Samantha : డాక్టర్ మంతెన సత్యనారాయణ చెప్పిన చిట్కాతో .. త్వరలోనే కోలుకోబోతున్న సమంత..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Samantha : డాక్టర్ మంతెన సత్యనారాయణ చెప్పిన చిట్కాతో .. త్వరలోనే కోలుకోబోతున్న సమంత..!

 Authored By prabhas | The Telugu News | Updated on :29 November 2022,8:30 pm

Samantha : సమంత గత కొద్దికాలంగా మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాధిని ఎటువంటి మెడిసిన్ లేకుండా సహజ సిద్ధంగా పరిష్కరించుకోవచ్చు అంటున్నారు ప్రకృతి వైద్యులు మంతెన సత్యనారాయణ. ఈయనను తెలుగు రాష్ట్రాల వారు చాలామంది ఫాలో అవుతుంటారు. రెగ్యులర్ గా పలు టీవీ కార్యక్రమాలలో కూడా ఆయన ఆరోగ్య సలహాలు ఇస్తుంటారు. అయితే తాజాగా మయోసైటీస్ గురించి మాట్లాడుతూ శరీరంలో కండరాలకు వచ్చే పెద్ద సమస్యలలో ఒకటి మయోసైటీస్ అని చెప్పారు. మన శరీరంలో ఉండే రక్షక దళాలు కండరాల కణాలను దాడి చేస్తాయని,

అలా చేయడం వల్ల శరీరంలో తెల్ల రక్త కణాలు విడుదల చేసే కెమికల్స్ కండరాలపై ప్రభావం చూపినప్పుడు ఈ వ్యాధి వస్తుందని, లక్ష మందిలో 22 మందికి మాత్రమే వచ్చే అవకాశం ఉందని మంతెన తెలిపారు. ఈ వ్యాధి లక్షణాలు సరిగ్గా నడవలేకపోవడం, కండరాల పటుత్వం తగ్గడం, నడిచేటప్పుడు పడిపోవడం, చర్మవ్యాధులు, చర్మంపై మచ్చలు, గొంతు సమస్యలు, బాగా నిరసం అలసిపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటివి ఉంటాయి. ఈ వ్యాధి రావడానికి ప్రధాన కారణం ఆహారపు అలవాట్లు. అందుకే సరైన ఆహారం తీసుకుంటూ సహజ సిద్ధంగా తగ్గించుకునే మార్గాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆవనూనె, ముద్ద కర్పూరం కలిపి వేడి చేసి ఆ నూనెతో మసాజ్ చేసుకొని వేడి నీళ్ల కాపడం పెట్టుకోవాలి. ఇలా చేస్తే కండరాలకు ఉపశమనం కలుగుతుంది.

Dr Manthena Satyanarayana About Samantha Myositis Disease

Dr. Manthena Satyanarayana About Samantha Myositis Disease

నొప్పి ఎక్కువగా ఉన్న భాగంలో కట్లు కట్టుకొని కాపడం పెట్టుకోవాలి. బీ కాంప్లెక్స్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. వరి తవుడుని పుల్కా పిండిలో కలుపుకోవడం లేదా నీళ్లలో కలుపుకొని తీసుకున్నా మంచిది. మయోసైటీస్ వ్యాధి ని తగ్గించే పోషకాలు తవుడులో ఉంటాయి. ఉప్పు లేని ఆహారం కండరాల నొప్పికి మంచి నివారణ. ఉప్పు తీసుకోవడం ఆపేస్తే మయోసైటీస్ నుంచి పూర్తిగా బయటపడవచ్చు. ఉదయం గోధుమ గడ్డి జ్యూస్ తాగితే మంచిది. ఈ జ్యూస్ రక్తప్రసరణలో ఎటువంటి ఇబ్బందులేకుండా చేస్తుంది. సహజ సిద్ధమైన ఆహారం తీసుకుంటూ ఫిజియోథెరపీ చేయించుకుంటే త్వరగా నయం అవుతుంది. ముఖ్యంగా మానసిక ఒత్తిడికి గురవ్వకూడదు. రెగ్యులర్గా ధ్యానం, వ్యాయామం‌చేస్తే మయోసైటీస్ వ్యాధి నుంచి బయట

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది