Balakrishna : బాలయ్య కీ మోక్షజ్ఞ కీ మధ్య పెద్ద గొడవ ? బాలయ్య పిచ్చ సీరియస్ ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Balakrishna : బాలయ్య కీ మోక్షజ్ఞ కీ మధ్య పెద్ద గొడవ ? బాలయ్య పిచ్చ సీరియస్ ?

 Authored By aruna | The Telugu News | Updated on :14 July 2023,10:00 am

Balakrishna : నటసింహం బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎప్పటి నుంచో బాలయ్య అభిమానులు మోక్షజ్ఞ హీరో కావాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. నందమూరి ఫ్యామిలీ లో జూనియర్ ఎన్టీఆర్ 17 ఏళ్లకే హీరోగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాడు. అతి తక్కువ టైంలోనే మాస్ హీరోగా మంచి ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. కళ్యాణ్ రామ్, తారక రత్న కూడా 20 ఏళ్లకి ఎంట్రీ ఇచ్చారు కానీ మోక్షజ్ఞ మాత్రం ఇప్పటి వరకు ఇండస్ట్రీలో అడుగుపెట్టలేదు. ప్రస్తుతం మోక్షజ్ఞ వయసు 28 ఏళ్లు. ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. గత ఐదేళ్లుగా బాలయ్య అభిమానులు బాగా ఒత్తిడి చేస్తున్నారు.

మోక్షజ్ఞ హీరో చేయాలంటూ గట్టిగ డిమాండ్ చేస్తున్నారు. మోక్షజ్ఞ హీరో అవ్వాలని బర్త్డే వేడుకలు ఎంతో గ్రాండ్గా నిర్వహిస్తున్నారు. ఇక ప్రతి ఏడాది మోక్షజ్ఞ ఎంట్రీ పై బాలయ్య ప్రకటన చేస్తూ వస్తున్నారు. కానీ ఇంతవరకి మోక్షజ్ఞ సినిమా రాలేదు. దీంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా దీనిపై బాలయ్య స్పందించారు. ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. ఈ సబ్జెక్టుతో మోక్షజ్ఞ లాంచ్ బాగుంటుందని భావిస్తున్నాము. ఆదిత్య 999లో మోక్షజ్ఞ నటిస్తాడని వెల్లడించారు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది ఎన్నికల తర్వాత ఉంటుందన్నారు. దీంతో ఈసారైనా బాలయ్యను నమ్మొచ్చా అని ఫ్యాన్స్ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

Balakrishna serious on his son Mokshajna

Balakrishna serious on his son Mokshajna

కాగా మోక్షజ్ఞ ఇటీవల స్లిమ్ అయ్యారు. బరువు తగ్గి హ్యాండ్సమ్ లుక్ లో కనిపించారు. ఇది సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ప్రిపరేషన్ లో భాగమే అంటున్నారు. గతంలో నటుడు కావడం మోక్షజ్ఞకు ఇష్టం లేదు. అందుకే బాలయ్య బ్రతిమిలాడినా ఒప్పుకోవడం లేదంటూ ప్రచారం జరిగింది. మరోవైపు బాలకృష్ణ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ భగవంత్ కేసరి ‘ సినిమా చేస్తున్నారు. ఇది దసరా కానుకగా విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత దర్శకుడు బాబీతో ప్రకటించిన 109వ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది