Deepika Pilli : వీధుల్లో డ్యాన్స్‌లు చేస్తూ తెగ సందడి చేస్తున్న రష్మీ గౌతమ్, దీపికా పిల్లి
Deepika pilli : టిక్ టాక్ నుండి వచ్చి మంచి క్రేజ్ సంపాదించుకున్న అందాల యాంకరమ్మలలో దీపికా పిల్లి కూడా ఒకరు. ఎవర్నీ ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదనే దానికి దీపిక పిల్లి నిదర్శనం. ఎందుకంటే అమ్మడు టిక్ టాక్ నుంచి ఫేమస్ అయి ఇప్పుడు యాంకర్ అయిపోయింది. సోషల్ మీడియా సెన్సేషన్ గా మొదలైన దీపికా పిల్లి ప్రయాణం కొనసాగుతుంది. ఆమె రోజురోజుకు తన ఫాలోయింగ్ పెంచేసుకుంటుంది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ యూత్ కలల రాణిగా అవతరిస్తుంది.
దీపికా తాజాగా షాపింగ్ చేస్తూ రచ్చ చేస్తుంది. దీపికాతో పాటు రష్మీ గౌతమ్ కూడా ఉంది. వీరిద్దరు వీధుల్లో డ్యాన్స్‌లు చేస్తూ రచ్చ చేస్తున్నారు.దీపికా పిల్లి ఏ ఫొటో షేర్ చేసిన కూడా కొద్ది నిమిషాలలోనే వైరల్ అవుతుంటుంది. గార్జియస్, సూపర్, అతిలోక సుందరి అంటూ… హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక లక్షల్లో దీపిక పిల్లి ఫొటోలకు లైక్స్ కొడుతుండగా, క్షణాల్లో వైరల్ కావడం జరిగింది. అనతి కాలంలోనే మంచి పాపులారిటీ తెచ్చుకున్న దీపికా పిల్లిని ఇంస్టాగ్రామ్ లో రెండు మిలియన్స్ వరకు ఫాలో కావడం విశేషం. ఒకప్పటి సోషల్ మీడియా సంచలనం దీపిక పిల్లి, ఢీ లాంటి సక్సెస్ ఫుల్ రియాలిటీ షోకి యాంకర్ గా రావడం చెప్పుకోదగ్గ విషయమే.

deepika pilli dance with Rashmi Gautam
Deepika Pilli : జోడీ రచ్చ..
పట్టుమని పాతికేళ్ళు నిండకుండానే గ్లామర్ తో సోషల్ మీడియాను ఏలేస్తుంది. మరోవైపు బుల్లితెరపై స్టార్ యాంకర్ గా ఎదగాలనే దిశగా ఆమె అడుగు వేస్తున్నారు. దీపికా పిల్లి ఢీ లాంటి పాప్యులర్ షోకి యాంకర్ గా రావడం చెప్పుకోదగ్గ విషయమే. ఇక రష్మీ విషయానికి వస్తే ఈ ముద్దుగుమ్మ ఒకవైపు టీవీ షోలు మరో వైపు సినిమాలు చేస్తూ నానా రచ్చచేస్తుంది. ఈ ఇద్దరు కలిసి సందడి చేస్తే వేరే లెవల్‌లో ఉంటుంది. అందుకు ఉదాహరణే ఈ వీడియో. ఈ వీడియొ ఇప్పుడు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది.