Kannappa Movie : క‌న్న‌ప్ప స్టార్ క్యాస్టింగ్ అంత పెద్ద‌దా.. ఇందులో ఎవ‌రెవ‌రు ఉన్నారో తెలిస్తే ఆశ్చ‌ర్యపోతారు..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Kannappa Movie : క‌న్న‌ప్ప స్టార్ క్యాస్టింగ్ అంత పెద్ద‌దా.. ఇందులో ఎవ‌రెవ‌రు ఉన్నారో తెలిస్తే ఆశ్చ‌ర్యపోతారు..!

Kannappa Movie : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ క‌న్న‌ప్ప ఎంతో ప్ర‌తిష్టాత్మకంగా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. కన్నప్ప సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం వంటి మహామహులు నటిస్తుండ‌డంతో ఈ సినిమాపై అంచ‌నాలు భారీగా పెరిగాయి. ఈ మధ్యే ప్రభాస్ తన డేట్స్ కూడా ఇచ్చాడని, సెట్స్ మీదకు కూడా వచ్చిన‌ట్టు వార్త‌లు వినిపించిన కూడా దానిపై క్లారిటీ రాలేదు. అయితే మంచు విష్ణు తన […]

 Authored By ramu | The Telugu News | Updated on :8 April 2024,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Kannappa Movie : క‌న్న‌ప్ప స్టార్ క్యాస్టింగ్ అంత పెద్ద‌దా.. ఇందులో ఎవ‌రెవ‌రు ఉన్నారో తెలిస్తే ఆశ్చ‌ర్యపోతారు..!

Kannappa Movie : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ క‌న్న‌ప్ప ఎంతో ప్ర‌తిష్టాత్మకంగా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. కన్నప్ప సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం వంటి మహామహులు నటిస్తుండ‌డంతో ఈ సినిమాపై అంచ‌నాలు భారీగా పెరిగాయి. ఈ మధ్యే ప్రభాస్ తన డేట్స్ కూడా ఇచ్చాడని, సెట్స్ మీదకు కూడా వచ్చిన‌ట్టు వార్త‌లు వినిపించిన కూడా దానిపై క్లారిటీ రాలేదు. అయితే మంచు విష్ణు తన కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ సినిమాగా ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నాడు. ఈ భారీ చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తుండగా ఇండియా వైడ్ గా కూడా అనేకమంది భారీ తారాగణంని ఇందులో భాగం చేస్తున్నారు.

Kannappa Movie ఇంత భారీ క్యాస్టింగా..!

మంచు విష్ణు ప్ర‌ధాన పాత్ర పోషిస్తుండ‌గా, మోహ‌న్ బాబు , ప్ర‌భాస్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. మోహ‌న్ లాల్, శివ‌రాజ్ కుమార్, అక్ష‌య్ కుమార్, బ్ర‌హ్మ‌నందం, శ‌ర‌త్ కుమార్, కౌశ‌ల్ మందా, రాహుల్ మాధ‌వ్, దేవ‌రాజ్, న‌య‌న‌తార‌, ప్రీతి ముకుంద‌న్, ఐశ్వర్య భాస్క‌ర‌న్, మ‌ధు వంటి న‌టీన‌టులు సినిమాలో ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇంత భారీ తారాగ‌ణం సినిమాలో భాగం కావ‌డంతో అంచ‌నాలు అంత‌కంత‌కు పెరిగిపోతున్నాయి. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా మంచు మోహన్ బాబు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మాణం వహిస్తున్నారు. కన్నప్ప సినిమాకు సంబంధించి విష్ణు ప్రతీ విషయాన్ని ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Kannappa Movie క‌న్న‌ప్ప స్టార్ క్యాస్టింగ్ అంత పెద్ద‌దా ఇందులో ఎవ‌రెవ‌రు ఉన్నారో తెలిస్తే ఆశ్చ‌ర్యపోతారు

Kannappa Movie : క‌న్న‌ప్ప స్టార్ క్యాస్టింగ్ అంత పెద్ద‌దా.. ఇందులో ఎవ‌రెవ‌రు ఉన్నారో తెలిస్తే ఆశ్చ‌ర్యపోతారు..!

కన్నప్ప కోసం విష్ణు టీం న్యూజిలాండ్‌లో చాలా రోజులు హార్డ్ వ‌ర్క్ చేశారు. టీంలో అందరికీ గాయాలు అవుతున్నా కూడా షూటింగ్‌కు మాత్రం బ్రేక్ ఇవ్వ‌కుండా ముందుకు న‌డిపించారు. విష్ణుకి కూడా గాయాలయ్యాయి. ఇలా ఎన్ని అడ్డంకులు వచ్చినా కన్నప్ప న్యూజిలాండ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని వచ్చారు. మహా శివరాత్రి సందర్భంగా కన్నప్ప ఫస్ట్ లుక్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘కన్నప్ప’ సినిమాలో మహా శివుడి వేషం వేస్తున్నాడు ప్రభాస్. గతంలో తన పెదనాన్న కృష్ణంరాజు హీరోగా ‘భక్త కన్నప్ప’ సినిమా వ‌చ్చింది. ఇది కృష్ణంరాజుకి ఎంతో పేరు తెచ్చిపెట్టింది. ఇక ప్ర‌భాస్‌తో క‌న్న‌ప్ప సినిమాని రీమేక్ చేయాల‌ని కృష్ణంరాజు అనుకోగా, ఆ ప్రాజెక్ట్ విష్ణు చేతిలోకి చేరింది. అయితే చిత్రంలో మ‌హదేవుడి పాత్ర‌కి ప్ర‌బాస్ సూట్ అవుతాడ‌ని విష్ణు ఆయ‌న‌ని సంప్ర‌దించ‌డం, అందుకు ప్ర‌భాస్ ఓకే చెప్ప‌డం వెంట‌వెంట‌నే జ‌రిగిపోయాయి. క‌న్న‌ప్ప చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుంద‌ని అంద‌రు అనుకుంటున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది