Brahma Mudi 31 July Today Episode : కళ్యాణ్‌ను మెచ్చుకున్న ఫ్యామిలీ.. ఇల్లు అమ్మేందుకు సిద్ధమైన కృష్ణమూర్తి.. ఈ విషయం తెలిసి కావ్య ఏం చేస్తుంది?
Brahma Mudi 31 July Today Episode : బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 31 జులై 2023, సోమవారం ఎపిసోడ్ 162 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆరు నెలల్లో పది లక్షలు కట్టాల్సిందే అంటారు పెద్దమనుషులు. అలాగే.. వడ్డీ 50 వేలు రెండు రోజుల్లో కట్టకపోతే నన్ను కిడ్నాప్ చేసి సీసీటీవీ ఫుటేజ్ పట్టుకొని పోలీస్ స్టేషన్ కు వెళ్తాను అని చంపక్ లాల్ బెదిరిస్తాడు. పెద్దమనుషులు కూడా అంతే అని చెప్పి ఎంత చెప్పినా వినకుండా వెళ్లిపోతారు. దీంతో కనకం, కృష్ణమూర్తికి ఏం చేయాలో అర్థం కాదు. రెండు రోజుల్లో 50 వేలు ఎక్కడ తేవాలి.. ఎలా కట్టాలి అని టెన్షన్ పడుతూ ఉంటారు.
కట్ చేస్తే.. మేడమ్ కోరియర్ అని దుగ్గిరాల ఫ్యామిలీ ఇంటికి కోరియర్ బాయ్ వస్తాడు. మళ్లీ ఆర్డర్ ఇచ్చావా అని స్వప్న వైపు అందరూ చూస్తారు కానీ.. కాదు అంటుంది. ఇంతలో కావ్య ఉండి.. మీరు వెళ్లి తీసుకురండి కవి గారు అంటుంది. ఆయన వెళ్లి దాన్ని తీసుకొని వస్తాడు. దాన్ను నువ్వే తీసుకురా అని అంటుంది కావ్య. దీంతో అదేదో వీక్లిలా ఉంది అంటాడు. మీరే చదవండి అంటుంది. దీంతో దాన్ని ఓపెన్ చేసి చూస్తే ఆయన రాసిన కవిత ఉంటుంది. దాన్ని చూసి షాక్ అవుతాడు. వెంటనే కావ్య దగ్గరికి వెళ్లి కన్నీళ్లు కారుస్తాడు. దీంతో ఏమైంది అని అందరూ అడుగుతారు. దీంతో ఆగండి.. కొద్ది క్షణాలు కవి గారు మాట్లాడలేరు. అది దు:ఖం కాదు. ఆనంద బాష్పాలు అంటుంది కావ్య. దీంతో ఎందుకు ఏమైంది అమ్మ అంటే.. వదిన నా కవితను ప్రింట్ చేయించారు తాతయ్య అంటాడు కళ్యాణ్. చూడండి.. నా ఫోటోతో సహా వేశారు అంటాడు కళ్యాణ్. అందరూ ఆ కవితను చూస్తారు. ఇంత సంతోషం నా లైఫ్ లో ఎప్పుడూ ఎక్స్ పీరియెన్స్ చేయలేదు. థాంక్స్ వదిన అంటాడు కళ్యాణ్.
Brahma Mudi 31 July Today Episode : తన కవిత అచ్చయిందని అప్పుకు చెప్పిన కళ్యాణ్
దీంతో కవి గారు అది మీ కవిత గొప్పదనం. మీరు మంచి భాష వాడారు. అది మీ కవిత గొప్పదనం అంటుంది కావ్య. అందరూ తనకు కంగ్రాట్స్ చెబుతారు. ఇంత వరకు ఈ ఇంట్లో నా కవితను ఎవ్వరూ వినలేదు. కనీసం పట్టించుకోలేదు. అలాంటిది మీరు గుర్తించారు. ఇలా ప్రింట్ వేయించారు అంటాడు కళ్యాణ్. మొదటి సారి మీషాపునకు వచ్చినప్పుడు మీరు కూడా నాలోని కళను గుర్తించారు కదా. అలాగే మీలోని భావావేశాన్ని గుర్తించాను. ఇంత చిన్నదానికే నేనేదో ఎంత పెద్ద హెల్ప్ చేసినట్టు మాట్లాడుతున్నారు అంటుంది కావ్య.
