Karthika Masam : కార్తీక మాస శివకేశవుల కథ..పార్ట్ 2 !
ప్రధానాంశాలు:
Karthika Masam : కార్తీక మాస శివకేశవుల కథ..పార్ట్ 2 !
Karthika Masam : సనాతన ధర్మంలో తిధులు ప్రకారము వచ్చే పండుగలు ఒకటి ,మూడు ,ఐదు రోజుల డ్యూరేషన్ లో జరుపుకుంటాము. కాని కార్తీకమాసం ఒక్కటే ఆ నెల మొత్తం పండగలా ఉంటుంది. ఈ కార్తీకమాసం శివకేశవుడు ఇద్దరికీ ప్రీతికరమైన మాసం అంటారు. కార్తీక మాసంలో చేసే పనులు, పూజలు అన్నిటికి కొన్ని సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం..
ఒకటవ పార్ట్ లో మనం శ్రీకృష్ణ లీల గురించి తెలుసుకోవడం జరిగింది. కృష్ణుడు తన తల్లికి దొరక్కుండా ఎన్నో అల్లరి చేష్టలు చేస్తూ ఉంటారు. ఈరోజు రెండవ పార్ట్ లో తన తల్లికి శ్రీకృష్ణుడు దొరుకుతాడు..
కానీ ఇక్కడి నుంచి ఆవిడ అవస్థలు మొదలయ్యాయి. కృష్ణుని పారిపోకుండా ఒక చేత్తో పట్టుకొని మరో చేత్తో తాడును ముడి వేయాలి. ఇలా ఒక చేత్తో పిల్లలను పట్టుకొని రెండో చేత్తో ఇంటి పనులు చేయడం అనే సంఘటన పిల్లలు అల్లరి ఎక్స్పీరియన్స్ చేసిన తల్లిదండ్రులు ఈజీగా డిలీట్ చేసుకోగలరు. మొత్తానికి తాడుకున్న ఒక అంచును కృష్ణుడి నడుముకు కట్టడం మొదలు పెట్టింది. కానీ ఆ తాడు రెండు అంగుళాలు తక్కువయింది. మరో తాడు తీసుకొని దానికి జోడించి మరోసారి కృష్ణుడికి కడితే అక్కడ ఉన్న తాళ్లన్నీ కలిపి కట్టిన రెండు అంగుళాలు తక్కువ అవుతూనే ఉంది. యశోదమ్మకి ఆశ్చర్యం కలిగింది. ఇదెలా సాధ్యం అని ఆలోచనలో పడింది. ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఎటువంటి ప్రయోజనం లేకపోగా అలసిపోయింది. అది చూసి అమ్మని ఆటపట్టించింది చాల్లే అని చిన్నికృష్ణుడు అనుకోని యశోదమ్మ చేతుల్లో కట్టడి అవ్వడానికి సిద్ధపడ్డాడు. ఆ తరువాత ఆ తల్లి తాడుకున్న రెండో అంచుని రోలుకి కట్టింది.
