తోమ్మిది రంగులుగల తోరణము కుడిచేతికికట్టుకోని , యధాశక్తిని లక్ష్మిదేవికి ఫలభక్ష్య పానియ పాయసాదులు నైవేద్యంముగా సమర్పించి , ప్రదక్షణ మొనర్చెను .అట్లు వారు ప్రదక్షణ చేయుచుండగా ఘల్లు ఘల్లు మని ధ్వని వినిపించుటచే వారు క్రిందికి చూడగా వాళ్ళ కాళ్ళకు గజ్జెలు , అందెలు మున్నగు ఆభరణములు కనిపించేను .
కాని భక్తి తప్పక వారు రెండోవ సారి ప్రదక్షనము చేయగా వారి హస్తములు నవరత్న కచిత కంకణ సుందరములయ్యెను . మూడోవ ప్రదక్షణ చేసిన వెంటనే వారి ఇండ్లు సకల సంపత్సమృద్ధము లయ్యైను .పీమ్మట చారుమతి వర్రతము చేయించిన బ్రాహ్మణులకు యాధావిధిగా యాధాశక్తిని దక్షిణ తాంబులాదుల నోసంగి సంతుష్ఠిని చేసి పంపి , వ్రత ప్రసాదములను బందుమిత్రాదులకు పెట్టి , తానునూ భుజించి ,సుఖముగా నుండెను . ఆమె లోకోపకారముగా నిట్టి వ్రతమును జయించినందులకు ఊరిలోని వారందరు ఆమెను వేనోళ్ళ బోగడిరి .నాటినుండి స్త్రీలందరూ ఆ వ్రతమును ప్రతి సంవత్సరమూ చేయుచుండిరి . ఆ వ్రతము అన్ని వర్ణముల వారునూ జేయవచ్చును . ఆ వ్రతాచరనము వలన వరలక్ష్మి ప్రసాదము కలిగి సకల కార్యములందునూ విజయము చేకూరును .