Bigg Boss OTT Telugu : బాబోయ్.. ఆర్జే చైతూ ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్న ప్రేక్షకులు
Bigg Boss OTT Telugu : ఆర్జే చైతూ.. చాలెంజర్ గా బిగ్ బాస్ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటి వరకు ఆర్జే చైతూను వినడం తప్పితే చూసింది లేదు. ఎందుకంటే.. ఆయన ఆర్జే కాబట్టి.. ఆయన మాటలు విన్నారు కానీ.. ఎవ్వరూ ఆయన్ను చూసింది లేదు.
rj chaitu over action in bigg boss ott telugu
తొలిసారి బిగ్ బాస్ హౌస్ లో కనిపించినా.. చైతూను ఎందుకో ప్రేక్షకులు అడాప్ట్ చేసుకోలేకపోయారు. ప్రేక్షకులు మాత్రమే కాదు.. చివరకు ఇంట్లోని కంటెస్టెంట్లు కూడా చైతూను యాక్సెప్ట్ చేయలేదని లేటెస్ట్ ఎపిసోడ్స్ చూస్తే అర్థం అవుతోంది.
Bigg Boss OTT Telugu : కొబ్బరి కాయ టాస్క్ లో ఓవర్ చేసిన చైతూ
చైతూ ఓవర్ యాక్షన్ ఒక్క టాస్క్ లోనే తెలిసిపోయింది. కొబ్బరి కాయ పీచు వలిచే టాస్క్ లో సంచాలక్ గా చైతూను నియమించాడు బిగ్ బాస్. అయితే.. ఆ టాస్క్ ప్రకారం.. 15 నిమిషాలలో ఎటువంటి పరికరం లేకుండా కొబ్బరికాయలను వలచాలి.
దీంతో విట్ట మహేశ్ వారియర్స్ తరుపున ఆ టాస్క్ లో పార్టిసిపేట్ చేస్తాడు. పీచు లేకుండా అని చెప్పే సరికి.. కొబ్బరి కాయకు ఏమాత్రం పీచు లేకుండా వలిచేస్తాడు. 15 నిమిషాల్లో 5 కొబ్బరికాయలను వలిచేస్తాడు కానీ.. కొబ్బరికాయ అంటే పీచు కొంచెం ఉండాలని.. ఎవ్వరైనా కొబ్బరికాయ అంటే పీచు లేకుండా వలవరంటూ చైతూ అర్థం పర్థం లేని వాదనను తెర మీదికి తీసుకొస్తాడు.
ఆ విషయం వారియర్స్ కు చాలా చిరాకు తెప్పిస్తుంది. అంతకుముందు టాస్క్ లో నటరాజ్ మాస్టర్ ఏదో చేశాడని.. దాన్ని దృష్టిలో పెట్టుకొని చైతూ ఇలా ఓవర్ యాక్షన్ చేయడం ఏంటి అంటూ ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. చైతూ వాదనను చాలెంజర్స్ సమర్ధించినప్పటికీ అది ఏమాత్రం కరెక్ట్ కాదని అఖిల్ తో పాటు వారియర్స్ అందరూ చెప్పారు.
చివరకు బిగ్ బాస్ కూడా వారియర్స్ కే సపోర్ట్ చేశాడు. హౌస్ లోకి వచ్చి వారం కూడా కాలేదు కానీ.. ఇలాంటి ఎన్నో విషయాల్లో చైతూ చేసిన ఓవర్ యాక్షన్ ను మాత్రం ప్రేక్షకులు ఏమాత్రం తట్టుకోలేకపోతున్నారు. తన ఓవర్ యాక్షన్ తగ్గించుకోకపోతే చైతూ.. ఇంటి నుంచి అతి త్వరలోనే బయటికి వెళ్లిపోతాడని బిగ్ బాస్ అభిమానులు జోస్యం చెబుతున్నారు.