దీంతో ఇది చిన్న విషయం కాదు కావ్య అంటుంది కళ్యాణ్ తల్లి. ఇవాళ వాడి గురించి పది మందికి తెలిసేలా చేశావు అంటుంది. నా కొడుకు కవిత్వం మొదలు పెడితే అంతా పారిపోతారా.. ఇప్పుడేమంటారు అంటాడు కళ్యాణ్ తండ్రి. పేరు, అడ్రస్, ఫోటోతో పాటు వేశారు. ఇప్పుడు ఈ కవితను ఎంత మంది చదువుతున్నారో అని అనుకుంటాడు కళ్యాణ్. మరోవైపు ఓ అమ్మాయి కళ్యాణ్ కవితను చదువుతూ ఉంటుంది. ఎన్నిసార్లు చదివినా చదవాలనే అనిపిస్తోంది అని అనుకుంటుంది. ఆ కవిత మొత్తం చదువుతుంది.
మరోవైపు అప్పు దగ్గరికి వస్తాడు కళ్యాణ్. మ్యాగజైన్ లో ప్రచురితమైన తన కవితను చూపిస్తాడు. అదేంది నీ ఫోటో వేశారు. ఏదైనా కేసులో ఇరుక్కున్నావా ఏంది అని అడుగుతుంది. నేను రాసిన కవితను మెచ్చుకుంటూ నా కవితతో పాటు నా ఫోటో కూడా వేశారు అంటాడు. దీంతో నిజం చెప్పు ఈ ఫోటో వేయడానికి ఎంతిచ్చినవు. మస్తు పైసలు ఇచ్చినవు కదా అంటుంది. దీంతో నీకు, నా వదినకు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అంటాడు. ఎంతో కష్టపడి కవిత రాస్తే ఇలా మాట్లాడుతావా అంటాడు కళ్యాణ్. ఇంతకీ ఏం రాసినవు అని అడుగుతుంది అప్పు. దీంతో అక్కడ ఉంది కదా చదువుకో అంటాడు కళ్యాణ్. దీంతో నువ్వే చదువు అంటుంది. దీంతో ఆ కవిత మొత్తం చదివి వినిపిస్తాడు.
ఈ కవితలో ఏముందిరా బై నీకు ఫోటో వేసి దండం పెట్టడానికి. ఒక్క ముక్క అర్థం అయితే ఒట్టు అంటుంది. దీంతో నీకు అర్థం కాదులే అంటాడు. ఇంతలో ఓ యువతి వచ్చి బుక్ లో పబ్లిష్ అయిన ఆ కవిత మీదేనా. ఏమన్నా రాశారా. ఈ మధ్య కాలంలో అలాంటి కవితను నేను చూడలేదు. ఒక్క ఆటోగ్రాఫ్ ఇస్తారా అని అడుగుతుంది యువతి. నేను పెద్ద రైటర్ ను కాదు అంటాడు. దీంతో ఫ్యూచర్ లో మీరు తప్పకుండా పెద్ద రైటర్ అవుతారు అంటుంది. దీంతో తన బుక్ మీద ఆటోగ్రాఫ్ రాసి ఇస్తాడు. సార్.. నన్ను గుర్తుపెట్టుకోండి. నా పేరు శ్రీ అని చెప్పి ఆ యువతి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
ఆ పోరికి ఎంతిచ్చినవ్ అని అడుగుతుంది అప్పు. దీంతో కళ్యాణ్ షాక్ అవుతాడు. మరోవైపు కావ్య బెడ్ వేస్తూ ఉంటుంది. ఇంతలో రాజ్ వస్తాడు. అనండి అంటుంది. దీంతో ఏంటది అంటాడు రాజ్. మీరు ఏదో ఒకటి అంటారు కదా అంటుంది. నేను అనడానికి రాలేదు అంటాడు. చెప్పడానికి వచ్చాను అంటాడు రాజ్. దీంతో చెప్పండి చెప్పండి అంటుంది కావ్య. దీంతో థాంక్స్ అంటాడు రాజ్. రాజ్ థాంక్స్ చెప్పేసరికి అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది కావ్య. మీరు ఇప్పుడు ఏమన్నారు అని అడుగుతుంది. నువ్వు ఏం విన్నావు అని అంటాడు. నువ్వు విన్నదే అన్నాను అంటాడు రాజ్. కళ్యాణ్ కవితను అచ్చేయించినందుకు థాంక్స్ చెప్పాను అంటాడు రాజ్. దీంతో వద్దండి.. మీ థాంక్స్ నాకేం అవసరం లేదు. మీరే ఉంచుకోండి అంటుంది కావ్య.
