Sai Pallavi : పుష్ప 2లోకి సాయి పల్లవి వచ్చేస్తుందా.. ఇక క్రేజ్ పీక్స్‌లోనే..!
Sai Pallavi : లేడి పవర్‌స్టార్‌గా అభిమానులచే పిలిపించుకుంటున్న సాయి పల్లవి ఇటీవల వరుస చిత్రాలతో ప్రేక్షకులని పలకరించింది. అందులో కొన్ని మంచి విజయాలు సాధించగా, మరి కొన్ని పరాజయం చెందాయి. అయితే త్వరలో మంచి సినిమాలతో పలకరించేందుకు సిద్ధమవుతున్న సాయి పల్లవి కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న ట్టు సమాచారం. మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో సాయి పల్లవి పాత్ర పది నిముషాలు మాత్రమే ఉంటుంది. అదీ సెకండాఫ్ లో వస్తుంది. ఆమె ఓ గిరిజన యువతిగా కనిపించనుంది. అల్లు అర్జున్ కు సంభందించిన ఓ కీలకమైన సమాచారం కోసం ఆమె దగ్గరకు వస్తారని, ఆ తర్వాత జరిగే పరిణామాలు ఇంట్రస్టింగ్ గా ఉంటాయని చెప్తున్నారు. ఇక పుష్ప 2 చిత్రంలో కూడా సాయి పల్లవి గెస్ట్ రోల్‌లో మెరవనుందనే టాక్ నడుస్తుంది.
Sai Pallavi : నిజమెంత?
మొదట సాయి పల్లవి…ఇంత చిన్న గెస్ట్ రోల్ లాంటి పాత్రకు ఒప్పుకోలేదని ,కానీ మొత్తం ఆమెపై డిజైన్ చేసిన సీన్స్ చూసిన వెంటనే ఓకే చెప్పిందని తెలుస్తోంది. అయితే ఈ విషయమై అఫీషియల్ సమాచారం ఏమీలేదు. పుష్ప చిత్రం ఎవరూ ఊహించని విధంగా ప్యాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించింది. గ్లోబల్ సినిమాగా గుర్తింపు పొందింది. పుష్ప–2 అంతకుమించి ఉంటుంది. సుకుమార్ రాసిన కథ నెక్ట్స్ లెవల్లో ఉంది. నాక్కూడా చాలా ఎగ్జైట్ చేసిందీ కథ. మైండ్ బ్లోయింగ్ అనేలా కథ ఉంటుందని చెప్పగలను. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా కాకుండా సినిమా లవర్‌గా చెబుతున్నాను అన్నారు.
సాయి పల్లవి అడవుల్లో కనిపించే ఒక గిరిజన యువతి పాత్రలో కనిపించబోతోందని, పుష్పరాజ్ పాత్రకు ఈమె చిత్తూరు అడవుల్లో తారస పడుతుందని అప్పుడే వారిద్దరి మధ్య కొత్త ప్రేమాయణం మొదలవుతుందని తెలుస్తోంది. అయితే వీరిద్దరి ప్రేమ కథ కేవలం 20 నిమిషాలకు మాత్రమే పరిమితం అవుతుందని సమాచారం. ఇందులో నిజానిజాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉన్నాయి. ప్రస్తుతం ఇండియా వైడ్‌గా ఎంతో ఆసక్తి కనబరుస్తున్న చిత్రం ‘పుష్ప : ది రూల్’ . మొదటి భాగం సక్సెస్‌తో ఊపందుకున్న అంచనాల్ని అందుకోడానికి సుకుమార్ అండ్ టీమ్ చాలా కష్టపడుతోంది. స్ర్కిప్ట్ మీద చాలా సమయం వెచ్చించడం వల్ల సినిమా అనుకున్న టైమ్‌కు పట్టాలెక్కలేకపోయింది.