లక్ష్మీదేవి తపస్సు చేసే ఋషులు మహర్షులు అమృతం తాగిన దేవతలు ఎదిరించిన అసురులు ఇలా ప్రపంచంలో ఎవ్వరికి సాధ్యం కాని అంటే కృష్ణుడు కట్టడి చేయడం ఒక సాధారణ స్త్రీ తల్లిగా ఉండి చేయగలిగింది. అది కూడా కృష్ణుడి అంగీకారం ఉంది కాబట్టి సాధ్యపడింది. తాడుని సంస్కృతంలో దాము అంటారు. నడుముకి మరో పేరు ఉదరం ఒక తాడుతో కట్టడి అవ్వడానికి ఒప్పుకున్నాడు. కాబట్టి దామోదర అనే పేరుతో పిలవబడ్డాడు. ఈ కృష్ణ లీల అంతటికి ఆ రెండు అంగుళాల తాడు నేర్పిస్తుంది. కృష్ణుడిని కట్టడి చేయగలను అని యశోదమ్మ అనుకుంటే నేను కట్టుబడటానికి సిద్ధంగా లేను అని కృష్ణుడు చూపించాడు. భక్తిలో రెండు అంశాలు ఉంటాయి. ప్రయత్నం అనుగ్రహం మొదటిది ప్రయత్నం చేయగలను అనే ఆలోచన భక్తుడికి పూజించే భగవంతుణ్ణి భక్తితో అర్థం. చేసుకోగలను చేరగాలని తాను చేసే ప్రయత్నం రెండోది అనుగ్రహం కృష్ణుడు కట్టుబడటానికి సిద్ధమయ్యాడు. కాబట్టే యశోదమ్మ అతన్ని తాడుతో కట్టగలిగింది. భగవంతుడి అనుగ్రహం ఉంటేనే భక్తుడి ప్రయత్నం అవుతుంది. ఈ రెండు మాటలు ఆ రెండు అంగుళాలు తాడు ద్వారా కృష్ణుడు చెప్పాలనుకున్నాడు. కాబట్టి కృష్ణుడికి కార్తీక మాసం ప్రీతికరమైన మాసం అయింది.
అందుకే ఈ మాసంలో అతనికి దగ్గర అవడం కోసం భక్తులు దామోదర పూజలు చేస్తారు. సైంటిఫిక్ గా చూసుకుంటే స్నానం, దీపాలు పెట్టడం ఈ రెండు చాలా అవసరం. చలికాలంలో వేడి తగ్గుతుంది. కాబట్టి మనిషి ఆరోగ్యం క్షేనించడం మొదలవుతుంది. స్నానం చేయడం ఒంటికి మనసుకు మంచిదని ఎందరో రికమంత్ చేయడం చూస్తున్నాను అదే ఉద్దేశంతో పూర్వకాలం నుంచి కార్తీక మాసంలో సూర్యోదయం కాకముందే చన్నీళ్లతో స్నానం చేయడం ఆచారాల్లో భాగమయ్యింది. దీపాలను వెలిగించడం తులసి మొక్క దగ్గర దీపాలు వెలిగించి పెడతారు. ఇది కూడా తగ్గిన వెలుగుని పెంచే ప్రయత్నమే.. దీపావళి పండుగ సందర్భంగా వెలిగించే దీపాలతో ఈ ప్రాసెస్ మొదలవుతుంది. కేవలం ఇల్లు మాత్రమే కాదు. గుడిలో ధ్వజస్తం చుట్టూరా కూడా దీపాలు వెలిగిస్తారు. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున ఇంటిని దీపాలతో అలంకరించిన కాలుస్తారు ఇదంతా ఆకాశదీపం అనే ప్రక్రియ అంటారు. నది స్నానం ఇది కూడా ముందు చెప్పిన చన్నీటి స్నానం బెనిఫిట్స్ కి సిమిలర్గా ఉంటాయి. ఉపవాసాలు.. ఉపవాసం చేయడం వల్ల శరీరానికి రోగనిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది.
ఆకలి పెంచే ఇన్సులిన్ లెవెల్ తగ్గుతుంది. దాని వల్ల ఒంట్లో ఉన్న కొవ్వు తగ్గుతుంది. బాడీ సెల్ల్స్ రిపేర్ అవ్వడంతో శరీరంలో ఉన్న వేస్ట్ మెటీరియల్ ని ఈజీగా బయటపరుస్తుంది. ఇలా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అందుకే ఈ రోజుల్లో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనే కాన్సెప్ట్ బాగా పాపులర్ అయింది. యజుర్వేదం కర్మకాండ విభాగంలో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనుకుంటారు. కాకపోతే ఆ ఈవెంట్లో మనకు తెలియకుండా జరిగే మంచిని అర్థం చేసుకోండి. చన్నీటి స్నానం, ఉపవాసం, వ్రతాలు ఇలాంటి కఠోరమైన ఆచారాల మధ్య ఒక ఫన్ ఆక్టివిటీల మనసుని ఉత్తేజపరుస్తుంది..