రేపు నువ్వు నాతో కలిసి ఆఫీసుకు రావాలి అంటాడు రాజ్. ఎందుకు అంటే.. చెప్తే కానీ రావా అంటే ఇంట్లో ఏ కారణం చెప్పి రావాలి అంటుంది కావ్య. దీంతో తల మీద ఒక మొట్టికాయ వేసి చెప్పేది విను అంటాడు రాజ్. రేపు ఒక క్లయింట్ వస్తున్నారు. మిడిల్ క్లాస్ వాళ్లను టార్గెట్ చేస్తూ జ్యూయెలరీ డిజైన్ చేయాలనుకుంటున్నారు. అందుకే నిన్ను పిలుస్తున్నా అంటాడు రాజ్. దీంతో ఇక్కడ మిడిల్ క్లాస్ వాళ్లు ఎవరు ఉన్నారు అంటే.. నేను మిడిల్ క్లాస్ కాదు. మా ఆయన చాలా రిచ్ అంటుంది. ఎప్పుడు వెళ్లాలి అంటే.. 8 కల్లా వెళ్లాలి అంటాడు.
మరోవైపు కృష్ణమూర్తి, కనకం ఇద్దరూ ఎలా అప్పు కట్టాలి అని అనుకుంటారు. మరి ఏం చేద్దాం అని కనకం అడుగుతుంది. దీంతో ఇల్లు అమ్మేద్దాం అనుకుంటున్నా అంటాడు. దీంతో అలా అనకు అయ్యా.. పిల్లల భవిష్యత్తు కోసం ఇల్లు అమ్మే ఆలోచనే ఉంటే క్షణం కూడా ఆలోచించకుండా ఇల్లు అమ్మేయ్ అనేదాన్ని కానీ.. నేను తొందరపడి చేసిన తప్పు వల్ల ఈ ఇల్లు అమ్మేస్తే అది నన్న జీవితాంతం వెంటాడుతుంది అంటుంది కనకం. ఇవన్నీ అప్పు చాటుగా వింటుంది. తప్పు నీది మాత్రమే కాదు కనకం అంటాడు కృష్ణమూర్తి. నాది కూడా అంటాడు. నీకు మంచి చెడులు చెబుతున్నా అనుకున్నా కానీ.. అది నువ్వు వింటున్నావా లేదా అని తెలుసుకోలేకపోయాను. ఇంటి విషయాలు నువ్వు చూసుకుంటున్నావని పూర్తిగా వదిలేశాను అంటాడు. నా మీద మీరు పెట్టుకున్న నమ్మకం నిలబెట్టుకోలేకపోయాను. మీకు నా మీద కోపం లేదా అంటుంది కనకం. కోపం ఉంటే అప్పులు తీరుతాయా అంటాడు. దీంతో ఈ ఇల్లు అమ్మాల్సిందేనా అంటుంది కనకం. ఈ విషయం వెంటనే కళ్యాణ్ కి చెబుతుంది అప్పు. వెంటనే కళ్యాణ్ వెళ్లి మీ ఇంట్లో పరిస్థితి ఏం బాగోలేదు. అర్జెంట్ గా 50 వేలు కట్టాలి అని కావ్యతో చెబుతాడు. దీంతో కావ్య షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.